For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రామిస‌రీ నోటు గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాలు

ఒక వ్య‌క్తి మ‌రొక వ్య‌క్తి నుంచి అప్పు తీసుకున్న‌ప్పుడు ప్రామిస‌రీ నోటుపై సంత‌కం పెట్టాల్సి రావొచ్చు. తాను తీసుకున్న అప్పుకు ఇది సాక్ష్యంగా ఉంటుంది. అటువంటి ప్రామిస‌రీ నోటులో చిన్న చిన్న త‌ప్పుల వ‌ల్ల

|

సులువుగా డ‌బ్బు అప్పు పొంద‌డం కోసం రుణ గ్ర‌హీత‌లు ప్రామిస‌రీ నోటు రాసి ఇస్తారు. ఒక వ్య‌క్తి మ‌రొక వ్య‌క్తి నుంచి అప్పు తీసుకున్న‌ప్పుడు ప్రామిస‌రీ నోటుపై సంత‌కం పెట్టాల్సి రావొచ్చు. తాను తీసుకున్న అప్పుకు ఇది సాక్ష్యంగా ఉంటుంది. అటువంటి ప్రామిస‌రీ నోటులో చిన్న చిన్న త‌ప్పుల వ‌ల్ల భ‌విష్య‌త్తులో రుణ దాత‌లు ఇబ్బందులు ప‌డ‌తారు. ఈ నేప‌థ్యంలో దాని గురించి స‌మ‌గ్రంగా తెల‌సుకుందాం.

ప్రామిస‌రీ నోటు

ప్రామిస‌రీ నోటుకు ఉండాల్సిన ముఖ్య ల‌క్ష‌ణాలు
1. రాత‌పూర్వ‌కంగా ఉండాలి.
2. ష‌ర‌తులు లేకుండా ఉండాలి.
3. అప్పు తీసుకునే వారి పేరు స్ప‌ష్టంగా ఉండాలి. అంటే ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రాల్లో భాగంగా ఎలా ఉందో అలా ఉండేలా చూసుకోవాలి.
4. ఎవరి పేరు మీద రాయ‌బ‌డింది, ఎవ‌రికి ఇవ్వాల్సింది రాయాలి.
5. ప్రామిస‌రీ నోటు రాసిన స్థ‌ల‌, తేదీల‌ను పేర్కొనాలి.
6. అప్పు తీసుకున్న సొమ్ము అంకెల్లోనూ, అక్ష‌రాల్లోనూ రాయాలి.
7. రెవెన్యూ స్టాంప్ అంటించి, సంత‌కం చేయాలి.
8. అడిగిన త‌క్ష‌ణం మీకు గానీ మీ అనుమ‌తి పొందిన మ‌రొక‌రికి గానీ సొమ్ము చెల్లించ‌గ‌ల వాడ‌ను అనే భేష‌ర‌తు నిర్వ‌హ‌ణ ఉండేలా చూసుకోవాలి.
9. సాక్షుల వివ‌రాలు ఉంటే మంచిది.
10. దీనికి అటెస్టేష‌న్ అవ‌స‌రం లేదు.
11. న‌గ‌దు ద్వారా ముట్టిన‌దో, చెక్కుద్వారా ముట్టిన‌దో రాయాల్సి ఉంటుంది.
12. ప్రామిస‌రీ నోటులో పోస్టాఫీసు జారీ చేసే రెవెన్యూ స్టాంప్‌ల‌ను అతికించాలి.
తీసుకున్న అప్పును తీర్చ‌వ‌ల‌సిన స‌మ‌యంలో తీర్చ‌క‌పోతే, సివిల్ కోర్టులో డ‌బ్బు వ‌సూలు చేయ‌డం కోసం కేసు వేయ‌వ‌చ్చును.

Read more about: money loan credit
English summary

ప్రామిస‌రీ నోటు గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాలు | Things to know about promissory note

Image result for promissory note in indiaen.wikipedia.orgPromissory note is a written promise to pay a debt. It is a financial instrument, in which one party (maker or issuer) promises in writing to pay a determinate sum of money to the other (the payee), either at a fixed, determinable future time or on demand of the payee subject to specific terms
Story first published: Tuesday, April 25, 2017, 17:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X