For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ల‌పై ఆసక్తా... అయితే ఇది చ‌ద‌వండి!

భారత్‌లో ప్రస్తుతం బీటీసీఎక్స్‌ఇండియా, కాయిన్‌సెక్యూర్, యునోకాయిన్, జేబ్‌పే వంటి బిట్‌కాయిన్‌ ఎక్సే్చంజీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మొత్తం డిజిట‌ల్ రూపంలో బిట్‌కాయిన్ వ్య‌వ‌స్థ న‌డుస్తుంది. ఈ సౌల‌

|

ఆర్‌బీఐ ప‌లుమార్లు హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ దేశంలో బిట్‌కాయిన్ వాడ‌కం ఆగ‌డం లేదు. ఒక మిథ్యా క‌రెన్సీగా ఇది ఉప‌యోగ‌ప‌డుతుండ‌టంతో దేశీయంగా కొంత మంది దీని ప‌ట్ల ఆస‌క్తి చూపుతున్నారు.భారత్‌లో ప్రస్తుతం బీటీసీఎక్స్‌ఇండియా, కాయిన్‌సెక్యూర్, యునోకాయిన్, జేబ్‌పే వంటి బిట్‌కాయిన్‌ ఎక్సే్చంజీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మొత్తం డిజిట‌ల్ రూపంలో బిట్‌కాయిన్ వ్య‌వ‌స్థ న‌డుస్తుంది. ఈ సౌల‌భ్య‌త‌తోనే యూజ‌ర్లు మొగ్గుచూపుతున్నారు. అయితే ఆర్‌బీఐ మాత్రం ఈ వ్య‌వస్థ‌ను అంగీకరించేందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో బిట్ కాయిన్ గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

1. నేపధ్యము

1. నేపధ్యము

ఇది ఏ దేశానికీ చెందదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాదు. అచ్చమైన అంతర్జాతీయ కరెన్సీ. దీని సృష్టికర్త ఎవరికీ తెలీదు. కానీ సతోషి నకమోటో అనే జపానీస్ మారుపేరుతో బిట్‌కాయిన్ల గురించి 2008లో ఒక కథనం ప్రచురితమైంది. తర్వాత ఏడాదికి... అంటే 2009 జనవరి 3న ఈ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. ఒక భారీ నెట్‌వర్క్‌గా ఏర్పడిన కంప్యూటర్ల ద్వారా (బ్లాక్‌చెయిన్) సంక్లిష్టమైన గణిత శాస్త్ర సమీకరణాలతో బిట్ కాయిన్లను సృష్టిస్తారు. ఈ నెట్‌వర్క్‌లో ఉండే కంప్యూటర్లు కూడా అత్యంత శక్తిమంతమైనవి. పెపైచ్చు ప్రతి కంప్యూటర్ ద్వారా సృష్టించగలిగే బిట్‌కాయిన్ల సంఖ్య చాలా పరిమితం. అత్యంత సంక్ల్లిష్టమైన ఈ ప్రక్రియ పేరు మైనింగ్. ఎప్పటికైనా సరే... మొత్తం బిట్‌కాయిన్ల సంఖ్య 2.1 కోట్లకు మించకుండా ఈ విధానాన్ని రూపొందించారు. 2009 నుంచి ఇప్పటి దాకా 1.24 కోట్ల బిట్‌కాయిన్ల మైనింగ్ జరిగింది. 2017లో కేంబ్రిడ్జి విశ్వ‌విద్యాల‌య ప‌రిశోధ‌న ప్ర‌కారం 29 ల‌క్ష‌ల నుంచి మొద‌లుకొని గరిష్టంగా 58 ల‌క్ష‌ల మంది వీటిని వాడుతూ ఉండొచ్చ‌ని అంచ‌నా.

2. వాడుక మరియు లావాదేవీలు

2. వాడుక మరియు లావాదేవీలు

ఎలక్ట్రానిక్ లావాదేవీలకు బిట్‌కాయిన్లు వాడొచ్చు. బిట్‌కాయిన్లతో ఏది కొన్నా... ఆ లావాదేవీ తక్షణం డిజిటల్ రూపంలో ‘లాగ్' అవుతుంది. ఈ ‘లాగ్'లో ఎప్పుడు కొన్నారు? లావాదేవీ జరిగాక ఎవరి దగ్గర ఎన్ని కాయిన్లున్నాయి? వంటివన్నీ అప్‌డేట్ అయిపోతాయి. బిట్‌కాయిన్‌కు సంబంధించిన ప్రతి ఒక్క లావాదేవీ ఈ లాగ్‌లో అప్‌డేట్ అవుతుంటుంది. ఈ వ్యవస్థే బ్లాక్ చెయిన్. ఈ చెయిన్‌లో మొదటి నుంచి అప్పటిదాకా జరిగిన ప్రతి లావాదేవీ నమోదవుతుంది. బ్లాక్‌చెయిన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ... లావాదేవీలు పొల్లుపోకుండా జరిగాయో లేదో చూసే వారే మైనర్స్. ఒకరకంగా చెప్పాలంటే లావాదేవీలకు ఆమోదముద్ర వేసేవారన్న మాట. ఇలా చేసినందుకు వీరికి వ్యాపారుల నుంచి కొంత ఫీజు ముడుతుంది.

