For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీర్ఘ‌కాల రాబ‌డికి ఈఎల్ఎస్ఎస్ మంచివేనా?

వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలకమైంది పన్ను ప్రణాళికే. పన్ను మినహాయింపు పొందుతూనే.. అధిక రాబడి ఆర్జించే పథకాలను ఎంచుకోవడం ఎప్పుడూ లాభదాయకమే. వేతన జీవులకు పన్ను కోతలు మొదలైన నేపథ్యంలో.. పన్ను భారం తగ

|

వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలకమైంది పన్ను ప్రణాళికే. పన్ను మినహాయింపు పొందుతూనే.. అధిక రాబడి ఆర్జించే పథకాలను ఎంచుకోవడం ఎప్పుడూ లాభదాయకమే. వేతన జీవులకు పన్ను కోతలు మొదలైన నేపథ్యంలో.. పన్ను భారం తగ్గించుకోవడానికి అందుబాటులో ఉన్న పథకాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప‌న్ను తప్పించుకునేందుకు చాలా మంది చేసే ప‌ని హ‌డావిడిగా ఏదో పాల‌సీ తీసుకోవ‌డం, ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం. అలా కాకుండా ముందు నుంచే ఆర్థిక ప్ర‌ణాళిక ఉంటే మంచి మార్గాల‌ను ఎంచుకుని ఒక పక్క ప‌న్ను ఆదా చేసుకోవ‌డంతో పాటు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డుల‌ను సాధించ‌వ‌చ్చు. అలాంటి వాటిలో ఒక పెట్టుబ‌డి మార్గం గురించి ఇక్క‌డ చూద్దాం.

 ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు అంటే ఏమిటి?

ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు అంటే ఏమిటి?

దీర్ఘ‌కాలంలో త‌మ పెట్టుబ‌డుల‌కు మంచి రాబ‌డులు రావాల‌ని ఆలోచించే వారు స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ‌గా లాభాలు ఎక్క‌డా సాధించ‌లేరు. అయితే అంద‌రూ ధైర్యం చేసి(రిస్క్ తీసుకుని) స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్ట‌లేరు. అలాంటి వారికి ఫండ్లు, ఈఎల్ఎస్ఎస్‌, ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లు వంటివి ఉంటాయి. ఈ విధంగా ఈక్విటీ మార్కెట్ల‌లో నేరుగా పెట్టుబ‌డి పెట్ట‌కుండా లాభాల‌ను ఆర్జించే వారి కోసం ఉద్దేశించిన‌వే ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు(ఈఎల్ఎస్ఎస్). ఈ ప‌థ‌కానికి సంబంధించిన పెట్టుబ‌డుల‌ను ఈక్విటీ మార్కెట్లోని వివిధ కంపెనీల షేర్లలో పెడ‌తారు.

ఈఎల్ఎస్ఎస్ ఎందుకు?

ఈఎల్ఎస్ఎస్ ఎందుకు?

ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1.5 లక్షల పెట్టుబడుల వరకు పన్ను మినహాయింపులను పొందవచ్చు. పన్ను ఆదాయంలోంచి ఈ విభాగంలో సూచించిన సాధనాల్లో పెట్టుబడులను మినహాయంచవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాల బ్యాంక్ డిపాజిట్లు, స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు ఉంటాయి.

ఈఎల్ఎస్ఎస్ ఉపయోగాలు:

ఈఎల్ఎస్ఎస్ ఉపయోగాలు:

ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే ఉంటాయి. దీర్ఘకాల పెట్టుబడుల్లో అతి తక్కువ లాక్ఇన్ పీరియడ్ ఉన్న ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులు ఇవే. ప్రస్తుతం వీటికి 3 సంవత్సరాల లాకిన్ పీరియడ్ తప్పనిసరి. ఎఫ్‌డీ, పీపీఎప్‌, ఎన్ఎస్‌సీ వంటి వాటితో పోల్చి చూసిన‌ప్పుడు ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాల్లోనే రాబ‌డులు ఎ్కువ‌గా ఉంటాయి.

ఇందులో రుసుములు ఏముంటాయి?

ఇందులో రుసుములు ఏముంటాయి?

  1. సాధార‌ణ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లాగానే ఈఎల్ఎస్ఎస్‌లోనూ ప్రారంభ చార్జీలు ఉండ‌వు.

  2. మూడేళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్ వ‌ర్తిస్తుంది కాబ‌ట్టి పెట్టుబ‌డుల‌ను 3ఏళ్ల వ‌ర‌కూ విత్‌డ్రా చేసుకోలేరు.
  3. ఆయా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌ను బ‌ట్టి ఫండ్ నిర్వ‌హ‌ణ చార్జీలు ఉంటాయి.

Read more about: elss investments long term
English summary

దీర్ఘ‌కాల రాబ‌డికి ఈఎల్ఎస్ఎస్ మంచివేనా? | For best returns in the long term try for elss investment

Equity Linked Savings Schemes or ELSS as they are popularly known, help in saving tax under Sec 80C of the Income Tax Act. They are being increasingly preferred these days, especially among individuals who are looking to make returns from shares. So, in essence what they offer you is quick returns from equities along with tax benefits. These investments have a lock-in period of three years, which is the lowest lock-in among all tax saving instruments. Here is a look at some of the best ELSS schemes to invest in 2017.
Story first published: Wednesday, May 31, 2017, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X