For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొనసాగని లాభాలు: స్పెక్ట్రమ్ ధర పెంపు

|

Sensex falls
ముంబై/న్యూఢిల్లీ: మార్కట్ ప్రారంభ లాభాలు కొనసాగలేకపోయాయి. వరుసగా మూడో రోజు కూడా సూచీుల నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచి నమోదైన లాభాలను దేశీయ స్టాక్‌మార్కెట్లు సాయంత్రం వరకు కూడా నిలబెట్టుకోలేకపోయాయి. ట్రేడింగ్ సమయం దగ్గరపడుతున్నకొద్దీ మదుపర్లలో లాభాల స్వీకరణపై దృష్టి సారించడంతో.. ఆటో, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడికి దారి తీసింది. అయితే క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతు భారీ నష్టాలను కొంతవరకు నియంత్రించాయి.

కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన పథకాల కొనసాగింపుపై అనుమానాలు.. క్షీణించిన విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) కొనుగోళ్ల మధ్య స్టాక్‌మార్కెట్లు మూడోరోజూ నష్టాలపాలయ్యాయి. బిఎస్ఈ సూచీ సెన్సెక్స్ 11.66 పాయింట్లు పడిపోయి 20,217.39 పాయింట్ల వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 3.6 పాయింట్లు దిగజారి 5,995.45 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. మధ్యాహ్న సమయంలో సెనె్సక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లపైన కదలాడగా, ముగింపు సమయం సమీపిస్తున్నకొద్దీ మదుపర్లు అమ్మకాలకు దిగడంతో లాభాలు క్షీణించాయి. మొత్తం మూడు సెషన్లలో సెన్సెక్స్ 673 పాయింట్లు కోల్పోయి నవంబర్ 13 నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది.

స్పెక్ట్రమ్ ధర పెంపు: రెట్టింపు అపరాధ రుసుము

మొబైల్ ఫోన్ సర్వీసులకు వినియోగించే స్పెక్ట్రమ్ వేలం రిజర్వు ధరను 25 శాతం వరకు పెంచేందుకు ఉన్నత స్థాయి మంత్రుల బృందం ఆమోదముద్ర వేసింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో వేలం ప్రక్రియను చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోని సారధ్యంలో సాధికార మంత్రుల బృందం (ఇజిఒఎం) శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా టెలికాం కమిషన్ సూచించిన మేరకు 1800 మెగాహెట్జ్, 900మెగా హెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కనీస ధరలకు అంగీకారం తెలిపారు.

కాగా సెల్‌ఫోన్ టవర్ల రేడియేషన్ స్థాయికి సంబంధించి విధించిన నిబంధనల ఉల్లంఘనపై ప్రస్తుతం ఉన్న జరిమానాను టెలికాం శాఖ రెట్టింపు(రూ. 10లక్షలు) చేసింది. రేడియేషన్ నిబంధనలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనకైనా ఇప్పటిదాకా గరిష్ఠంగా ఐదు లక్షల రూపాయలను జరిమానాగా విధించిన టెలికాం శాఖ.. ఇప్పుడు ఆ జరిమానాను 10 లక్షల రూపాయలకు పెంచింది. అయితే ఇదే సమయంలో నిబంధనలపై సెల్ఫ్-సర్టిఫైడ్ డాక్యుమెంట్ల సమర్పణలో జరిగే ఆలస్యంపై విధిస్తున్న జరిమానాను టెలికాం శాఖ భారీగా తగ్గించింది. సవరించిన జరిమానాల విధానం ప్రకారం గరిష్ఠంగా 50,000 రూపాయలను నిర్ణయించింది.

English summary

కొనసాగని లాభాలు: స్పెక్ట్రమ్ ధర పెంపు | Sensex falls 11.66 points to end at 20,217.39

The Sensex on Friday closed 12 points down, logging its third straight weekly loss, as uncertainity over US Fed tapering its economic stimulus hit positive sentiment that helped the benchmark log gains initially.
Story first published: Saturday, November 23, 2013, 10:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X