3. మారకం విలువ

3. మారకం విలువ

ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ మారకం విలువ 640 అమెరికన్ డాలర్లు. ఇటీవల ఈ విలువ 1100 డాలర్లను తాకింది కూడా!! ఎందుకంటే బంగారం మాదిరిగా బిట్‌కాయిన్లూ అరుదైనవే. వీటిని సూపర్ కంప్యూటర్ల ద్వారా... అది కూడా పరిమితంగానే సృష్టించగలరు. అందుకే బిట్‌కాయిన్ల ట్రేడింగ్‌లో స్పెక్యులేషన్ పెరిగింది. పెపైచ్చు వర్డ్‌ప్రెస్, ఓవర్‌స్టాక్.కామ్, రెడ్డిట్, ఒకే క్యుపిడ్, వర్జిన్ గెలాక్టిక్, బైదు లాంటి సంస్థలన్నీ ఆన్‌లైన్ షాపింగ్‌కు బిట్‌కాయిన్లను అనుమతిస్తున్నాయి. అందుకే వీటిని కావాలనుకునేవారు పెరిగారు. దీంతో బిట్‌కాయిన్ల మారకం రేటు రయ్యిమని పెరిగింది. ఇంతలో కొన్ని దేశాలు దీని వాడకంపై పరిమితులు విధిస్తామని చెప్పటం, మారకం ఎక్స్ఛేంజీలపై హ్యాకర్లు దాడులు చెయ్యటంతో విలువ కొంత పడింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న బిట్‌కాయిన్ల మార్కెట్ విలువ సుమారు 8.4 బిలియన్ డాలర్లుంటుంది. బిట్‌కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీలు 70కి పైగా ఉండగా... వీటి మొత్తం విలువ దాదాపు 13 బిలియన్ డాలర్లుంటుందని అంచనా. దీన్లో సింహభాగం బిట్‌కాయిన్లదే కనక దీనికంత ప్రాధాన్యం.

4. కొనుగోలు - అమ్మకము

4. కొనుగోలు - అమ్మకము

ప్రస్తుతం బిట్‌కాయిన్లు కొనాలంటే ఆన్‌లైన్ ఎక్స్చేంజీలను ఆశ్రయించాల్సిందే. దీనికోసం ఆయా ఎక్స్ఛేంజీల్లో ఒక ఖాతా క్రియేట్ చేసుకుని, దాన్ని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఈ ఖాతాయే మనం కొనే బిట్‌కాయిన్లను దాచిపెట్టుకునే వాలెట్. మన అకౌంటు వెరిఫికేషన్ పూర్తయ్యాక... సరిపడే మొత్తాన్ని ఎక్స్చేంజీకి బదలాయిస్తే మన వాలెట్‌లోకి బిట్‌కాయిన్లు వచ్చి చేరతాయి. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు సుమారు పది రోజులు పైగా పడుతోందని, ఈలోగా బిట్‌కాయిన్ మారకం విలువ భారీగా మారిపోవడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

5. నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌

5. నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌

బిట్‌కాయిన్లను నియంత్రించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థేమీ లేదు. యూజర్ల బ్లాక్‌చెయినే దీని వ్యవస్థ. ప్రతి యూజరుకు ఆన్‌లైన్లో నిర్దిష్టమైన అడ్రెస్ ఉంటుంది. వారి లావాదేవీలన్నీ ఇలాంటి అడ్రెస్‌తోనే జరుగుతాయి. ఒక లావాదేవీ జరిగినపుడు... ఒక అడ్రస్ నుంచి బిట్‌కాయిన్లు మరో అడ్రస్‌కు బదిలీ అవుతాయి. కేవలం అడ్రస్ తప్ప... ఈ లావాదేవీ చేసినవారి వ్యక్తిగత వివరాలేవీ బయటకు రావు. అందుకే బిట్‌కాయిన్ల ద్వారా ఆన్‌లైన్లో పెద్ద ఎత్తున అక్రమాయుధాలు, మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇలా వివరాలు తెలియకపోవటమన్నది దీనికి అనుకూల‌తే కాదు... ప్ర‌తికూల‌త‌ కూడా.

