For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెల‌వారీ రాబ‌డి కోసం పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కం

ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు డ‌బ్బు బాగానే సంపాదిస్తున్నారు. డ‌బ్బు సంపాద‌న వ‌ర‌కూ బాగానే ఉన్నా దాన్ని ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలి, ఎలా ఎక్కువ రాబ‌డులు సాధించాల‌నే విష‌యంలో చాలా మందికి సందేహాలు

|

ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు డ‌బ్బు బాగానే సంపాదిస్తున్నారు. డ‌బ్బు సంపాద‌న వ‌ర‌కూ బాగానే ఉన్నా దాన్ని ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలి, ఎలా ఎక్కువ రాబ‌డులు సాధించాల‌నే విష‌యంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. దేశంలో చాలా పెట్టుబ‌డి ఆప్ష‌న్లు ఉన్నాయి. అందులో రిస్క్ త‌క్కువ ఉండి, స్థిర‌మైన ఆదాయం పొందే మార్గాల్లో పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం(ఎంఐఎస్‌) ఒక‌టి. ఇందులో వ‌డ్డీని నెల‌వారీ చెల్లిస్తారు. పెట్టుబ‌డి పెట్టిన రోజు నుంచి వ‌డ్డీ లెక్కింపు ప్రారంభ‌మ‌వుతుంది. రాబ‌డి హామీ ఉండే దీని గురించి మ‌రిన్ని విష‌యాలు తెలుసుకుందాం.

 ఇందులో పెట్టుబ‌డి ఎందుకు పెట్టాలి?

ఇందులో పెట్టుబ‌డి ఎందుకు పెట్టాలి?

పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కంలో స్థిరంగా, క‌చ్చిత‌మైన రాబ‌డికి హామీ ఉంటుంది. బాగా సంపాద‌న ఉన్నా, లేకపోయినా నెల‌వారీ కొంచెం అద‌న‌పు రాబ‌డి కావాల‌నుకునే వారికి ఈ ప‌థ‌కం మంచి పెట్టుబ‌డి మార్గంగా ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌దు. చిన్న స్థాయి పెట్టుబ‌డిదారుల‌కు చిన్న మొత్తాల్లో పొద‌పు చేసి దాని పైన వ‌డ్డీ పొందేందుకు ఇది ఒక మంచి మార్గం.

 పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం ల‌క్ష‌ణాలు

పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం ల‌క్ష‌ణాలు

  1. భార‌తీయ పౌరులు ఎవ‌రైనా ఈ ఖాతాను తెర‌వొచ్చు.
  2. ఇందుకోసం ముందుగా పోస్టాఫీసు పొదుపు ఖాతాదారై ఉండాలి.
  3. మైన‌ర్ల పేరిట సైతం ఎంఐఎస్ ఖాతాను నిర్వ‌హించ‌వ‌చ్చు.

  4. నామినేష‌న్ సౌక‌ర్యం ఉంది. ఖాతా తెరిచే స‌మ‌యంలోనూ, త‌ర్వాత సైతం దీన్ని వాడుకోవ‌చ్చు.
  5. ఒక పోస్టాఫీసు శాఖ నుంచి మ‌రో పోస్టాఫీసు శాఖ‌కు దీన్ని బ‌ద‌లాయించుకోవ‌చ్చు.

  6. ఒకే వ్య‌క్తి ఖాతాకు సంబంధించి ప‌రిమితి రూ.4,50,000 కాగా, ఉమ్మ‌డి ఖాతా విష‌యంలో గ‌రిష్ట ప‌రిమితి రూ.9 ల‌క్ష‌లుగా ఉంది.
పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కంలో ఇత‌ర ముఖ్య విష‌యాలు

పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కంలో ఇత‌ర ముఖ్య విష‌యాలు

భార‌త ప్ర‌భుత్వ హామీ ఉండ‌టం వ‌ల్ల ఈ ప‌థ‌కం సురక్షిత‌మైన పెట్టుబ‌డి మార్గం.

మార్కెట్లో చాలా ఇత‌ర పెట్టుబ‌డి మార్గాల కంటే ఇందులో వ‌డ్డీ ఎక్కువే.

ఈ ప‌థ‌కానికి సంబంధించి లాక్‌-ఇన్ పీరియ‌డ్ 5 ఏళ్లు ఉంటుంది.

కొంచెం పెనాల్టీ చెల్లించి ఖాతాను ముందుగానే మూసివేసేందుకు సైతం వీలుంటుంది.

దుర‌దృష్ట‌వ‌శాత్తూ, ఈ ప‌థ‌కానికి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం లేదు.

 పోస్టాఫీసు పొదుపు ఖాతా ఎలా తెర‌వాలి?

పోస్టాఫీసు పొదుపు ఖాతా ఎలా తెర‌వాలి?

పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న‌వారు దాన్ని ఎంఐఎస్ ఖాతాతో అనుసంధానించాలి.

ఇందుకోసం ద‌ర‌ఖాస్తు ఫారం నింపాలి.

మీ వివ‌రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు అవ‌స‌రం.

మొద‌టిసారి ఖాతా తెరిచేట‌ప్పుడు ఆధార్ లేదా పాన్ త‌ప్ప‌నిస‌రి.

పాన్ లేక‌పోతే ఫారం 60 లేదా ఫారం 61తో పాటు డ్రైవింగ్ లెసెన్సు, వోట‌ర్ కార్డు, చిరునామాతో కూడిన‌ రేష‌న్ కార్డు వంటివాటిల్లో ఏదైనా ఒక‌దాన్ని స‌మ‌ర్పించాల్సి రావొచ్చు.

Read more about: post office savings mis
English summary

నెల‌వారీ రాబ‌డి కోసం పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కం | For regular interest income post office monthly income scheme

Account may be opened by individual.Account can be opened by cash / Cheque and in case of Cheque the date of realization of C​heque in Govt. account shall be date of opening of account.Nomination facility is available at the time of opening and also after opening of account.
Story first published: Wednesday, June 28, 2017, 10:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X