For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని లక్ష్యం: భారతీ ఇన్‌

By Nageswara Rao
|

Bharti Infratel IPO is expensive
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి మొదలైంది. ఇష్యూ ప్రారంభం కాకుండానే ప్రయిమరీ మార్కెట్లో ప్రీమియం ధరలు పలుకుతుండటంతో ఐపీఓల పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 20కి పైగా కంపెనీలు ఇష్యూలకు వచ్చినప్పటికీ అవి సమీకరించింది కేవలం రూ. 2,000 కోట్లకు లోబడి ఉంది. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు అనుబంధ సంస్థ అయిన భారతీ ఇన్‌ఫ్రాటెల్ పబ్లిక్ ఇష్యూ ఈరోజున మొదలుకానున్న సందర్బంలో ఒక్క భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఒక్కటే ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గత సంవత్సరం కోల్ ఇండియా రూ.15,000 కోట్ల ఇష్యూ తర్వాత ఇదే అతిపెద్ద ఇష్యూ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈ ఇష్యూ కనుక విజయవంతమైతే మరిన్ని పెద్ద ఇష్యూలకు రావడానికి మార్గం సుగమం అవుతుంది. పెద్ద ఇష్యూలు విజయవంతం సెంటిమెంట్‌ మరింత బలపడుతుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. సెకండరీ మార్కెట్‌పై ప్రయిమరీ మార్కెట్‌ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌ బాగా జోరుమీద ఉన్నందున ప్రయిమరీ మార్కెట్‌కు ఇష్యూలకు రావడం ఇదే మంచి తరుణమని వెల్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ మమత్నా చెప్పారు.

భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఇష్యూలో భాగంగా కంపెనీ సోమవారం 18 యాంకర్ ఇన్వెస్టర్ సంస్థల నుంచి రూ. 652 కోట్లను సమీకరించింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో మోర్గాన్ స్టాన్లీ, సుందరం ఎంఎఫ్, అలియన్స్ బెర్న్‌స్టీన్, కొలంబియా వాగ్నర్ ఉన్నాయి. ఈ సంస్థలకు 2.83 కోట్ల షేర్లను (ఇష్యూ పరిమాణంలో 15%) విక్రయించింది.

ఇష్యూకి ప్రైస్‌బ్యాండ్ రూ. 210-240 కాగా, షేరుకి రూ. 230 ధరలో యాంకర్ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. డిసెంబర్ 14తో ముగియనున్న ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 18.89 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టింది. తద్వారా రూ. 4,534 కోట్లవరకూ సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ విషయానికి వస్తే భారతి ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ టవర్ల బిజినెస్ చేస్తోంది. కంపెనీలో భారతీ ఎయిర్‌టెల్‌కు 86% వాటా ఉంది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను విస్తరణకు ఇతర కంపెనీల కొనుగోళ్లకు వినియోగించనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది.

తెలుగు వన్ఇండియా

English summary

ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని లక్ష్యం: భారతీ ఇన్‌ | Bharti Infratel IPO is expensive, say Brokers

Bharti Infratel, whose IPO is set to open today and close on December 14, is expensive say some brokerage firms. The company is offering shares in price band of Rs 210 - 240 rupees/share.
Story first published: Tuesday, December 11, 2012, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X