For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడికి హామీ, సెబీ సమావేశంలో పరిశీలన

By Nageswara Rao
|

IPOs: Why SEBI initiatives may be futile?
న్యూఢిల్లీ, ఆగస్టు 20: పబ్లిక్ ఆఫర్ల(ఐపీఓ)లో చిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో కొంత మొత్తానికి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘సేఫ్టీ నెట్' విధానంపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మళ్లీ దృష్టిసారించనుంది. వచ్చే నెలలో జరగనున్న బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని పునఃపరిశీలించనున్నట్లు సెబీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐతే ఇటీవల ఆగస్టు 16న జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇందుకు కారణం సేప్టీ నెట్ ప్రతిపాదనకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లు, ఇతర మార్కెట్ వర్గాల నుండి వ్యతిరేకత రావడమే.

ఇలాంటి వెసులు బాట్లు కల్పించడం వల్ల సాధారణ మార్కెట్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం అవతుందని, కంపెనీ మూలూలు, పరిస్దితులకు అనుగుణంగా షేరు ధర కదలికలను అడ్డుకున్నట్లని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లు సెబీకి వివరించారు. ఈ విషయంపై విస్తృత చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని గతంలో జరిగిన బోర్డు సమావేశం అనంతరం సెబీ ఛైర్మన్ యుకె సిన్హా అన్నారు.

ఈ నెల 16న జరిగిన బోర్డు మీటింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లకు ఐపీఓల్లో కనీస షేర్ల కేటాయింపు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లపై సర్వీస్ ట్యాక్స్ విధింపు వంటి పలు కీలక సంస్కరణలకు సెబీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. సేఫ్టీ నెట్‌పై మాత్రం నిర్ణయాన్ని వాయిదా వేసింది. అయితే, ఈ విధానాన్ని కొంత మంది మార్కెట్ వర్గాలు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, చాలా చిన్న రిటైల్ ఇన్వెస్టర్లకే సేఫ్టీ నెట్‌ను పరిమితం చేయడం వంటి కొన్ని మార్పులను ఈ నిబంధనల్లో చేర్చే అవకాశం ఉన్నట్లు సెబీ అధికారి తెలిపారు.

ఇక సేప్టీ నెట్ వ్యవస్దలో పబ్లిక్ ఇష్యూలో చిన్న మదుపర్లు చేసే పెట్టుబడిలో కొంత భాగానికి నిర్ణీత కాలానికి హామీ ఉంటుంది. ఇది ఆరు నెలలు ఉండొచ్చు. ఈ సమయంలో ఐపీఓలో జారీ చేసిన ధర కన్నా షేర్ ధక క్షీణించినా.. చిన్న మదుపర్లకు నష్టం ఉండదు. సెబీ ప్రతిపాదన ప్రకారం షేరు ధర ఒక స్దాయికి మించి క్షీణించడం వల్ల కలిగిన నష్టాన్ని పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ప్రమోటర్లు, షేర్లను విక్రయించిన ఇతర సంస్దలు చెల్లించాల్సి ఉంటుంది.

తెలుగు వన్ఇండియా

Read more about: sebi ipo సెబీ ఐపీఓ
English summary

చిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడికి హామీ, సెబీ సమావేశంలో పరిశీలన | IPOs: Why SEBI initiatives may be futile? | ‘సేఫ్టీ నెట్’పై వచ్చే నెలలో సెబీ నిర్ణయం..

Sample this: in 1995-96 there were 1,426 initial public offerings (IPOs), making it as many as 118 IPOs in a month on an average. In 2011-2012 IPOs were down to a trickle - in fact, just 34 IPOs in the full year.
Story first published: Monday, August 20, 2012, 10:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X