For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో 3 నెలలు పాటు పాత చెక్కులను ఉపయోగించుకోవచ్చు: ఆర్‌బీఐ

By Nageswara Rao
|

RBI
ముంబై: బ్యాంకు ఖాతాదారులు వారి పాత చెక్కులను మరో మూడు నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. ఒకే రకమైన భద్రత ప్రమాణాలు కలిగి ఉన్న కొత్త చెక్కుల జారీకి నిర్దేశించిన గడువును వచ్చే సంవత్సరం మార్చి నెల చివరి వరకూ పొడిగిస్తూ శుక్రవారం ఒక నోటిఫికేషన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మాకు అందిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట నాన్ - సీటీఎస్ (చెక్ ట్రంకేషన్ సిస్టమ్) - 2010 ప్రమాణాల చెక్కుల ద్వారా నగదు విత్ డ్రాయల్‌ను బ్యాంకులకు అనుమతించిన గడువుని 2013 మార్చి 31వ తారీఖు వరకు పొడిగించామని పేర్కొంది.

చెక్ ట్రంకేషన్ సిస్టం(సీటీఎస్) 2010 ప్రమాణాలకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా ఒకే రకమైన రూపురేఖలున్న చెక్కులను జారీ చేయాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. భద్రతాపరంగా మెరుగైన ఫీచర్స్ ఉన్న ఇటువంటి చెక్కులతో మోసాలను అరికట్టేందుకు వీలవుతుందని తెలిపింది. ఈ విధానానికి మారే క్రమంలో బ్యాంకులు ముందుగా మల్టీ-సిటీ లేదా ఎట్ పార్ చెక్కులను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ సూచించింది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న నాన్- సీటీఎస్ 2010 చెక్కులను ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఉపసంహరించాలని పేర్కొంది. దీనిపై ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు ఎస్‌ఎంఎస్ అలెర్ట్‌లు, ఉత్తరాలు పంపడంతో పాటు బ్రాంచీలు, ఏటీఎంలలో నోటీసులు ఉంచాలని ఆర్‌బీఐ సూచించింది. చెక్ క్లియరింగ్‌లో అనేక కొత్త పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజా ప్రమాణాలతో కూడిన చెక్కులను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.

చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏమిటీ:

చెక్‌కు సంబంధించిన లావాదేవీలను ఫిజికల్ మూమెంట్ ప్రాతిపదికన కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ రూపంలో జరిగేలా వీలు కల్పిస్తున్నారు. ఈ విధానాన్నే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చెక్ లావాదేవీల్లో ఎటువంటి మోసాలు జరగకుండా చూడడం, అలాగే అన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ ఇమేజ్డ్ ప్రాతిపదికన చెక్కులు వెంటనే క్లియరెన్స్ ఈ విధానం ప్రధాన ఉద్దేశం. 2012 డిసెంబర్ 31 తర్వాత ప్రస్తుత చెక్కలను నిలుపుచేయాలని ఈ నెల మొదట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన విషయం తెలిసిందే. త్వరలో ఇతర బ్యాంక్‌లు కూడా ఈ విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

తెలుగు వన్ఇండియా

English summary

మరో 3 నెలలు పాటు పాత చెక్కులను ఉపయోగించుకోవచ్చు: ఆర్‌బీఐ | Bank account holders can use old cheques for 3 more months | మరో 3 నెలలు పాటు పాత చెక్కులను ఉపయోగించుకోవచ్చు

RBI has extended the deadline for banks to issue new cheques with uniform security features till March 2013. The Reserve in a notification on Saturday said: “Taking into consideration representations, it has been decided to extend the time up to March 31, 2013 for banks to ensure withdrawal of non-CTS 2010 standard cheques and replace them with CTS-2010 (Cheque Truncation System) standard cheques.”
Story first published: Saturday, December 15, 2012, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X