For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎండోమెంట్ పాలసీ అంటే ఏమిటి ?

పొదుపు మరియు ఆపదల నుండి రక్షణ కలిపి ఉండే పాలసీ ఎండోమెంట్ పాల‌సీ. ఈ పధకాలు ప్రత్యేకంగా డ‌బ్బును కూడబెట్టడం కోసం మరియు అదే సమయంలో భవిష్యత్తులో ఏదైనా అపాయం నుండి రక్షణ కోసం ఏర్పడ్డాయి. పాలసీ లక్షణం పై ఇ

|

పొదుపు మరియు ఆపదల నుండి రక్షణ కలిపి ఉండే పాలసీ ఎండోమెంట్ పాల‌సీ. ఈ పధకాలు ప్రత్యేకంగా డ‌బ్బును కూడబెట్టడం కోసం మరియు అదే సమయంలో భవిష్యత్తులో ఏదైనా అపాయం నుండి రక్షణ కోసం ఏర్పడ్డాయి. పాలసీ లక్షణం పై ఇది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా భీమా పాలసీలు వార్షిక, అర్ధ వార్షిక మరియు త్రైమాసికంగా ప్రీమియం చెల్లించే విధాన పద్ధతిలో ఉంటాయి. ప్రీమియం చెల్లింపులో ఎప్పుడూ క్రమబద్ధంగా ఉండాలి. భీమా కంపెనీలు, ప్రీమియం చెల్లింపు కాలపరిమితి దాటిపోయాక కూడ కొంత వెసులుబాటు సమయం కేటాయిస్తాయి. మీరు ఈ గ్రేస్ పీరియడ్ సమయం లోపల చెల్లింపు చేయక పోయినట్లైతే మీ పాలసీ రద్దు అయిపోతుంది.

 ఎండోమెంట్ పాల‌సీ ఫీచ‌ర్లు

ఈ పాల‌సీలు 7 ఏళ్ల నుంచి మొద‌లుకొని 30 ఏళ్ల కాల‌పరిమితి వ‌ర‌కూ వ‌ర్తించేలా బీమా కంపెనీలు పాల‌సీల‌ను రూపొందిస్తుంటాయి. ఎండోమెంట్ పాల‌సీల్లో ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించి కొంత కాలం పాటు మీ జీవితానికి కవ‌రేజీ ఉండేలా సైతం ఉంటాయి. ఇటువంటి పాల‌సీల కాల‌ప‌రిమితి(బీమా క‌వ‌రేజీ) 12-30 ఏళ్ల మ‌ధ్య ఉండొచ్చు. ఎటువంటి పొదుపు ప‌థ‌కాల్లో చేర‌కుండా ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌ర‌లో హడావిడిగా ప‌న్ను మిన‌హాయింపుల కోసం ఏదో ఒక పాల‌సీ ఉంటే చాల‌నుకునే వారు ఇటువంటి వైపు మొగ్గుచూపుతారు. పెట్టుబడి, ర‌క్ష‌ణ రెండూ కోరుకునేవారు ఇలాంటి పాల‌సీలు తీసుకోవాలి. పెట్టుబ‌డికి ఇత‌ర మార్గాల‌ను త‌ప్ప‌నిస‌రిగా చూసుకునేవారు వీటిని కాకుండా రూ. 50 ల‌క్ష‌ల నుంచి రూ.1 కోటి క‌వ‌రేజీ ఉండేలా ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవ‌డం సూచ‌నీయం. ట‌ర్మ్, ఎండోమెంట్ పాల‌సీల ప్ర‌యోజ‌నాలు వేర్వేరుగా ఉంటాయి. మీ జీవితానికి స‌రిపడే పాల‌సీని జాగ్ర‌త్త‌గా ఎంచుకోండి.

Read more about: insurance policy
English summary

ఎండోమెంట్ పాలసీ అంటే ఏమిటి ? | what is endowment policy in insurance

An endowment policy is a life insurance contract designed to pay a lump sum after a specific term (on its 'maturity') or on death. Typical maturities are ten, fifteen or twenty years up to a certain age limit. Some policies also pay out in the case of critical illness.
Story first published: Thursday, April 6, 2017, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X