For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎమ్‌లో న‌గ‌దు విత్‌డ్రాకు మించి చేయ‌గ‌లిగే ఇత‌ర ప‌నులు

డెబిట్‌, క్రెడిట్‌కార్డు దారులు ఏటీఎమ్‌ల్లో ప్ర‌తి రోజూ చాలా ప‌నుల‌ను బ్యాంకుల‌కు వెళ్ల‌కుండానే నిమిషాల్లో పూర్తి చేసే వీలుంది. అయితే చాలా మంది డ‌బ్బు విత్‌డ్రా చేయ‌డానికి మించి దేనికీ ఏటీఎమ్‌ను ఉప‌య

|

ఏటీఎమ్‌ను కొన్ని సంద‌ర్భాల్లో మినీ బ్యాంకుగా వాడుకోవ‌చ్చు. బ్యాంకుల్లో చేసే ప‌నుల్లో కొన్ని ప్రాథ‌మిక వ్య‌వ‌హారాల‌ను ఏటీఎమ్ యంత్రాల్లో చేయ‌వ‌చ్చు. ఇప్పుడు టైర్‌-2, టైర్‌-3 ప‌ట్ట‌ణాల్లో సైతం దాదాపు అన్ని చోట్లా ఏటీఎమ్‌లు వెలుస్తున్నాయి. డెబిట్‌, క్రెడిట్‌కార్డు దారులు ఏటీఎమ్‌ల్లో ప్ర‌తి రోజూ చాలా ప‌నుల‌ను బ్యాంకుల‌కు వెళ్ల‌కుండానే నిమిషాల్లో పూర్తి చేసే వీలుంది. అయితే చాలా మంది డ‌బ్బు విత్‌డ్రా చేయ‌డానికి మించి దేనికీ ఏటీఎమ్‌ను ఉప‌యోగించ‌రు. ఏటీఎమ్‌ను ఎన్ని రకాలుగా వాడుకోవ‌చ్చో ఇక్క‌డ తెలుసుకుందాం.

1. ఏటీఎమ్ ద్వారా విరాళాలు

1. ఏటీఎమ్ ద్వారా విరాళాలు

ఏటీఎమ్‌ల ద్వారా డొనేష‌న్ల‌ను చేయ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా? అవునండి ప్ర‌ధాన బ్యాంకుల‌న్నీ టీటీడీకి ఏటీఎమ్ ద్వారా హుండీ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఏటీఎమ్ ద్వారా ప్ర‌ధాన ఆలయాల‌కు నిధుల‌ను దానం చేసే స‌దుపాయాన్ని అందుబాటులో ఉంచింది. ఏటీఎమ్ ద్వారా ఖాతాదార్లు తిరుప‌తి, ప‌ల‌ని, రామ‌క్రిష్ణ మిష‌న్‌, కాశీ విశ్వనాథ్ ఆలయాల‌కు నిధుల‌ను విరాళాలుగా ఇవ్వొచ్చు. లావాదేవీ చివ‌ర్లో మీరు ర‌సీదు సైతం పొంద‌వ‌చ్చు. దీన్ని ప‌న్ను మిన‌హాయింపుల‌కు వాడుకునే అవ‌కాశాన్ని ప్ర‌భుత్వం క‌ల్పిస్తోంది.

2. న‌గ‌దు విచార‌ణ‌

2. న‌గ‌దు విచార‌ణ‌

ఒక‌ప్పుడు ఖాతాలో న‌గ‌దు నిల్వ ఎంత ఉందో తెలుసుకోవాలంటే క‌చ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సి వ‌చ్చేది. సాంకేతిక మెరుగు అవ‌డంతో ఇప్పుడు నేరుగా మొబైల్‌లోనే న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకునే స‌దుపాయం ఉంది. అయితే మీ ఖాతాలో న‌గ‌దు ఎంత ఉందో తెలుసుకోవ‌డానికి ఏటీఎమ్‌ల్లో సైతం ఆప్ష‌న్ ఉంటుంది. ఇందుకోసం మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. మామూలుగా న‌గ‌దు విత్‌డ్రా చేయ‌గానే రసీదు కోసం ఏటీఎమ్ అడుగుతుంది. అప్పుడు కేవ‌లం స్క్రీన్ మీద న‌గ‌దు నిల్వ ఎంత ఉందో తెలుసుకునేలా ఐ డోంట్ వాంట్ రిసీప్ట్ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే మంచిది.

