For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహ రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు ముఖ్య‌ కారణాలు

కొన్నిసార్లు లోన్ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. అయితే, మీరు ఆమోదం పొందే అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు, మీ హోమ్ లోన్ అప్లికేషన్ తిరస్కరించడానికి గల కారణాలను అప్లై చేసే ముందే తెలుసుకోవడం మంచిది. ఎందుకం

|

ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు కొన్నుక్కోవడం అనేది చిరస్మరణీయమైన లక్ష్యం. మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నపుడు, గృహ రుణానికి అప్లై చేయడం అనేది మంచి ఆలోచన. అయినప్పటికీ, హోమ్ లోన్ తీసుకోవడానికి సరిపడా లక్షణాలు మీ దగ్గర ఉన్నప్పటికీ, కొన్నిసార్లు లోన్ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. అయితే, మీరు ఆమోదం పొందే అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు, మీ హోమ్ లోన్ అప్లికేషన్ తిరస్కరించడానికి గల కారణాలను అప్లై చేసే ముందే తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే, బ్యాంకులు గృహ రుణాల అప్లికేషన్ ను నిరాకరించడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని ఇక్క‌డ తెలుసుకుందాం.

1. ఇవి గ‌మ‌నించాలి...

1. ఇవి గ‌మ‌నించాలి...

మీరు గృహ రుణానికి అప్లై చేసినపుడు, బ్యాంకులు మీ వయసు, ఆర్ధిక, ఉద్యోగ నిలకడ, రుణ చరిత్ర, తీర్చాల్సిన అప్పులు వివిధ విషయాలను దృష్టిలో ఉంచుకొని మీరు తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని అంచనా వేస్తాయి. మీ వేత‌నం క్ర‌మంగా చెల్లించ‌బ‌డుతుందా లేదా అని తెలుసుకుంటారు. మీ కంపెనీ ఇంత‌కుముందు ఉద్యోగుల‌తో ఎలా ప్ర‌పర్తించేదో అనేది కూడా ముఖ్యం. ఒక్కోసారి కంపెనీకి స‌రైన ఇమేజీ లేక‌పోతే కూడా ఆయా ఉద్యోగులు రుణం పొంద‌డ క‌ష్ట‌మ‌వ‌తుంది.

మీ గృహ రుణ అప్లికేషన్ అనుమంతించక పోవడానికి గల కొన్ని కారణాలు ఇక్కడ ఇచ్చాం.

2. బ్యాంకు రుణాలు చెల్లించని జాబితాలో మీ ఇంటి చిరునామా ఉండడం:

2. బ్యాంకు రుణాలు చెల్లించని జాబితాలో మీ ఇంటి చిరునామా ఉండడం:

మీరు రుణ చెల్లింపులు చేయని, క్రెడిట్ కార్డ్ లేదా కోర్టులో దావా ఉన్న చెడు అనుభవాలు కలిగిన వ్యక్తితో కలిసి ఉన్నపుడు. ఇలాంటి సందర్భాలలో, గృహ ఋణం పొందడం అసాధ్యం ఎందుకంటే బ్యాంకుల దగ్గర సరిగా రుణాలు చెల్లించని వారి వివరాలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి.

3. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండ‌టం:

3. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండ‌టం:

క్రెడిట్ కార్డ్ బ‌కాయిలు, బిల్స్, ఈఎంఐ చెల్లింపులు, కట్టని అప్పులు, ఇన్సూరెన్స్ ప్రేమియమ్ లు, చాలా సంవత్సరాల నుండి కట్టకుండా ఉన్న టెలిఫోన్ బిల్లులు వీటన్నిటి కారణంగా గృహ రుణాల ద‌ర‌ఖాస్తును తిరస్కరించే అవ‌కాశం ఉంది. ఇంటి లోను త్వరగా అంగీకరించా బడాలి అంటే మీరు చెల్లించాల్సిన లోన్లు, బిల్లులు, చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ లు మొదలైనవి ఎటువంటి ఆలస్యం లేకుండా సరైన సమయంలో చెల్లించడం ముఖ్యం.

