For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్సూరెన్స్ క్లెయిం తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకుండా ఏం చేయాలి?

"ఈ బీమా పాల‌సీల‌న్నీ పెద్ద బోగ‌స్‌. మ‌న ద‌గ్గ‌ర ప్రీమియం అయితే త‌ప్ప‌క క‌ట్టించుకుంటాయి. కానీ క్లెయిం విష‌యానికి వ‌చ్చే స‌రికి కొర్రీలు వేస్తారు. ఆ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంటు తీసుకుర‌మ్మ‌ని నిబ‌ధంన‌ల

|

"ఈ బీమా పాల‌సీల‌న్నీ పెద్ద బోగ‌స్‌. మ‌న ద‌గ్గ‌ర ప్రీమియం అయితే త‌ప్ప‌క క‌ట్టించుకుంటాయి. కానీ క్లెయిం విష‌యానికి వ‌చ్చే స‌రికి కొర్రీలు వేస్తారు. ఆ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంటు తీసుకుర‌మ్మ‌ని నిబ‌ధంన‌ల పేరుతో నామినీలను ముప్పు తిప్ప‌లు పెడ‌తాయి." అనేమాటలు చాలా మంది నుంచి వింటూనే ఉంటాం. పాలసీదారు తదనంతరం కూడా కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా చూడటమే బీమా పాలసీ తీసుకోవడం ముఖ్య ఉద్దేశం. అయితే, క్లెయిమ్ ప్రక్రియ గురించి సరిగ్గా తెలియకపోతే బీమా సొమ్ము చేతికి రాకపోగా .. పెపైచ్చు కుటుంబసభ్యులకు మనశ్శాంతీ కరువవుతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముఖ్యంగా ఒక ఆరు అంశాలను గుర్తుంచుకుంటే మంచిది.

సక్రమంగా ప్రీమియం చెల్లించడం

సక్రమంగా ప్రీమియం చెల్లించడం

బీమా పాలసీ తీసుకున్నాక .. ప్రీమియంల చెల్లింపులో జాప్యం లేకుండా చూసుకోవాలి. వీలును బట్టి నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి ప్రీమియం చెల్లింపులు కొనసాగించడం కష్టమైన పక్షంలో ఆ విషయాన్ని బీమా కంపెనీకి తెలియజే యడం మంచిది. పాలసీదారు చెబుతున్నది వాస్తవమేనని కంపెనీ నమ్మిన పక్షంలో పాలసీలో నిబంధనలను తగు విధంగా సవరిస్తుంది.

క్లెయిం నమోదు

క్లెయిం నమోదు

ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సాధ్యమైనంత వెంటనే బీమా కంపెనీకి తెలియజేసి క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. సమాచారాన్ని అందించేందుకు బీమా కంపెనీలు సాధారణంగా సుమారు 60 నుంచి 90 రోజుల దాకా వ్యవధి ఇస్తుంటాయి. కానీ అంతకంటే ముందే సమాచారం అందించడం మంచిది.

డాక్యుమెంట్లు

డాక్యుమెంట్లు

క్లెయిమ్‌తో పాటు ఒరిజినల్ లేదా అటెస్టెడ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని, మెడికల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే.. వాటిని తప్పనిసరిగా జత చేయాలి. అన్ని డాక్యుమెంట్లు ఒక్కసారే ఇవ్వండి. సాధారణంగా ఒరిజినల్ పాలసీ పత్రం, పూర్తి చేసిన క్లెయిమ్స్ ఫారం, పాలసీదారుతో తన సంబంధాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం, పోస్ట్‌మార్టం రిపోర్టు, బ్యాంక్ అకౌంటు , అవసరమైతే ఎఫ్‌ఐఆర్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.

పాలసీని బాగా అర్థం చేసుకోవాలి

పాలసీని బాగా అర్థం చేసుకోవాలి

తీసుకున్న పాలసీ గురించి, దాని నిబంధనలు మొదలైన వాటి గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే క్లెయిమ్స్ తిరస్కరణకు గురికాకుండా కొంత వరకూ జాగ్రత్తపడొచ్చు. అర్థం కాని నిబంధనలేమైనా ఉంటే బీమా కంపెనీని అడిగి తెలుసుకోవాలి. అంతేకానీ పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ఏజెంటు ఎక్క‌డ సంత‌కం పెడితే అక్క‌డ పెట్టేసి త‌ర్వాత బాధ‌ప‌డితే ప్ర‌యోజ‌నం లేదు. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో కాక‌పోయినా 15 రోజుల స‌మ‌యం ఉన్న‌ప్పుడు పాల‌సీ నిబంధ‌న‌ల‌ను క్షుణ్నంగా చ‌దివితే మీకే మంచిది.

వ్యక్తిగత వివరాలు

వ్యక్తిగత వివరాలు

పాలసీదారు పూర్తి సమాచారాన్ని అందివ్వకపోవడం వల్లే చాలా సందర్భాల్లో క్లెయిమ్‌లు తిరస్కారానికి గురవుతుంటాయి. కనుక, బీపీ, డయాబెటిస్ వంటివి ఏమైనా ఉన్నా, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నా తప్పనిసరిగా పాలసీ తీసుకునే సమయంలో పేర్కొనాలి. దీని వల్ల ప్రీమియం కొంత పెరిగితే పెరగొచ్చు కానీ.. అంతిమంగా క్లెయిమ్ విషయానికొచ్చే సమస్యలు చాలా తగ్గుతాయి.

నామినీకి వివ‌రాల‌న్నీ చెప్పాలిందే

నామినీకి వివ‌రాల‌న్నీ చెప్పాలిందే

ప్ర‌తి బీమాదారు తప్పక గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఇది. మీరు ఏ పాలసీ తీసుకున్నా సరే నామినీకి తప్పనిసరిగా ఆ వివరాలను, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు, క్లెయిమ్ ప్రక్రియ మొదలైన విషయాలన్నింటినీ తెలియజేయాలి. అవసరమైన పత్రాలన్నీ కూడా నామినీకి అందుబాటులో ఉండేలా చూడాలి. లేకపోతే.. పాలసీ తీసుకుని కూడా వ్యర్థమవుతుంది.

బీమా అంబుడ్స్‌మెన్‌

బీమా అంబుడ్స్‌మెన్‌

క్లెయిం విషయంలో తుది నిర్ణయం జీవిత బీమా తీసుకున్నవారు ప్రతిపాదన ఫారంలో వెల్లడించిన విషయాలపై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే బీమా ఒప్పందం అత్యంత మెరుగైన విశ్వసనీయతతో కొనసాగే ఒప్పందం. నిర్ణయాలన్నింటికి బీమా చట్టాలు మార్గదర్శకాలు. ఐఆర్‌డీఏఐ నిర్ణ‌య‌మే బీమా క్లెయిం విష‌యంలో అంతిమ తీర్పు. మీకు ఏదైనా బీమా కంపెనీలో అన్యాయం జ‌రిగింద‌ని భావిస్తే ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెన్‌లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అక్క‌డా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని భావిస్తే వినియోగ‌దారుల ఫోరంను ఆశ్ర‌యించ‌వ‌చ్చు.

Read more about: insurance claim policy
English summary

ఇన్సూరెన్స్ క్లెయిం తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకుండా ఏం చేయాలి? | How to avoid insurance claim rejections

Worried about such an eventuality? Don't worry; here's how you can avoid themWhether you accept it or not, the greatest fear related with any type of insurance is claim rejection. One of the most common questions that arise in the mind of a prospective customer before selecting a particular policy is: will the insurer settle my claim on time?
Story first published: Tuesday, May 30, 2017, 12:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X