3. మినీ స్టేట్‌మెంట్‌

3. మినీ స్టేట్‌మెంట్‌

మీ ఖాతాలో జ‌రిగే న‌గ‌దు వ్య‌వ‌హారాల‌ను తెలుసుకునేందుకు సాధార‌ణంగా నెట్ బ్యాంకింగ్‌లో మినీ స్టేట్మెంట్‌, డిటైల్డ్ స్టేట్‌మెంట్‌పైనే ఆధార ప‌డుతుంటారు. అయితే లావాదేవీల‌ను వివ‌రంగా తెలుసుకునేందుక మినీ స్టేట్‌మెంట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక్కో బ్యాంకును బ‌ట్టి చివ‌రి 5 లేదా 10 లావాదేవీల వివ‌రాల‌ను మినీ స్టేట్‌మెంట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను ఏటీఎమ్ ద్వారా సైతం ప్రింట్ తీసుకోవ‌చ్చు.

4.మొబైల్ రీచార్జీ

4.మొబైల్ రీచార్జీ

హ‌ఠాత్తుగా మొబైల్లో బ్యాలెన్స్‌ అయిపోయింది. మొబైల్ రీచార్జీ చేసుకునేందుకు రిటైల‌ర్ల ద‌గ్గ‌ర‌కి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఏటీఎమ్‌ల్లోకి వెళ్లి మీకు అవ‌స‌ర‌మైనంత సొమ్ముకు రిచార్జీని చేసుకోవ‌చ్చు. కేవ‌లం మీ ఫోన్‌కే కాదు, బంధుమిత్రుల ఫోన్ నంబ‌ర్ల‌కు సైతం రీచార్జీ చేయించే వీలుంది. ఇందుకోసం ఏటీఎమ్ ఆప్ష‌న్ల‌లో మొబైల్ రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకుని మొబైల్ నంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రీచార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే లావాదేవీ పూర్తవుతుంది.

4. ఏటీఎమ్ పిన్ మార్పు

4. ఏటీఎమ్ పిన్ మార్పు

ఏటీఎమ్ ఆప‌రేట్ చేయాలంటే పిన్ చాలా ముఖ్య‌మైన విష‌యం. ప్ర‌స్తుతం బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు అప్పుడ‌ప్పుడు పిన్ మార్చుకోవాల్సిందిగా బ్యాంకులు సంక్షిప్త సందేశాల ద్వారా సూచిస్తున్నాయి. బ్యాంకు ఖాతాదార్లు పిన్ నెంబ‌రును ఏటీఎమ్ ద్వారానే మార్చుకోవ‌చ్చు.

5. చెక్కు పుస్త‌కం కోసం అభ్య‌ర్థ‌న‌

5. చెక్కు పుస్త‌కం కోసం అభ్య‌ర్థ‌న‌

ఏటీఎమ్ నుంచి చెక్కు పుస్త‌కం కోసం అభ్య‌ర్థించ‌వ‌చ్చు. అయితే ఖాతాలో ఉండే చిరునామా స‌రిగా ఉందో లేదో చూసుకోండి. చాలా బ్యాంకులు అక్క‌డ ఉన్న చిరునామాకే చెక్కు పుస్త‌కాన్ని పంపుతాయి. ఇక‌పై చెక్కు పుస్త‌కంలో లీఫ్లు అయిపోతే బ్యాంకుకు వెళ్ల‌న‌క్క‌ర్లేదు. నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎమ్ ద్వారా కొత్త చెక్కు పుస్త‌కం కోసం ప్ర‌య‌త్నించండి. స‌మ‌యం ఆదా చేసుకోండి.

