For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అడ్రస్ అప్‌డేట్ చేసుకోండి.. డిసెంబర్ 15 నాటికి కొత్త చెక్ పుస్తకం పొందండి

By Nageswara Rao
|

State Bank of India to issue new, CTS complaint cheque books by Dec 15
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్లకు డిసెంబర్ 15 నాటికి కొత్త చెక్కు పుస్తకాన్ని అందజేయనుంది. కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీటీఎస్ (చెక్ ట్రంకేషన్ సిస్టమ్) విధానాన్ని దృష్టిలో పెట్టుకోని ఈ కొత్త చెక్ పుస్తకాన్ని కస్టమర్లకు అందజేస్తుంది. కొత్త చెక్ పుస్తకాన్ని త్వరితగతిన పొందేందుకు వీలుగా తమ కస్టమర్లు వెంటనే తమ ప్రస్తుత చిరునామాను వారికి దగ్గరలో ఉన్న బ్యాంక్‌ల వద్ద అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఎవరైతే కస్టమర్లు తమ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోరో వారికి మాత్రం ప్రస్తుతం తమ వద్ద ఉన్న చిరునామాకే చెక్ పుస్తకాన్ని పంపిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. కస్టమర్ అడ్రస్ మారితేనే కొత్త అడ్రస్ అప్‌డేట్ అవరసరమని పేర్కొంది. ఎవరైతే కస్టమర్లు డిసెంబర్ 15 నాటికి కొత్త చెక్ పుస్తకాలను అందుకోరో వారు తమ శాఖల అధికారులను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొంది.

చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏమిటీ:

చెక్‌కు సంబంధించిన లావాదేవీలను ఫిజికల్ మూమెంట్ ప్రాతిపదికన కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ రూపంలో జరిగేలా వీలు కల్పిస్తున్నారు. ఈ విధానాన్నే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చెక్ లావాదేవీల్లో ఎటువంటి మోసాలు జరగకుండా చూడడం, అలాగే అన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ ఇమేజ్డ్ ప్రాతిపదికన చెక్కులు వెంటనే క్లియరెన్స్ ఈ విధానం ప్రధాన ఉద్దేశం. 2012 డిసెంబర్ 31 తర్వాత ప్రస్తుత చెక్కలను నిలుపుచేయాలని ఈ నెల మొదట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన విషయం తెలిసిందే. త్వరలో ఇతర బ్యాంక్‌లు కూడా ఈ విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

తెలుగు వన్ఇండియా

English summary

అడ్రస్ అప్‌డేట్ చేసుకోండి.. డిసెంబర్ 15 నాటికి కొత్త చెక్ పుస్తకం పొందండి | State Bank of India to issue new, CTS complaint cheque books by Dec 15 | డిసెంబర్ 15 నాటికి మీ ఇంటికి కొత్త చెక్ పుస్తకం

State Bank of India had recently announced that it would implement cheque truncation system (CTS) soon. To initiate the implementation process, SBI has requested its customers to inform the bank about any changes in their mailing addresses. The country's largest lender, SBI, has planned to send the new, CTS complaint cheque books to its customers by December 15, 2012.
Story first published: Tuesday, November 20, 2012, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X