For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లను ఆహ్వానించడం వల్ల కలిగే లాభనష్టాలు

By Nageswara Rao
|

Wal Mart
విమర్శలు, వ్యతిరేకతల నడుమ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత కాలంలో ఆర్దిక వృద్దిరేటుకు వూతం ఇవ్వడంతో పాటు ఉద్యోగవకాశాలు కల్పించే లక్ష్యంతో విమానయానం, మల్టీ బ్రాండ్ రిటైల్, ఇతర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కాపాడడంతో పాటు.. ఉపాధి కల్పన జరుగుతుందని, వ్యవసాయోత్పత్తులు వృధా కాకుండా చూడటం సాధ్యపడతుందని, తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని.. అలాగే రైతులకు మేలు జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది.

మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో 51 శాతం విదేశీ పెట్టుబడికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇలాంటి రిటైల్ సంస్దల కార్యకలాపాలను అనుమతించే విషయంలో అధికారాన్ని మాత్రం రాష్టాలకే కట్టబెట్టింది. వీటితో పాటు సింగిల్ బ్రాండ్ రిటైల్ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ సంస్దలు విక్రయించే వస్తువుల్లో 30 శాతం దేశీయంగా సమీకరించాలనే నిబంధనకు మినహాయింపు కల్పించింది. ప్రభుత్వం కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ సంస్దలు నేరుగా స్దానిక సంస్దలతో కలిసి మన దేశంలోకి ప్రవేశించే అవకాశం కలిగింది.

మల్టీ బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు:

* ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
* పెద్ద రిటైల్ సంస్థలు ఏర్పాటు చేసే కోల్డ్‌స్టోరేజీలు, గిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాల వల్ల పండ్లు, కూరగాయల్లో వేస్టేజి తగ్గుతుంది.
* టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు దేశానికి అత్యంత అవసరమైన విదేశీ పెట్టుబడులు వస్తాయి.
* దళారుల పాత్ర తొలగి, రైతులకు అధిక ధర గిట్టనుంది.
* రిటైల్ స్థాయిలో ధరలు తగ్గుతాయి కాబట్టి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.
* మార్కెట్లో పోటీ పెరగడం వల్ల అటు ఉత్పత్తిదారులకు, ఇటు వినియోగదారులకు ఉపయోగం.

మల్టీ బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టడం వల్ల కలిగే నష్టాలు:

* ధరలు ప్రారంభంలో తగ్గినా.. రిటైల్ మార్కెట్‌పై బహుళజాతి కంపెనీలు ఆధిపత్యం పెరిగితే ధరలూ పెరిగిపోతాయి.
* రైతులకు కూడా మొదట్లో మంచి రేటు లభించినా, ఆ తర్వాత వారు మల్టీ బ్రాండ్ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి.
* వేలకొద్దీ చిన్న కిరాణా షాపులు మూతబడతాయి. దాదాపు 4 కోట్ల మంది ఉపాధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కోల్పోతారు.
* పెద్ద కంపెనీలు చౌక రేట్లకు అమ్మడం వల్ల చిన్న, మధ్య తరహా సంస్థలు దెబ్బతింటాయి.

మల్టీ బ్రాండ్ రిటైల్‌లో వ్యాపారులు తమకు కావలసిన వస్తువులను వివిధ చోట్ల నుంచి కొనుగోలు చేసే శ్రమను తప్పిస్తూ మల్టీబ్రాండ్ రిటైల్ కంపెనీలు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఒకేచోట అన్ని రకాల వస్తువులను చౌకధరలకు అందిస్తాయి. రిజిష్టర్ చేసుకున్న వర్తకులకు మాత్రమే పరిమితమైన ఈ క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో లావాదేవీలు జరుగుతాయి. వినియోగదారుడు జరిపే అన్ని రకాల కొనుగోళ్లకు తక్షణమే చెల్లింపులు జరపుతారు. సాధారణంగా క్రెడిట్ లావాదేవీలు జరిపే కంపెనీలు తమ కస్టమర్ల నుంచి రావాల్సిన బకాయిలను బ్యాలెన్స్‌షీట్‌లో ఆస్తులుగా చూపిస్తారు.

తెలుగు వన్ఇండియా

English summary

విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లను ఆహ్వానించడం వల్ల కలిగే లాభనష్టాలు | FDI in multi-brand retail, aviation: PM introduces bold new policies | ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం వల్ల కలిగే లాభనష్టాలు

The Prime Minister has introduced the boldest reforms yet in his current term - foreign super-market chains can now enter India and foreign airlines can buy stake in Indian carriers. "The Cabinet took many decisions on Friday to bolster economic growth and make India a more attractive destination for foreign investment," tweeted Dr Manmohan Singh's office last evening.
Story first published: Saturday, September 15, 2012, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X