6. యుటిలిటీ బిల్లు చెల్లింపులు

6. యుటిలిటీ బిల్లు చెల్లింపులు

టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు చెల్లింపులను సైతం ఏటీఎమ్‌ నుంచి చేసుకునే సౌక‌ర్యం ఉంది. అయితే, బిల్లర్ వివరాలను నెట్ బ్యాంకింగ్ ద్వారా నమోదు చేసుకోవాలి. కొన్ని విద్యా సంస్థ‌లు ఆయా విద్యార్థుల రుసుముల‌ను, ట్యూష‌న్ ఫీజుల‌ను చెల్లించేందుకు ఏటీఎమ్‌ల ద్వారా సైతం వీలు క‌ల్పిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్‌కు చెందిన కొన్ని ఇంట‌ర్మీడియ‌ట్ క‌ళాశాలలు బ్యాంకుల‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్ర‌త్యేక‌మైన ఏటీఎమ్‌ల్లో ఈ సౌక‌ర్యాన్ని అందుబాటులో ఉంచాయి. ఇంకా బెంగుళూరు,హుబ్లీ, చాముండేశ్వ‌రి ఎల‌క్ట్రిసిటీ స‌ర‌ఫ‌రా సంస్థ‌, క‌ర్ణాట‌క‌, చ‌త్తీస్‌ఘ‌డ్ ఎల‌క్ట్రిసిటీ బోర్డులు వాటి బిల్లుల‌ను ఏటీఎమ్‌లో చెల్లించేందుకు వీలు క‌ల్పిస్తున్నాయి.

 7. అదే బ్యాంకు ఖాతాదారుల‌కు న‌గ‌దు బ‌దిలీ

7. అదే బ్యాంకు ఖాతాదారుల‌కు న‌గ‌దు బ‌దిలీ

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెన‌రా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, సార‌స్వ‌త్ కోఆప‌రేటివ్ బ్యాంకు, యెస్ బ్యాంక్‌, ఎస్బీఐ అదే బ్యాంకులో ఖాతాలు ఉన్న ఇత‌ర వినియోగ‌దారుల‌కు ఏటీఎమ్ ద్వారా న‌గ‌దు బదిలీ చేసే స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి.

దీని ద్వారా ఎవ‌రికైన డ‌బ్బు పంపాలంటే వారి ఖాతా సంఖ్య లేదా ఏటీఎమ్ కార్డు సంఖ్య ఉంటే చాలు. ఈ స‌దుపాయాన్ని వాడుకునేందుకు క‌స్ట‌మ‌ర్లు ఏటీఎమ్‌కు వెళ్లి కార్డును మెషీన్‌లో ఇన్‌సర్ట్ చేయాలి. త‌ర్వాత ఎవ‌రికైతే డ‌బ్బు పంపాల‌నుకుంటున్నారో వారి డెబిట్ కార్డు నంబ‌రును న‌మోదు చేస్తే స‌రి. అదే హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల‌యితే ఖాతా నంబ‌రు ఎంట‌ర్ చేసినా న‌గ‌దు బ‌దిలీ చేసే సౌక‌ర్యాన్ని అందిస్తున్నాయి.

8. ఒకే బ్యాంకులో రెండు ఖాతాలుంటే ఆయా ఖాతాల మ‌ద్య ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్‌

8. ఒకే బ్యాంకులో రెండు ఖాతాలుంటే ఆయా ఖాతాల మ‌ద్య ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్‌

ఈ మ‌ధ్య చాలా మంది రెండు మూడు బ్యాంకు ఖాతాలు క‌లిగి ఉంటున్నారు. బిల్లు చెల్లింపులు చేసేందుకు ఒక ఖాతాకే ఈసీఎస్ మ్యాండేట్ ఆప్ష‌న్ పెట్టుకుంటున్నారు. దీంతో వేత‌న ఖాతా నుంచి మ‌రో ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. ఒకే పేరు మీద ఉన్న మ‌ర ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ చేసేందుకు చాలా బ్యాంకులు అవ‌కాశ‌మిస్తున్నాయి. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎమ్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్డీఎఫ్‌సీ ఖాతాదార్లు ఖాతాలన్నింటినీ అనుసంధానించుకోవ‌చ్చు. ఏటీఎమ్‌లో వెళ్లి డెబిట్ కార్డు నంబ‌రు న‌మోదు చేయ‌డం ద్వారా స‌ద‌రు ఖాతాకు డ‌బ్బు పంపించ‌వ‌చ్చు.

