For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్టిపిసి చేతికి రామగుండం బిపిఎల్!

|

ntpc
హైదరాబాద్/రామగుండం: పలు కారణాలతో నిర్మాణం పనులు ఆగిపోయిన రామగుండం బిపిఎల్ పవర్ ప్లాంటును ఎన్టిపిసి దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రామగుండం వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు పదేళ్ల క్రితమే బిపిఎల్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అన్ని అనుమతులు తీసుకుని ప్రారంభించింది.

కాగా ప్రభుత్వం నుండి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పిపిఎ)తోపాటు పలు కారణాల వల్ల నిర్మాణం పనులను నిలిపివేశారు. 12 సంవత్సరాల నుండి నిర్మాణం పనులు నిలిచిపోవడంతో బిపిఎల్ ప్లాంట్‌ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకవచ్చి ఎపి జెన్‌కో ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. అయితే 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఎపి జెన్‌కో సకాలంలో స్పందించకపోవడంతో ప్రభుత్వం ఎన్టిపిసికి సూచించింది. దీంతో ఎన్టిపిసి అధికారుల బృందం రామగుండం బిపిఎల్ ప్లాంట్‌ను సందర్శించి పలు అనుమతులు తీసుకుని, యూనిట్ ఏర్పాటు చేసే భూములను పరిశీలించారు.

పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం సింగరేణి నుండి కోల్ లింకేజీ, పర్యావరణ అనుమతులు, నీటి టాయింపులతోపాటు అనేక అనుమతులను పొంది సిద్ధంగా ఉండడంతో ఎన్టిపిసి దీన్ని సాధ్యమైనంత త్వరలో దక్కించుకోవాలని ముందుకు సాగుతుంది. ఇప్పటికే బిపిఎల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం 2వేల ఎకరాల భూమిని రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా ప్లాంట్‌కు చెందిన కూలీంగ్ టవర్లు, టర్బైన్ జనరేటర్ తదితర నిర్మాణం పనులను ప్రారంభించి ఆదిలోనే నిలిపివేశారు. అదేవిధంగా ప్లాంట్ నుండి వెలువడే బూడిద కోసం యాష్ పాండ్ కోసం కూడా స్థల సేకరణ చేసి సిద్ధంగా ఉంచారు.

కేవలం పిపిఎ అగ్రిమెంట్‌తో ముడిపడి ఉండడంతో దీన్ని బిపి‌ఎల్ యాజమాన్యం సాధించుకోలేక పోయింది. దీంతో 12 సంవత్సరాల నుండి నిర్మాణం పనులు ముందుకు సాగలేదు. ఎట్టకేలకు దీనిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో భారీ విద్యుత్ సంస్థ అయిన ఎన్టిపిసి ముందుకు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రామగుండం వద్ద 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్న ప్రాజెక్టుకు అతీ సమీపంలోనే బిపిఎల్ పవర్ ప్లాంట్ కలిగి ఉండడం ఎన్టిపిసికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

అంతేగాక ఎన్టిపిసి కూడా స్థానికంగా మరో రెండు యూనిట్లను ఏర్పాటు చేయాలని నిశ్చయంతో ఉండగా బిపిఎల్‌ను పొందాలని ప్రభుత్వం సూచించడంతో వెంట వెంటనే పనులను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే బిపిఎల్ చిక్కుముడి వీడి ఎన్టిపిసి చేతుల్లోకి చేరనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

English summary

ఎన్టిపిసి చేతికి రామగుండం బిపిఎల్! | Ramagundam BPL power plant handed over to NTPC

The Andhra Pradesh government has decided to hand over the lands allocated to BPL power plant to the NTPC to take up a power project.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X