For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట‌ర్మ్ పాల‌సీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి...

సాధార‌ణంగా ఆదాయం ఆర్జిస్తూ ఉండి, కుటుంబ స‌భ్యులు ఆధార‌ప‌డి ఉండే సంద‌ర్భంలో ట‌ర్మ్ పాల‌సీ అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రి. ఈ ర‌క‌మైన పాల‌సీలు పూర్తి క‌వరేజీ క‌ల్పించ‌డం ద్వారా పాల‌సీ దారు లేని స‌మ‌యంలో కుటుంబానిక

|

దేశంలో ప్ర‌జ‌ల సంప‌ద పెరుగుతున్న కొద్దీ ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న సైతం పెరుగుతోంది. బీమా అవ‌స‌రాన్ని ఇప్పుడిప్పుడే చాలా మంది గుర్తిస్తున్నారు. అయితే సంప్ర‌దాయ పాల‌సీల విష‌యంలో చాలా మంది ఎవ‌రి మాటో విని, ఏజెంట్ల ఒత్తిడితో ఏదో పాల‌సీని తీసుకుంటూ ఉంటారు. సాధార‌ణంగా ఆదాయం ఆర్జిస్తూ ఉండి, కుటుంబ స‌భ్యులు ఆధార‌ప‌డి ఉండే సంద‌ర్భంలో ట‌ర్మ్ పాల‌సీ అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రి. ఈ ర‌క‌మైన పాల‌సీలు పూర్తి క‌వరేజీ క‌ల్పించ‌డం ద్వారా పాల‌సీ దారు లేని స‌మ‌యంలో కుటుంబానికి ఆస‌రాగా నిలిచి ఆర్థికంగా తోడ్పాటునిస్తాయి. ట‌ర్మ్ పాల‌సీ విష‌యంలో గ‌మ‌నించాల్సిన ముఖ్య అంశాలేమిటో ఇక్క‌డ తెలుసుకుందాం.

ఎంత బీమా కావాలి?

ఎంత బీమా కావాలి?

ఒక మనిషి జీవితం విలువ ఇంత అని వెల‌క‌ట్ట‌డం ఎవ‌రికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ, బీమా కంపెనీలు మాత్రం ఈ విషయంలో ఒక అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయానికి పన్నెండు రెట్లు కలిపి అందులోంచి మీ పెట్టుబడుల విలువను తీసివేయగా వచ్చిన విలువకు సమానమైన బీమా రక్షణను కలిగి ఉండాలి. ఒకవేళ రుణాలు ఉంటే ఆ మేరకు విలువను పెంచుకోవాలి. దీంతో పాటు మీ జీవన శైలి, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విహహం అయి ఉంటే భార్య, పిల్లలు, వారి ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ యజమాని దూరమైతే అతని రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు వంటివి పాల‌సీదారు త‌ర్వాత కుటుంబ సభ్యులకు భారం కాకుండా చూసుకోవాలి.

కాలపరిమితి చూసుకోవ‌డం ముఖ్య‌మే...

కాలపరిమితి చూసుకోవ‌డం ముఖ్య‌మే...

మనిషి సంపాదించే కాలం ముగిసే వరకు తప్పనిసరిగా బీమా ర‌క్ష‌ణ ఉండాలి. అందుకే బీమా ఎప్పటివరకు ఉండాలన్న ప్రశ్న వ‌చ్చినప్పుడు రిటైర్మెంట్ వరకు అనే సమాధానం వస్తుంది. అంటే రిటైర్మెంట్ వయస్సు లోంచి ప్రస్తుత వయస్సును తీసివేయగా వచ్చే కాలానికి బీమా పాలసీ తీసుకోవాలి. ఉదాహరణకు 60 ఏళ్లు రిటైర్మెంట్ వయస్సు అనుకుంటే 35 ఏళ్ల వ్యక్తి కనీసం 25 సంవత్సరాలకు (60-35=25) టర్మ్ పాలసీ తీసుకోవాలి. ఇప్పుడు లైఫ్ లాంగ్ క‌వ‌రేజీ ఉండే(హోల్ లైఫ్‌) పాల‌సీలు కూడా ఉంటున్నాయి. మీకు అవ‌స‌రం అనుకుంటే హోల్ లైఫ్ పాల‌సీల‌ను ఎంచుకోవ‌చ్చు.

క్లెయిం రేషియో ఎలా ఉందో గ‌మ‌నించాలి

క్లెయిం రేషియో ఎలా ఉందో గ‌మ‌నించాలి

ఏదైనా బీమా సంస్థ నుంచి టర్మ్ పాలసీ తీసుకునే విషయంలో ఆయా కంపెనీల క్లెయిం రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలి. కొన్ని కంపెనీలు పాలసీలను మంజూరు చేసి తీరా క్లెయింలు వచ్చేసరికి పాల‌సీదారు కుటుంబ స‌భ్యుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తాయి. అందుకే పాలసీ తీసుకునే ముందే కంపెనీల క్లెయిం రికార్డులను పరిశీలించడం మంచిది. క్లెయింల చెల్లింపుల్లో నియంత్రణ సంస్థ నిబంధనలను కంపెనీలు తప్పనిసరిగా పాటించాలి. ఈ వివరాలను తెలుసుకోవడం కష్టమైన విషయం కాదు. మీరు గూగుల్‌లో వెతికినా ఇది దొరుకుతుంది.

