For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాటాదారులు-డిబెంచరుదారులకు మధ్య గల తేడాలేంటి?

|

What is the difference between shareholder and debenture-holder of a company?
ఒక కంపెనీ యొక్క వాటాలను కలిగి ఉన్న వారిని వాటాదారులని, డిబెంచర్(రుణ) పత్రాలను కలిగి ఉన్న వారిని డిబెంచరుదారులని అంటారు. కంపెనీకి సంబంధించి వాటాదారులకు, డిబెంచరుదారులకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. కంపెనీ యాజమాన్యంలో వాటాదారులు యజమానులుగా భావింపబడతారు అదే సమయంలో డిబెంచరుదారులు కంపెనీకి రుణదాతలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని వ్యత్యాసాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

కంపెనీ మేనేజ్‌మెంట్

కంపెనీలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాటాదారుల ప్రతినిధులుగా ఉంటూ కంపెనీ వ్యవహారాల నియంత్రణ, క్రమబద్దీకరణ చేస్తారు. అదే సమయంలో డిబెంచరుదారులకు కంపెనీ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు.

వార్షిక సమావేశం

వాటాదారులకు కంపెనీ సాధారణ వార్షిక సమావేశంలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాగా డిబెంచరుదారులకు ప్రత్యేక సమయంలో తప్ప ఈ సమావేశానికి ఆహ్వానం ఉండదు.

వార్షిక నివేదిక

కంపెనీ ఆర్థిక నివేదికతోపాటు వార్షిక నివేదికను కూడా వాటాదారులకు అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశం డిబెంచరుదారులకు లేదు.

వడ్డీ ఆదాయం

కంపెనీకి లాభాలు వచ్చిన సమయంలో వాటాదారులకు కొంత మొత్తాన్ని డివిడెండ్ రూపంలో అందజేయడం జరుగుతుంది. డిబెంచరుదారుల విషయంలో కంపెనీలు లాభనష్టాలతో సంబంధం లేకుండా స్థిరమైన రేటుతో వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. లాభాలు రాని సమయంలో ఒప్పందంలో కుదుర్చుకున్న విధంగా మూలధనం నుంచి కూడా వడ్డీని చెల్లించడం జరుగుతుంది.

ఈక్విటీ లేదా డిబెంచర్ మార్పిడి

వాటాదారులు తమ వాటాలను డిబెంచర్ రూపంలోకి మార్చుకోవడానికి వీలులేదు. డిబెంచరుదారులు తమ డిబెంచర్లను మాత్రం ఈక్విటీలోకి మార్చుకునేందుకు వీలుంటుంది.

మార్చుకునేందుకు వీలైన డిబెంచర్ల జారీ

డిబెంచర్ల రూపంలోకి మార్చుకునేందుకు వీలైన వాటాలను కంపెనీలు జారీ చేయడానికి వీలుపడదు. డిబెంచరు పత్రాల యజమాని ఇష్ట ప్రకారం ఈక్విటీ రూపంలోకి మార్చుకునేందుకు వీలైన విధంగా కంపెనీలు డిబెంచర్లను జారీ చేయవచ్చు.

కంపెనీ మూసివేత ప్రభావం

ఒక వేళ కంపెనీ మూసివేసే పరిస్థితి ఏర్పడితే వాటాదారుల కంటే ముందే డిబెంచరుదారులకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ మూసివేత సమయంలో సురక్షిత రుణదాతల కంటే ముందుగానే డిబెంచరుదారులకు వడ్డీ చెల్లించడం జరుగుతుంది.

English summary

వాటాదారులు-డిబెంచరుదారులకు మధ్య గల తేడాలేంటి? | What is the difference between shareholder and debenture-holder of a company?


 Shareholders and debenture holders as the two terms relate refer to individuals holding shares and debentures respectively. Both the shareholders and debenture holders are different in several perspectives but the major difference is in their relationship with the company.
Story first published: Thursday, October 31, 2013, 18:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X