For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్నారైలను సొంతవారిగా చూడండి: స్వరాజ్ పాల్

|

NRI deposits in India about $65 billion in last 6 months: Lord Swaraj Paul
న్యూఢిల్లీ: భారత్‌లో జన్మించి విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ)నూ సొంతవారిగానే పరిగణించాలని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త, క్యాపరో గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ లార్డ్ స్వరాజ్ పాల్ భారత్‌ను కోరారు. ప్రవాస భారతీయులు తమ సొంత గడ్డకు ఎంతో చేయూత ఇస్తున్నప్పటికీ దేశాభివృద్ధిలో వారి పాత్రను భారతదేశం పట్టించుకోవడంలేదని న్యూఢిల్లీలో ఎన్ఆర్ఐ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన విందులో పాల్గొన్న సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు.

గడిచిన ఆరు నెలల్లో డిపాజిట్ల ద్వారా భారత్‌లోకి దాదాపు 65 బిలియన్ డాలర్లను ఎన్‌ఆర్‌ఐలు పంపించారన్నారు. అయినప్పటికీ దేశాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు చేస్తున్న కృషిని ప్రభుత్వం మరిచిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రమాదకర స్థాయిలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) పేరుకుపోయిన క్రమంలో ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పిలుపుతో ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లోకి భారీగా నిధులను తరలిస్తున్నారని గుర్తుచేశారు.

1990 దశకంలో భారత ఆర్థిక విధానాలు సరళీకృతం చేసి విదేశీ పెట్టుబడులకు ఆర్థిక రంగాన్ని తెరిచినప్పుడు కూడా ఎన్ఆర్ఐలే దన్నుగా నిలిచారన్న సంగతి ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ఎన్‌ఆర్‌ఐలు కూడా భారత్‌లో భాగమేనన్న సత్యాన్ని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్‌లోని ప్రతి ఒక్కరు తాము భారతీయులమని గర్వపడాలని స్వరాజ్ పాల్ అన్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై స్పందిస్తూ భారతీయ ఓటర్లు లంచాలకు ప్రభావితం కాబోరన్నారు.

‘భారత్‌లోని పత్రికలైనా, ఐరోపా లేదా ప్రపంచంలోని ఏ దేశ మీడియా అయినా భారతీయ ఓటర్లు లంచాలు తీసుకుంటున్నారని అంటున్నాయి. ఇదంతా అబద్ధం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరికి ఓటేయాలనుకుంటారో వారికే ఓటేస్తారు. నా దృష్టిలో భారత్‌లో అసలైన విజేతలు ఓటర్లు మాత్రమే.' అని స్వరాజ్ పాల్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అన్న ఆయన, రాజకీయ పార్టీలు పేదరికం, విద్య వంటి వాస్తవిక అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.

English summary

ఎన్నారైలను సొంతవారిగా చూడండి: స్వరాజ్ పాల్ | NRI deposits in India about $65 billion in last 6 months: Lord Swaraj Paul


 Reminding the role played by non-resident Indians (NRIs) in the country's development, UK-based leading industrialist Lord Swraj Paul has said almost $ 65 billion have come into India in the last six months through NRI deposits.
Story first published: Wednesday, April 23, 2014, 10:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X