రైడ‌ర్ల మాటేమిటి?

రైడ‌ర్ల మాటేమిటి?

ఇప్పుడు అనేక బీమా కంపెనీలు కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా రక్షణ పరిధిని పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. రైడర్ల ప్ర‌ధాన ఉద్దేశం ప్రధాన పాలసీకి అదనంగా ప్రయోజనాలను కల్పించడమే. కొత్త పాలసీ తీసుకునే దానికి అయ్యే దాని కంటే చాలా తక్కువ ఖర్చుతోనే ప్రధాన పాలసీకి అదనంగా ఈ ప్రయోజనాలను రైడర్ల ద్వారా పొందవచ్చు. కాబట్టి త‌ప్ప‌నిస‌రిగా ఏదైన అవ‌స‌రం అని భావిస్తే రైడర్లను ఎంచుకోండి.

డిస్కౌంట్లు ఒక్క‌టే ముఖ్యం కాదు..

డిస్కౌంట్లు ఒక్క‌టే ముఖ్యం కాదు..

టర్మ్ పాలసీల్లో బీమా కంపెనీలు డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి. ఇవి మీ అహారపు అలవాట్లు, జీవన విధానం వంటివాటిపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ధూమపానం అలవాటు లేని వారికి ప్రీమియంలో డిస్కౌంట్ అందిస్తుంటే...కొన్ని కంపెనీలు మహిళలకు ప్రత్యేక రాయితీలను అందిస్తున్నాయి. అయితే అంతిమంగా పాల‌సీ ఎంచుకునే ముందు డిస్కౌంట్ల వైపే మొగ్గుచూపొద్దు. పాల‌సీలో క‌వ‌ర్ అయ్యే , కాని అంశాల‌ను బేరీజు వేసుకోండి.

వివరాలను దాచిపెట్టొద్దు...

వివరాలను దాచిపెట్టొద్దు...

పాలసీ తీసుకునేవారు విధిగా పాటించాల్సిన ముఖ్యమైన అంశం పూర్తిస్థాయి సరైన సమాచారాన్ని అందించడం. ఇలా చేస్తే క్లెయింల విషయంలో బీమా కంపెనీల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఇప్పుడు చాలా కంపెనీలు క్లెయింల తిరస్కరణను తగ్గించడానికి పాలసీదారుల్లో అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నాయి. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన సమాచారాన్ని తప్పులు లేకుండా అందించడం మర్చిపోవద్దు.

వైద్య పరీక్షలు త‌ప్ప‌నిస‌రైతే చేయించుకోవడ‌మే మేలు

వైద్య పరీక్షలు త‌ప్ప‌నిస‌రైతే చేయించుకోవడ‌మే మేలు

ఒకవేళ పూర్తి సమాచారాన్ని అందించినా బీమా కంపెనీలు వైద్య పరీక్షలను కోరితే మ‌రోలా ఆలోచించ‌వ‌ద్దు. ఇది ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. క్లెయింలు తిరస్కరించడం వల్ల భవిష్యత్తులో కుటుంబసభ్యులు ఇబ్బందులను ఎదుర్కోవడం కంటే స్థూలకాయం వంటి చిన్న ఆరోగ్యపరమైన అంశాలు వైద్య పరీక్షల్లో బయటపడితే అధిక ప్రీమియం చెల్లించడమే మంచిది. కొన్నింటికి మొద‌టి రెండేళ్లు వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. వైద్య ప‌రీక్ష‌ల ద్వారా అంతిమంగా పాల‌సీదారుకే ప్ర‌యోజ‌నం.

ద్రవ్యోల్బణమూ ముఖ్యమే...

ద్రవ్యోల్బణమూ ముఖ్యమే...

బీమా మొత్తాన్ని లెక్కించేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని.... అంటే పెరుగుతున్న ధరలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణం వల్ల ఇప్పుడున్న రూపాయి విలువ భవిష్యత్తులో మరింత తగ్గుతుంది. ఉదాహరణకు మీరిప్పుడు ఏదైనా ఒక వస్తువును రూ.10 లక్షలు పెట్టి కొన్నారనుకుందాం. ఏటా సగటున 8 శాతం ద్రవ్యోల్బణ రేటును తీసుకుంటే ఇదే వస్తువును 2032లో కొనడానికి రూ.45 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ద్రవ్యోల్బణ సమస్యను పరిష్కరించుకోవడానికి కనీసం ఐదేళ్లకోసారి మీ బీమా రక్షణ మొత్తాన్ని 5-10 శాతం మేర పెంచుకునే ప్రయత్నం చేయండి.

Read more about: term plan insurance policy
English summary

ట‌ర్మ్ పాల‌సీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి... | Important things to know about term insurance plan

A term insurance plan is a pure life insurance that covers your death risk. You choose the sum assured (the cover amount) and the plan term (the duration for which the plan would run). The premium is then decided based on your age, sum assured, health risks, and plan term. In case of death during the plan term, the sum assured is paid by the insurer to the insured’s nominees. Unlike other life insurance options such as endowment plans, cashback plans and ULIPs, there is no maturity benefit or investment value in a term plan. Your premium is allocated only towards mortality charges in a basic term plan.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X