9. న‌గ‌దు డిపాజిట్‌

9. న‌గ‌దు డిపాజిట్‌

దాదాపు అన్ని ప్ర‌భుత్వ‌,ప్రైవేటు బ్యాంకులు ఏటీఎమ్‌లోనే న‌గదు డిపాజిట్ చేసే స‌దుపాయాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. త‌ద్వారా మీరు మీ ఖాతాలో నేరుగా న‌గ‌దును డిపాజిట్ చేసుకోవ‌చ్చు. ఎస్‌బీఐ బ్యాంకు కొన్ని చోట్ల మాత్ర‌మే ఈ స‌దుపాయాన్ని అందిస్తోంది. న‌గ‌దు డిపాజిట్ చేసేందుకు మీరు ఏటీఎమ్ కార్డు నంబ‌రు లేదా ఖాతా సంఖ్య‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

11. ఫిక్స్‌డ్ డిపాజిట్

11. ఫిక్స్‌డ్ డిపాజిట్

ఏటీఎమ్‌ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం, అప్పటికే చేసి ఉన్న డిపాజిట్‌ను రద్దు చేసుకోవడం నిమిషాల వ్య‌వ‌ధిలో పూర్త‌వుతుంది. ఏటీఎమ్ ఆప్షన్‌లో ఓపెన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ను ఎంచుకుని కాల వ్యవధి, నగదు మొత్తాన్ని ఎంటర్ చేసి ఎంచుకుంటే చాలు. కాకపోతే మీ ఖాతాలో డిపాజిట్‌కు సరిపడా నగదు ఉండాలి. కొన్ని బ్యాంకులు ఆర్‌డీ తెరిచేందుకు సైతం ఏటీఎమ్ ద్వారానే వీలు క‌ల్పిస్తున్నాయి.

12. ప‌న్ను చెల్లింపులు

12. ప‌న్ను చెల్లింపులు

కొన్ని బ్యాంకులు తమ ఏటీఎమ్‌ల నుంచి ఆదాయపన్ను చెల్లింపునకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి ముంద‌స్తు ప‌న్ను(అడ్వాన్స్‌ ట్యాక్స్), స్వ‌యం మ‌దింపు ప‌న్ను(సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్), ప‌న్ను బ‌కాయిల‌ను సైతం చెల్లించే వెసులుబాటును క‌ల్పిస్తున్నాయి. అయితే, ఇందుకోసం ముందుగా బ్యాంకు శాఖలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏటీఎమ్‌ ద్వారా పన్ను చెల్లించిన అనంతరం వచ్చే యూనిక్ నంబర్‌ను నోట్ చేసుకుని దీని సాయంతో బ్యాంకు వెబ్‌సైట్ నుంచి రసీదు పొందవచ్చు.

13. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు

13. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు

ఏటీఎమ్‌ను క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల కోసం సైతం ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇది చాలా సుల‌భ విధానం. ఉదాహ‌ర‌ణ‌కు ఐసీఐసీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎమ్‌ల‌లోకి వెళితే 'పే యువ‌ర్ క్రెడిట్ కార్డ్ బిల్' అనే ఆప్ష‌న్ క‌న‌బ‌డుతుంది. అక్క‌డ మీరు చెల్లించాల్సిన సొమ్ము వివ‌రాలు, క్రెడిట్ కార్డు నంబ‌రు న‌మోదు చేస్తే స‌రిపోతుంది. మీ ఖాతాలోంచి నేరుగా డ‌బ్బు డెబిట్ అవుతుంది. ర‌సీదును భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం ఉంచుకోవ‌చ్చు.

