For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ సర్వీసుల్లో ఆదాయపరంగా తారాపథంలో దూసుకెళ్తున్న కాగ్నిజంట్

By Nageswara Rao
|

Cognizant
న్యూఢిల్లీ: మొన్నటి వరకు భారతదేశ ఐటీ రంగంలో రెండో స్దానంలో నిలిచిన ఇన్సోసిస్ మెల్లమెల్లగా దిగజారుతూ వస్తుంది. 2012 సంవత్సరానికి గాను ఆదాయపరంగా అత్యధిక వృద్ది రేటు సాధించిన భారత ఐటీ కంపెనీగా కాగ్నిజంట్ నిలిచిందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్ద గార్టనర్ పేర్కొంది. ఇది మాత్రమే కాదు, 710 కోట్ల డాలర్ల ఆదాయంతో మైసూర్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఇన్సోసిస్‌ను అధిగమించి భారతదేశంలో రెండో అతి పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీగా కాగ్నిజంట్ అవతరించిందని గార్టన్ర్ రీసెర్చ్ డైరెక్టర్ అరుప్ రాయ్ పేర్కొన్నారు.

(Cibil marketplace: Why you need to visit it before taking a loan?)

భారతదేశానికి చెందిన టాప్ ఐదు ఐటీ కంపెనీల ఆదాయాల మొత్తం 2001లో 3,030 కోట్ల డాలర్లు కాగా.. అదే 2012లో 13 శాతం వృద్దితో 3,430 కోట్ల డాలర్లకు పెరిగిందన్నారు. ఈ వృద్ది శాతం భారత్ లోని ఐటీ సర్వీసుల పరిశ్రమ వృద్ది (2 శాతం) తో పోల్చితే చాలా ఎక్కువని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సర్వీసుల వృద్దిని, అంతర్జాతీయంగా టాప్ పది కంపెనీల ఆదాయాల వృద్దితో పోల్చి చూస్తే భారతదేశపు ఐటీ కంపెనీల వృద్ది ఎక్కవగా ఉందని పేర్కొన్నారు.

భారత ఐటీ కంపెనీల వృద్ధి రేటు గత కొంతకాలంగా తగ్గినప్పటికీ, గత ఐదేళ్లలో ఈ ఐదు ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలోనే అవుట్‌సోర్సింగ్‌ను చేస్తున్నాయని తెలిపారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ రంగంలో భారత ఐటీ కంపెనీలు పాస్ట్‌గావ్యవహరిస్తున్నాయని తెలిపారు.

భారత్‌లో ప్రధానంగా డెలివరీ, నిర్వహణ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను భారత ఐటీ కంపెనీలుగా గార్ట్‌నర్ సంస్థ పరిగణనలోకి తీసుకుంది. విదేశాలకు చెందిన చాలా ఐటీ కంపెనీలు భారత్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. జెన్‌ప్యాక్ట్, కాగ్నిజంట్, సింటెల్, ఐగేట్ వంటి కంపెనీల ప్రధాన కార్యాలయాలు అమెరికాలో ఉన్నప్పటికీ ఈ కంపెనీల డెలివరీ, మేనేజ్‌మెంట్, నిర్వహణ తదితర అంశాలకు సంబంధించిన కార్యక్రమాలను ఇతర భారత కంపెనీల మాదిరే ఉన్నాయి.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

ఐటీ సర్వీసుల్లో ఆదాయపరంగా తారాపథంలో దూసుకెళ్తున్న కాగ్నిజంట్ | Cognizant beats Infosys to emerge second-biggest IT company

The top five Indian IT companies grew 13.3% to reach $34.3 billion in 2012, exceeding the IT services industry growth of 2% said IT advisory firm Gartner. The growth decelerated for both industry groups, from 21.8% and 7.7%, in 2011.
Story first published: Wednesday, May 29, 2013, 11:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X