For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 50 వేల వరకూ ఉన్న సెక్యూరిటీలకు రుసుము అవసరం లేదు

By Nageswara Rao
|

Investors to get no-frills demat accounts from Monday
ముంబై: షేర్లు, మ్యూచవల్ ఫండ్స్, ఇతర సెక్యూరిటీలలో ట్రేడింగ్ చేసేందుకు వీలుగా చిన్న మదుపర్లు నేటి నుండి చౌక డీమ్యాట్ ఎకౌంట్లను ప్రారంభించవచ్చు. ఈ చౌక రకం డీమ్యాట్ ఎకౌంట్ల వల్ల రూ. 50 వేల వరకూ విలువైన సెక్యూరిటీలు ఉన్నంత వరకూ ఎటువంటి నిర్వహణ రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. పోర్టుఫోలియో రూ. 2 లక్షలు చేరనంత కాలం ఏడాదికి గరిష్టంగా రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. చిన్న మదుపర్లకు మార్కెట్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశ్యంతో సెబీ నో ప్రిల్ డీమ్యాట్ ఎకౌంట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

బేసిక్ సర్వీస్ డీమ్యాట్ ఎకౌంట్ సదుపాయాన్ని అక్టోబర్ 1 నుండి కల్పించాలని డిపాజిటరీ పార్టిసిపెంట్లను సెబీ కోరింది. ప్రస్తుతం డీమ్యాట్ ఎకౌంట్లలో రూ. 2లక్షల కంటే తక్కువ విలువైన షేర్లు, సెక్యూరిటీలు ఉన్న మదుపర్లు తమ సాధారణ డీమ్యాట్ ఖాతాను చౌక డీమ్యాట్ ఖాతాగా మార్చుకోవచ్చు. దీనితోపాటు సాధారణ డీమ్యాట్ ఖాతా నిబంధనల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇక మ్యూచవల్ ఫండ్‌లలో పెట్టుబడులు నేటి నుండి మరింత సులభతరం అవనున్నాయి. దీనికి కారణం మ్యూచువల్ ఫండ్స్‌లలో సెబీ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఈరోజు నుండి అమలులోకి రానున్నాయి.

ఆగస్టు 16న జరిగిన సమావేశంలో మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో మార్పులకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈరోజు నుండి అమలులోకి వచ్చే విధంగా గత బుధవారం నోటిపై జారీ చేసింది. కొత్త మార్పులు ప్రకారం పథకాలపై మదుపు, సలహా రుసుము కింద ఫండ్‌లు కొంత మొత్తాన్ని వసూలు చేయవచ్చు.

తెలుగు వన్ఇండియా

English summary

రూ. 50 వేల వరకూ ఉన్న సెక్యూరిటీలకు రుసుము అవసరం లేదు | Investors to get no-frills demat accounts from Monday | ఈరోజు నుండే నో ఫ్రిల్స్ డీమ్యాట్ ఎకౌంట్లు


 Small individual investors will be able to get no-frills demat accounts for trading in stocks, mutual funds and other securities from Monday without any annual maintenance charges for holdings up to Rs 50,000. Also, the charges would be capped at a maximum of Rs 100 a year if the value of their portfolio is up to Rs 2 lakh.
Story first published: Monday, October 1, 2012, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X