For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టి రాష్ట్రం: జోరుగా హైదరాబాద్ ప్రాపర్టీ అమ్మకాలు

|

Property sales in Hyderabad expected to pick up after Telangana statehood
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కొనసాగిన రాజకీయ అనిశ్చితి కారణంగా హైదరాబాద్ నగరంలో 2013లో 4శాతం గృహ అమ్మకాలు పడిపోయి 16,500 యూనిట్లుగా ఉందని ప్రాపర్టీ కన్సల్టంట్ నైట్‌ ఫ్రాంక్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజనపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోవడంతో ఈ ఏడాది చివరినాటికి మళ్లీ హైదరాబాద్‌లో ప్రాపర్టీ అమ్మకాలు అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది.

2013లో ఒడిగుడుకులకు లోనైన హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ కొంత మేర పడిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. 2012 సంవత్సరంతో పోల్చితే 2013లో 4శాతం తగ్గినట్లుగా తెలిపింది. సుమారుగా 16,500 రెసిడెన్షియల్ యూనిట్లు తగ్గిపోయాయని నైట్ ఫ్రాంక్ తన నివేదికలో పేర్కొంది. కొత్తగా ప్రారంభమయ్యే యూనిట్లు కూడా 2013లో 15 శాతం పడిపోయాయని తెలిపింది. 2012లో 19వేలుగా ఉన్న యూనిట్లు 2013 నాటికి 16,500కు పడిపోయినట్లు వివరించింది.

2013లో దేశంలోని ఇతర రెసిడెన్షియల్ మార్కెట్ల కంటే కూడా హైదరాబాద్‌లో అమ్మకాలు నెమ్మదించాయని తెలిపింది. ఇందుకు పలు కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక వృద్ధిరేటులో మందగమనం, బ్యాంకులు వడ్డీ రేటును పెంచడం, పెరిగిన ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత్వం మొదలగు కారణాలు కూడా రెసిడెన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపాయని తెలిపింది. ఇతర ఐటి, ఐటిఈఎస్ రంగాలలో ఆధిక్యాన్ని చాటుకుంటున్న నగరాలైన చెన్నై, పుణెలతో పోల్చుకుంటే హైదరాబాద్ పరిస్థితి మెరుగ్గానే ఉందని ఫ్రాంక్ నైట్ తెలిపింది.

ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ జూన్ 2న ఏర్పాటు కానుండటంతో ఇప్పటివరకు నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లయిందని నివేదిక పేర్కొంది. రాష్ట్ర విభజన సమస్య కొలిక్కి రావడంతో ఈ ఏడాది చివరి నాటికి లేదా 2015 సంవత్సరం ఆరంభంలో హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్ తిరిగి పుంజుకోనుందని ఫ్రాంక్ నైట్ పేర్కొంది. గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ మార్కెట్ ధరలు స్థిరంగా ఉన్నాయని తెలిపింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 2009 నుంచి 13 శాతం మాత్రమే ధరల పెరుగుదల నమోదు చేసిందని పేర్కొంది.

అదే సమయంలో ఇతర ఐటి నగరాలైన బెంగళూరు, పుణె, చెన్నైలు 38 శాతం ధరల పెరుగుదలను నమోదు చేశాయని ఫ్రాంక్ నైట్ తెలిపింది. దేశంలోని ఇతర నగరాలు ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతాల కంటే కూడా హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ మార్కెట్ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఇక్కడ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని ఫ్రాంక్ నైట్ నివేదిక పేర్కొంది.

English summary

టి రాష్ట్రం: జోరుగా హైదరాబాద్ ప్రాపర్టీ అమ్మకాలు | Property sales in Hyderabad expected to pick up after Telangana statehood

Hyderabad saw 4 per cent drop in housing sales in 2013 to 16,500 units but volumes are expected to pick up from year-end on hopes that uncertainties will fade away with the decision to form Telangana, said property consultant Knight Frank.
Story first published: Thursday, March 6, 2014, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X