For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

28శాతం వృద్ధి నమోదు చేసిన ఇండియాఫస్ట్

|

IndiaFirst Life continues it growth story; grows by 28% in FY 2013-14
ముంబై: దేశంలోని నూతన బీమా సంస్థలలో ఒకటైన ఇండియాఫస్ట్ లైఫ్ మరో ఘనతను సాధించింది. 2013-14 సంవత్సరానికి 28శాతం వృద్ధిని సాధించింది. ఈ వివరాలను ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి. నందగోపాల్ వెల్లడించారు. బీమా సంస్థల నియమావళిలో మార్పులు, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ఇండియాఫస్ట్ సంస్థ వృద్ధి 2012-13లో రూ. 1316 ఉండగా 2013-14 సంవత్సరానికి రూ. 1681 కోట్లకు చేరుకుంది.

మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవహరిస్తున్న తమ సామర్థ్యానికి నిదర్శనమే ఈ ఫలితాలని నందగోపాల్ అన్నారు. తమ వినియోగదారులు కూడా తమపై నమ్మకముంచి తమ సంస్థ వృద్ధిలో భాగస్వాములయ్యారని తెలిపారు. భవిష్యత్‌లో వినియోగదారులకు మరింత చేరువగా తమ ఉత్పత్తులను, సేవలను తీసుకెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. వినియోగదారులకు ఉత్తమ సేవలందించటమే తమ లక్ష్యమని నందగోపాల్ తెలిపారు.

సుమారు 2.4 మిలియన్ల జీవితాలను తమ కంపెనీ కవర్ చేసిందని, 2013-14 సంవత్సరానికి రూ. 6,500 కోట్లుగా ఏయుఎం(అస్సెట్స్ అండర్ మేనేజ్‌మెంట్) ఉందని తెలిపారు. ప్రస్తుతం నాలుగు కీలక వ్యాపార విభాగాలు ఆరోగ్యం, భద్రత, పొదు, సంపదలను వినియోగదారుల ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పారు. పెన్షన్, మైక్రో-ఇన్స్యూరెన్స్ సెగ్మెంట్లలో కూడా తమదైన ముద్ర వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

పరిశ్రమల్లో పని చేస్తున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలపై దృష్టి సారిస్తున్నట్లు నందగోపాల్ తెలిపారు. మైక్రో ఇన్స్యూరెన్స్ ద్వారా ప్రజల వద్దకు తమ సేవలను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. డిజిటల్, కార్పొరేట్ వ్యాపాలరను విస్తరించడం ద్వారా ఇండియాఫస్ట్ తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.

2009-10లో సంస్థ ప్రారంభించిన 200 రోజుల్లోనే రూ. 200 కొత్త వ్యాపార ప్రీమియంను సాధించినట్లు తెలిపారు. ఆ వృద్ధి అదేవిధంగా కొనసాగి 2010-11లో రూ. 704 కోట్లు, 2011-12లో రూ. 982 కోట్లు, 2012-13లో 1316 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. ఇండియాఫస్ట్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో నూతన సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పాలసీలను డిమేటిరియలైజ్డ్ ఫార్మాట్లోనే అందిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల 2013 ఇండియన్ ఇన్స్యూరెన్స్ అవార్డ్స్ ‘మ్యాజిక్ బోర్డ్'లో టెక్నాలనజీ ఇన్నోవేషన్ అవార్డును సాధించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఇండియాఫస్ట్ దేశంలోని 1000కి పైగా నగరాల్లో 8వేలకు పైగా భాగస్వామ్య బ్యాంక్ (బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంక్), ఆర్‌ఆర్‌బి బ్రాంచుల ద్వారా సేవలందిస్తోంది. 2009, నవంబర్ 16న ప్రారంభమైన ఇండియాఫస్ట్.. సరసమైన ధరలలో తన ఉత్పత్తులను, సేవలను ప్రజలకు అందిస్తోంది. అంతేగాక ఈ కంపెనీ గొప్ప పని స్థలాలు కలిగిన వంద కంపెనీల్లో ఒకటిగా ఉంది.

English summary

28శాతం వృద్ధి నమోదు చేసిన ఇండియాఫస్ట్ | IndiaFirst Life continues it growth story; grows by 28% in FY 2013-14

One of the youngest life insurers in the country, IndiaFirst Life recorded another successful year, growing by 28% in FY 2013-14. The announcement was made by Dr. P. Nandagopal, Managing Director & CEO, IndiaFirst Life Insurance.
Story first published: Friday, April 11, 2014, 12:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X