For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదరగొట్టిన టాటా: లాభాల్లో ఎయిర్‌టెల్, ఐటిసి

|

న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 18.5 శాతం పెరిగింది. 2012-13లో 5,27,047 కోట్ల రూపాయలు (96.79 బిలియన్ డాలర్లు)గా ఉండగా, 2013-14లో 6,24,757 కోట్ల రూపాయలు (103.27 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. దీంతో కేవలం ఏడాది వ్యవధిలో దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర టాటా గ్రూప్‌లోని సంస్థల ఆదాయం పెరిగినట్లైంది.

ఏడు వ్యాపార విభాగాల్లో విస్తరించిన టాటా గ్రూప్‌లో 100కుపైగా సంస్థలున్నాయి. దేశ, విదేశాల్లో విస్తరించిన టాటా గ్రూప్.. దేశీయంగానేగాక అంతర్జాతీయంగా కూడా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. 2013-14లో అంతర్జాతీయంగా 4,19,860 కోట్ల రూపాయల ఆదాయాన్ని టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. 2012-13లో 3,30,530 కోట్ల రూపాయల ఆదాయంతోనే సరిపెట్టుకుంది.

ఆరు ఖండాల్లోని 100కుపైగా దేశాల్లో టాటా గ్రూప్ కార్యకలాపాలు సాగుతుండగా, 150కిపైగా దేశాలకు టాటా గ్రూప్ ఉత్పత్తులు, సేవలు ఎగుమతి అవుతున్నాయి. ఇక టాటా గ్రూప్ నికర విదేశీ మారకద్రవ్యం ఆర్జన గత ఆర్థిక సంవత్సరం ఏకంగా 93.5 శాతం పెరిగింది. 2013-14లో 32,129 కోట్ల రూపాయలకు చేరింది. 2012-13లో ఇది 16,604 కోట్ల రూపాయలుగానే ఉంది.

Tata group to invest $35 billion in 3 years; FY14 revenue tops $100 billion

లాభాల్లో ఎయిర్‌టెల్

దేశీయంగా ప్రైవేట్‌రంగ టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో 60.9 శాతం పెరిగింది. ఈ ఏప్రిల్-జూన్ వ్యవధికిగానూ 1,108 కోట్ల రూపాయల లాభాన్ని మంగళవారం ఎయిర్‌టెల్ ప్రకటించింది. గత ఏడాది 689 కోట్ల రూపాయల నికర లాభంతోనే సరిపెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఆదాయం కూడా ఈసారి 13.3 శాతం ఎగబాకి 22,962 కోట్ల రూపాయలను తాకింది. క్రిందటిసారి 20,264 కోట్ల రూపాయలను అందుకుంది. ‘కన్సాలిడెటెడ్ మొబైల్ డేటా ఆదాయం 2,204 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే ఇది 73.9 శాతం వృద్ధి చెందింది.' అని ఎయిర్‌టెల్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ఆకట్టుకున్న ఐటిసి

బహుళ వ్యాపార దిగ్గజ సంస్థ ఐటిసి లిమిటెడ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గతంతో పోల్చితే 15.6 శాతం పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2,186.39 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఎఫ్‌ఎమ్‌సిజి, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో జరిగిన భారీ అమ్మకాలే దీనికి కారణం. కాగా, గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 1,891.33 కోట్ల రూపాయల నికర లాభాలను ఐటిసి పొందింది. ఇక నికర అమ్మకాలు 24.88 శాతం పెరగగా, ఈసారి 9,164.42 కోట్ల రూపాయలుగా, పోయినసారి 7,338.52 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

English summary

అదరగొట్టిన టాటా: లాభాల్లో ఎయిర్‌టెల్, ఐటిసి | Tata group to invest $35 billion in 3 years; FY14 revenue tops $100 billion

Tata group will invest $35 billion in the next three years as part of its vision 2025 by when it expects to achieve market capitalisation comparable to the world's top 25 companies.
Story first published: Wednesday, July 30, 2014, 12:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X