For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీ పెట్టుబడుల జోరు: రూ. లక్షకోట్ల టర్నోవర్

|

న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో ఇప్పటిదాకా దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) తీసుకొచ్చిన పెట్టుబడులు దాదాపు 6,800 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలుచేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న అంచనాల మధ్య విదేశీ మదుపర్లు దేశీయ స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులోభాగంగానే ఈ ఏడాది ఆరంభం నుంచి ఎఫ్‌ఐఐలు మొత్తం 28,979 కోట్ల రూపాయల (4.78 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను భారతీయ స్టాక్‌మార్కెట్లలోకి తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఎఫ్‌ఐఐలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారని హెచ్‌ఎస్‌బిసి అసెట్ మేనేజ్‌మెంట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ పునీత్ చద్దా అన్నారు.. ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అది వివిధ సంస్కరణలను చేపడుతుందని వారు విశ్వాసంతో ఉన్నాని చెప్పారు. భారత స్థూల ఆర్థిక మూలాలపైనా వారు నమ్మకంతో ఉన్నారని వెల్లడించారు.

ఇక ఏప్రిల్‌లో ఎఫ్‌ఐఐలు స్టాక్‌మార్కెట్లలోకి 49,775 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారు.
ఇందులో 42,992 కోట్ల రూపాయల పెట్టుబడులను తిరిగి వెనక్కి తీసుకున్నారు. దీంతో నికర పెట్టుబడుల విలువ 6,783 కోట్ల రూపాయలు (1.3 బిలియన్ డాలర్లు)గా ఉందని స్టాక్‌ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి పేర్కొంది. ఏప్రిల్ నెలలో ఇప్పటిదాకా విదేశీ పెట్టుబడుల కారణంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్ 243 పాయింట్లు పెరిగింది.

FIIs invest Rs 6,783 crore in Indian stock market in April

అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రవేశపెట్టిన 85 బిలియన్ డాలర్ల ఉద్దీపన పథకాలను నెలకో 10 బిలియన్ డాలర్ల చొప్పున జనవరి నుంచి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తుండటంతో, ఆ ప్రభావం దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి వచ్చే ఎఫ్‌ఐఐ పెట్టుబడులపై పడింది. అయితే క్రమక్రమంగా ఆ ప్రభావం తగ్గిపోవడంతో పెట్టుబడులు తిరిగి పుంజుకోగలిగాయి. ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, దానికి పారిశ్రామికాభివృద్ధిని కాంక్షించే ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తారన్న అంచనాలూ ఎఫ్‌ఐఐ పెట్టుబడులకు దోహదం చేశాయి.

లక్ష కోట్లు పెరిగిన స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల టర్నోవర్

జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కోలుకున్న క్రమంలో గత ఆర్థిక సంవత్సరం 2013-14లో దేశంలోని మూడు అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నగదు టర్నోవర్ 2.59 శాతం (దాదాపు లక్ష కోట్ల రూపాయలు) పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఇ), బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా (బిఎస్‌ఇ)లతోపాటు మల్టీ కమాడిటీ స్టాక్ ఎక్స్‌చేంజ్ లిమిటెడ్ (ఎమ్‌సిఎక్స్-ఎస్‌ఎక్స్)ల నగదు టర్నోవర్ 33.41 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2012-13లో ఈ మూడు స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల క్యాష్ టర్నోవర్ 32.57 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఆ రికార్డు 2013-14లో స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు అధిగమించాయి. ఇక ఈ మూడింటికి సంబంధించిన ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ 2013-14లో 466 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.

English summary

విదేశీ పెట్టుబడుల జోరు: రూ. లక్షకోట్ల టర్నోవర్ | FIIs invest Rs 6,783 crore in Indian stock market in April

Foreign investors have pumped in about Rs 6,800 crore ($1.3 billion) in the domestic stock market so far this month on hopes a reform-oriented government will be formed after the general elections.
Story first published: Monday, April 21, 2014, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X