For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ కోసం ప్ర‌భుత్వం వ‌ద్ద వ్యాపారులు ఎలా న‌మోదు చేసుకోవాలి?

ఏదైనా ప‌న్ను వ్య‌వ‌స్థ‌లో వ్యాపారులు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డం అనేది చాలా ముఖ్య‌మైన అంశం. బిజినెస్ ట‌ర్నోవ‌రు ప‌రిమితి రూ.20 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఉంటే ప్ర‌భుత్వం వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. నిర్ది

|

ఏదైనా ప‌న్ను వ్య‌వ‌స్థ‌లో వ్యాపారులు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డం అనేది చాలా ముఖ్య‌మైన అంశం. బిజినెస్ ట‌ర్నోవ‌రు ప‌రిమితి రూ.20 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఉంటే ప్ర‌భుత్వం వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. నిర్దిష్ట ప‌రిమితి(రూ.20 ల‌క్ష‌ల‌)కంటే త‌క్కువ ఉండేవారు సైతం స్వ‌చ్చందంగా జీఎస్‌టీ విధానంలో న‌మోదు చేసుకోవ‌చ్చు. కొత్త రిజిస్ట్రేష‌న్లు చేసుకునే వారి కోసం జూన్ 25 నుంచి వెబ్‌సైట్లో మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చారు. జీఎస్టీ కామ‌న్ పోర్ట‌ల్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి(https://www.gst.gov.in)
(gst registration)రిజిస్ట్రేష‌న్ కోసం ఇలా చేయాలి:
1. మొద‌ట రిజిస్ట్రేష‌న్‌కు ముందు పాన్‌, మొబైల్ నంబ‌ర్‌, ఈ-మెయిల్ ఐడీ, రాష్ట్రం లేదా కేంద్ర‌పాలిత ప్రాంతం వంటి వివ‌రాల‌ను జీఎస్టీ ఫారం REG-01లో ఇవ్వాలి.
2. పాన్‌, మొబైల్ నంబ‌ర్, మెయిల్ ఐడీల‌ను సీబీడీటీ రికార్డుల ద్వారా వెరిఫై చేస్తారు.త‌ర్వాత వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది.
3. పాన్, మొబైల్ నంబ‌ర్, మెయిల్ ఐడీ వెరిఫికేష‌న్ పూర్త‌యిన త‌ర్వాత ఒక తాత్కాలిక రెఫ‌రెన్స్ నంబ‌రు వ‌స్తుంది. మీ మొబైల్ నంబ‌రుకు, మెయిల్ ఐడీకి దీన్ని పంపుతారు.
4. వ‌చ్చిన రెఫ‌రెన్స్ నంబ‌రు సాయంతో జీఎస్టీ REG-01లో పార్ట్‌-బీ నందు ద‌ర‌ఖాస్తును ఎల‌క్ట్రానిక్ ప‌ద్ద‌తిలో పూర్తి చేయాలి. ఎల‌క్ట్రానిక్ వెరిఫికేష‌న్ కోడ్ ద్వారా జీఎస్టీ పోర్ట‌ల్‌లో డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేయాలి.
5. జీఎస్టీ వెబ్‌సైట్లో మీ ద‌ర‌ఖాస్తు ప్ర‌భుత్వానికి అందిన త‌ర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్ వ‌స్తుంది.
FORM GST REG-02 అనే రిజిస్ట్రేష‌న్ ఫారంలో మీకు ఇది అందుతుంది. జీఎస్టీ రిజిస్ట్రేష‌న్ వీడియో

 జీఎస్టీ రిజిస్ట్రేష‌న్

ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించిన త‌ర్వాత ఏమ‌వుతుంది?
ద‌ర‌ఖాస్తును సంబంధిత అధికారికి ఫార్వార్డ్ చేస్తారు. ఆ అధికారి ద‌ర‌ఖాస్తు, సంబంధిత ప‌త్రాల‌ను స‌రిచూస్తారు. అన్ని స‌రిగా ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి అభ్య‌ర్థ‌న‌ను మూడు రోజుల్లో పూర్తిచేస్తారు.
ఒక‌వేళ మూడు రోజుల్లోపు సంబంధిత అధికారి ఆ ప‌క్రియ‌ను పూర్తిచేయ‌క‌పోతే ఆటోమేటిగ్గా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యిన‌ట్లు భావించాలి.
ద‌ర‌ఖాస్తులో ఏవైనా త‌ప్పులున్నా లేదా ప‌త్రాలు స‌రిగా స‌మ‌ర్పించ‌క‌పోయినా, FORM GST REG-03 ద్వారా సంబంధిత అధికారి వ్యాపారుల నుంచి స్ప‌ష్ట‌త కోర‌వ‌చ్చు. అప్పుడు వ్యాపారులు స‌మాచారాన్ని కానీ ప‌త్రాల‌ను కానీ ఆన్‌లైన్లోనే ఇవ్వొచ్చు. అధికారి అడిగిన‌ప్ప‌టి నుంచి ఏడు రోజుల్లోపు FORM GST REG-04 ద్వారా మీ సమాధానాన్ని ఇవ్వాలి.

Read more about: gst taxes
English summary

జీఎస్టీ కోసం ప్ర‌భుత్వం వ‌ద్ద వ్యాపారులు ఎలా న‌మోదు చేసుకోవాలి? | how to do registration for gst in portal

Registration with the GSTN is necessary for doing business in the GST regime as businesses will have to upload monthly supply data as well as file return forms on this portal.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X