For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురోగమన దిశగా దేశీయ పారిశ్రామిక రంగం

|

Factory output grows at 2.6%, raising hopes of recovery
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం పురోగమనం వైపు నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలం తిరోగమనంలో సాగుతున్న పారిశ్రామిక రంగానికి చిరు అశాకిరణం దొరికినట్లు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జులైలో పారిశ్రామిక ఉత్పత్తుల రంగం అనూహ్యంగా అభివృద్ధి సాధించింది.

దాదాపు రెండునెలలపాటు కొనసాగిన తిరోగమనానికి స్వస్తి పలుకుతూ ఐఐపి సూచీ కోలుకోవడం పారిశ్రామిక, వాణిజ్యరంగాల్లో ఉత్సాహాన్ని కలిగించింది. ఆర్‌బీఐ, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే ఈ ఉత్సాహం కొనసాగే అవకాశాలుంటాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.

గత కొన్ని నెలలుగా నిరుత్సాహంగా ఉన్న పారిశ్రామిక రంగం పనితీరు జులైలో ఒక్కసారిగా పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ జులైలో పారిశ్రామిక ఉత్పత్తుల సూచి (ఐఐపి) 2.6 శాతం వరకు పెరిగింది. మే, జూన్ రెండు నెలల్లోనూ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో తిరోగమనంలోనే ఉంది. అయితే జులైలో కూడా పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో 0.5 శాతం మేర తిరోగమనంలోనే ఉంటుందన్న అంచనాలు వెలువడ్డాయి. కాగా అనూహ్యంగా పెరుగుదల నమోదు చేయడం పారిశ్రామిక వర్గాలకు కొంత మేర ఊరట లభించినట్లు చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందన్న ఆశలు మరింత పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా డిమాండ్ మందగించిన కారణంగా పారిశ్రామిక రంగం బలహీనంగా మారింది. మరోవైపు అనుమతిలో జాప్యం కారణంగా వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టులు ఆగిపోయాయి. వడ్డీ రేట్లు పెరగడం, ఊహించిన విధంగా ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయకపోవడంతో పెట్టుబడులు పెట్టే వాతావరణం పూర్తిగా కుదేలైందని చెప్పవచ్చు.

జులైలో పారిశ్రామిక ఉత్పత్తుల్లో పెరుగుదల, విద్యుత్ ఉత్పత్తి మెరుగ్గా ఉండటం ఐఐపి గణాంకాలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఐఐపిలో 75 శాతం వాటా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తుల విభాగం జులైలో 3 శాతం వరకు వృద్ధి సాధించింది. క్యాపిటల్ గూడ్స్ విభాగం గత ఏడాది జులైలో 5.8 శాతం తిరోగమనంలో ఉండగా ఈ జులైలో 15.6 శాతం పురోగతి సాధించింది. మైనింగ్ రంగం మాత్రం జులైలోనూ 2.3 శాతం మేర తగ్గింది. అయితే మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో 11 రంగాలు సానుకూలంగా ఉండడం పారిశ్రామిక వర్గాలకు మంచి సంకేతంగా చెప్పవచ్చు.

ప్రభుత్వ వివరాల ప్రకారం..ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం జులైలో 11.64ఉండగా అది ఆగస్టులో 11.06శాతానికి తగ్గింది. జులైలో 9.64శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.52శాతానికి తగ్గింది. కూరగాయల విభాగంలో మాత్రం 16.4 నుంచి 26.48శాతం పెరుగుదల నమోదు చేసింది.

జులైలో పారిశ్రామిక ఉత్పత్తుల వృద్ధి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం మాత్రం ఇంకా పారిశ్రామిక రంగాలను భయపెడుతూనే ఉంది. అయితే ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తే ఆర్థిక రంగానికి మరింత ఊపు వచ్చే అవకాశం లేకపోలేదు.

English summary

పురోగమన దిశగా దేశీయ పారిశ్రామిక రంగం | Factory output grows at 2.6%, raising hopes of recovery

Industrial production grew 2.6 per cent in July, expanding for the first time in three months, on improved performances in the manufacturing and power sectors, raising hopes of a recovery and expectations the RBI will cut interest rates to boost consumer demand.
Story first published: Friday, September 13, 2013, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X