14. బీమా ప్రీమియం చెల్లింపు

14. బీమా ప్రీమియం చెల్లింపు

మీరు ఇక‌పై బీమా ప్రీమియం చెల్లించేందుకు ఇన్సూరెన్స్ ఏజెంటును క‌లవాల్సిన అవ‌స‌రం లేదు. ఇంకా బీమా కార్యాల‌యానికి వెళ్ల‌క్క‌ర్లేదు. మీ పాల‌సీ ప్రీమియంను చెల్లించేందుకు ద‌గ్గ‌ర్లోని ఏటీఎమ్‌కు వెళితే చాలు. ఏటీఎమ్‌లో బిల్‌పే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకున్న త‌ర్వాత పాల‌సీ సంఖ్య‌ను న‌మోదు చేసి ప్రీమియం మొత్తాన్ని నిర్దారించుకుని చెల్లింపు చేసేయ‌వ‌చ్చు.

15. ఆధార్ నంబ‌రు న‌మోదు

15. ఆధార్ నంబ‌రు న‌మోదు

ప్ర‌స్తుతం అన్నింటికీ ఆధార్‌ను లింక్ చేయ‌డం ప‌రిపాటైపోయింది. ఈ మ‌ధ్య బ్యాంకు ఖాతాల‌కు సైతం ఆధార్ నంబ‌రు త‌ప్ప‌నిస‌రి చేస్తున్నారు. దాదాపు అన్ని జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను తెరిచే స‌మ‌యంలో ఆధార్‌ను తీసుకున్నారు. ఇంకా లింక్ చేయ‌నివారు నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎమ్ ద్వారా దీన్ని పూర్తిచేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఏటీఎమ్‌ల్లో ఒక ప్ర‌త్యేక‌మైన ఆప్ష‌న్ దీని కోసం ఉంటోంది. మీరు చేయాల్సింద‌ల్లా ఖాతా నంబ‌రును ఎంచుకుని మీ ఆధార్ నంబ‌రు నమోదు చేయ‌డం. అంతే రోజుల వ్య‌వ‌ధిలోనే ఆధార్ అనుసంధాన ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.

 ఆధార్ కార్డులో త‌ప్పులు ఉంటే మార్చుకోవ‌డం ఎలా?

ఆధార్ కార్డులో త‌ప్పులు ఉంటే మార్చుకోవ‌డం ఎలా?

ఆధార్ కార్డులో త‌ప్పులుంటే స‌వ‌రించుకోండిలా...

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

మ‌ధ్య‌త‌ర‌గ‌తి సంప‌న్నుల‌వ్వ‌డానికి ప‌నికి వ‌చ్చే 10 ఉత్త‌మ పెట్టుబ‌డులుమ‌ధ్య‌త‌ర‌గ‌తి సంప‌న్నుల‌వ్వ‌డానికి ప‌నికి వ‌చ్చే 10 ఉత్త‌మ పెట్టుబ‌డులు

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

చిన్న వ్యాపారాల‌కు రూ.10 లక్ష‌ల వ‌ర‌కూప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న రుణంచిన్న వ్యాపారాల‌కు రూ.10 లక్ష‌ల వ‌ర‌కూప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న రుణం

రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది?

రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది?

రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది?రిక‌రింగ్ డిపాజిట్ పెట్టుబ‌డుల‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది?

English summary

ఏటీఎమ్‌లో న‌గ‌దు విత్‌డ్రాకు మించి చేయ‌గ‌లిగే ఇత‌ర ప‌నులు | 15 Things every bank customer Can Do At An ATM

Automated Teller Machine (ATM) sometimes function as a mini bank. ATM allows you as a customer to make basic bank transactions. ATMs provides customers easy access to their bank accounts. Anyone with a debit or credit card can enter into an ATM counter and do transactions. Apart from withdrawing money from your account, there are many facilities available with ATM counters.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X