For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రాయ్ నివేదిక: వినియోదారులతో బిల్లింగ్ వివాదాలు ఎయిర్ సెల్‌కు ఎక్కువ

By Nageswara Rao
|

Trai
న్యూఢిల్లీ: 2012వ సంవత్సరానికి గాను నాల్గవ త్తైమాసికంలో ఫోన్ బిల్లింగ్ వివాదాల విషయంలో ఎయిర్ సెల్, వోడాఫోన్, ఐడియా కంపెనీలు అద్వానంగా ఉన్నాయని టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తన నివేదికలో పేర్కొంది. వివరాల్లోకి వెళితే ట్రాయ్ గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు పెర్ఫామెన్స్ ఇండికేటర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ నివేదికలో వెల్లడైన విషయం ప్రకారం ఎయిర్ సెల్ కంపెనీకి మొత్తం 22 టెలికమ్ సర్కిళ్లలో వినియోగదారులతో బిల్లు వివాదాలున్నట్లు తేలింది.

ఎయిర్ సెల్, వోడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఫోన్ బిల్లింగ్ వివాదాలు 0.11 శాతం నుండి 2.42 శాతం రేంజిలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఎయిర్ సెల్ ఎక్కువ శాతం 2.42గా కలిగి ఉంది. ఎయిర్ సెల్ పోస్ట్ పెయిడ్ బిల్లులు గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్దాన్ లాంటి రాష్ట్రాల్లో 0.11 శాతం నుండి 0.25 శాతంగా నమోదైంది. పోస్ట్ పెయిడ్ సర్వీసెస్‌ను అందించే టెలికమ్ కంపెనీలు వినియోగదారుల నుండి వసూలు చేసే తప్పుడు బిల్లులు 4.37 శాతం నుండి 5.68 శాతానికి పెరిగాయి. ఈ విషయంపై కంపెనీలు ఎటువంటి వ్యాఖ్యలు చేయక పోవడం గమనార్హం.

సాధారణంగా సర్వీస్ ఏరియాలో మొత్తం బిల్లుల్లో 0.1 శాతం బిల్లులు సమస్యాత్మకంగా ఉంటే, ఆ సర్కిల్‌ను వివాదస్పద సర్కిల్‌గా పరిగణిస్తారు. వొడాఫోన్‌కు నాలుగు, ఐడియాకు మూడు సర్కిళ్లలో ఇలాంటి వివాదాలున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎస్‌లకు సంబంధించి ఇది ఒక్కో సర్కిల్‌గా ఉంది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

ట్రాయ్ నివేదిక: వినియోదారులతో బిల్లింగ్ వివాదాలు ఎయిర్ సెల్‌కు ఎక్కువ | Trai says Aircel, Idea & Vodafone not complying with billing standards | ట్రాయ్ నివేదిక: బిల్లింగ్ వివాదాలతో ఎయిర్ సెల్‌

Telecom regulatory authority of India (Trai) in a report has pointed out that Aircel, Vodafone and Idea had the maximum number of disputes regarding phone billing during the last quarter of 2012.
Story first published: Tuesday, May 7, 2013, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X