6. ఉపయోగాలు

6. ఉపయోగాలు

మామూలు కరెన్సీతోనే అన్నీ చేయగలుగుతున్నపుడు బిట్ కాయిన్ల అవసరమేంటి? సహజంగా ప్రతి ఒక్కరికీ కలిగే సందేహమే ఇది. నిజానికి పేరుకు కాయిన్ అయినా ఆన్‌లైన్‌లో ఇది బైనరీ అంకెల కోడ్‌లా కనిపిస్తుంది. పెపైచ్చు బిట్‌కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తి ఎవ్వరూ ఉండరు. నేరుగా మన వాలె ట్‌లోంచి డబ్బు వ్యాపారి వాలెట్‌లోకి వెళుతుంది. మన వివరాలు బయటకు రావు. వీటికితోడు వేరొకచోటికి తీసుకెళ్లటం, దాచుకోవటం వంటి అంశాల్లో కష్టం ఉండదు. వీటన్నిటితో పాటు... బిట్‌కాయిన్ లావాదేవీలపై ఛార్జీలుండవు. కొన్ని సందర్భాల్లో ఉన్నా... నామమాత్రమే. అన్నిటికన్నా ముఖ్యం... బిట్‌కాయిన్లలో జరిగే ప్రతి లావాదేవీ సంబంధితులందరికీ తెలుస్తుంది. దీంతో అంతా పారదర్శకమనే భావ‌న నెల‌కొంది.

7. మనదేశంలో బిట్‌కాయిన్ వ్యవస్థ

7. మనదేశంలో బిట్‌కాయిన్ వ్యవస్థ

ఇంకా మన దగ్గర బిట్‌కాయిన్ల వాడకం పెద్దగా లేదు. ఐఎన్‌ఆర్‌బీటీసీ, బిట్కాయిన్‌.ఆర్గ్‌, ఆర్‌బిట్‌కో.ఇన్ లాంటి ఎక్స్చేంజీలున్నా... ఇటీవల ఆర్‌బీఐ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు అహ్మదాబాద్‌లోని బెసైల్‌బిట్.కో.ఇన్ నిర్వహించే ట్రేడర్ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ దాడులు నిర్వహించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా సుమారు 400 మంది కోట్ల విలువ చేసే వెయ్యికి పైగా లావాదేవీలు చేశారని తేలింది. ఈ పరిణామాలతో దేశీయంగా పలు ఎక్స్చేంజీలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశాయి. లీగ‌ల్‌గా చూస్తే మ‌న‌దేశంలో బిట్‌కాయిన్ క‌రెన్సీ చ‌ట్ట‌బ‌ద్దం కాదు.

8. భద్రత

8. భద్రత

ఇది అన్నిటికన్నా ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఈ నెల 2న కెనడాలోని అల్బెర్టాలో ఉన్న ఫ్లెక్స్‌కాయిన్ బ్యాంక్‌పై హ్యాకర్లు దాడిచేశారు. దాని హాట్ వాలెట్‌లోని దాదాపు 7లక్షల డాలర్ల విలువచేసే బిట్‌కాయిన్లను దోచేశారు. దీంతో ఆ బ్యాంకు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపేసింది. అంతకు నాలుగురోజుల కిందటే... జపాన్‌కు చెందిన మౌంట్ గాక్స్ ఎక్స్ఛేంజీ... తన వాలెట్ నుంచి హ్యాకర్లు ఏకంగా 480 మిలియన్ డాలర్ల విలువ చేసే బిట్‌కాయిన్లను దోచేశారని పేర్కొంటూ బిట్‌కాయిన్ అభిమానుల కలలు చెదరగొట్టింది. అందుకని తమకు దివాలా రక్షణ కల్పించాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. బిట్‌కాయిన్ల విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఆన్‌లైన్ భద్రతే. యూజర్లంతా కలిసి లావాదేవీల్ని పర్యవేక్షిస్తూ ఉంటారని, ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఎన్ని బిట్‌కాయిన్లున్నాయో అప్‌డేట్ అవుతుంటుందని చెప్పే వ్యవస్థ.

Read more about: bit coin business
English summary

బిట్ కాయిన్ల‌పై ఆసక్తా... అయితే ఇది చ‌ద‌వండి! | Bitcoins: All you need to know about them

Bitcoin is a digital currency that is minted as well as maintained digitally. The cryptocurrency now in news for quite some time is gaining the attention of investors who in the aim of currency appreciation are ready to splurge their surplus and cash in any likely gains in not so distant future. Adding to it, with the government's step towards regulating and legalizing bitcoin, it is only going to garner more attention of investors.
Story first published: Friday, May 26, 2017, 11:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X