4. అప్పటికే ఉన్న రుణాన్ని చెల్లించడం:

4. అప్పటికే ఉన్న రుణాన్ని చెల్లించడం:

అప్లికేషన్ బ్యాంక్ కు చేరిన తరువాత, వారు అప్పు తీసుకునే వారి లోన్ చెల్లింపుల వివరాలను పరీక్షిస్తారు. అతనికి ఉన్న కారు లోను, కమర్షియల్ లోను, వ్యక్తిగత రుణం ఏదైనా ఉందా అని పరీక్షించి వీటన్నింటికి లోను పోగా ఇంకా మీకు ఎంత జీతం మిగులుతుందో లెక్క కడతారు. రుణ చెల్లింపులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తే బ్యాంకు వారు మీకు తిరిగి చెల్లించే సామర్ధ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి మీ అప్లికేషన్ ను తిరస్కరిస్తారు.

5. ఉద్యోగంలో స్థిరత్వం:

5. ఉద్యోగంలో స్థిరత్వం:

మీరు తరచుగా ఉద్యోగం మారుతూ ఉంటే, తప్పనిసరిగా అది మీ ఇంటి రుణానికి ఆమోదం పొందే అవకాశంపై ప్రభావం చూపిస్తుంది, ఎందుకంటే బ్యాంకు ఉద్యోగస్తుల ఉద్యోగ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఆ రుణాన్ని తీర్చే సామర్ధ్యం ఉందొ లేదో నిర్ధరించుకుంటారు. ఇంకా కొంత మంది త‌ర‌చూ ఏదో కార‌ణంతో ఉద్యోగంలోంచి తొల‌గించ‌బ‌డ‌తారు. కొన్ని సందర్భాలలో, ఈ హోమ్ లోన్ పొందడానికి ఒక వ్యక్తి ఒక ఖచ్చితమైన సంస్ధలో కొంత సమయం వరకు పనిచేసి ఉండాలనే ష‌ర‌తును కూడా బ్యాంక్ వారు అడగవచ్చు.

 6. లోన్ ఎగ్గొట్టకుండా ఉండడానికి రుణ‌ హామీ ఇచ్చే వారు ఉండడం:

6. లోన్ ఎగ్గొట్టకుండా ఉండడానికి రుణ‌ హామీ ఇచ్చే వారు ఉండడం:

ఒకవేళ మీరు రుణానికి హామీ ఇచ్చేటపుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు హామీ ఇచ్చే వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ అప్పు తీర్చగలడా లేదా అనేది నిర్ధారించుకోండి. ఆ వ్యక్తి తన లోను మొత్తాన్ని కట్టలేకపోతే, హామీ ఇచ్చిన వ్యక్తే ఆ అప్లికేంట్ తరుఫున అప్పు తీర్చాల్సి ఉంటుంది, దాని ఫలితమే పూర్ క్రెడిట్ రిపోర్ట్.

7. వయసును దృష్టిలో పెట్టుకోవడం:

7. వయసును దృష్టిలో పెట్టుకోవడం:

మీరు రిటైర్మెంట్ కి దగ్గరలో ఉంటే, బ్యాంకులు మీ రుణ ద‌ర‌ఖాస్తును తిరస్కరించవచ్చు, ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరువాత మీరు అప్పు తీర్చే సామర్ధ్యం తగ్గిపోతుంది కాబట్టి. ఇలాంటి కేసులలో, కొన్ని బ్యాంకులు తక్కువ సమయంలో చెల్లించే రుణాలను ప్రవేశ పెడతారు కానీ ఇవి నెలకు కట్టే ఇ ఎమ్ ఐ భారమై ద‌ర‌ఖాస్తుదారు ఇబ్బంది పడవచ్చు.

8. ద‌ర‌ఖాస్తును ఇంత‌కుముందే ఆపివేసినపుడు:

8. ద‌ర‌ఖాస్తును ఇంత‌కుముందే ఆపివేసినపుడు:

గృహ రుణ ద‌ర‌ఖాస్తును విశ్లేషించే టపుడు, తిరస్కరించిన గృహ రుణ జాబితాను పరిశీలిస్తారు. ఇలాంటి సందర్భాలలో, ఒక అప్లికేంట్ ఒకే సమయంలో అన్ని బ్యాంకులలో గృహ రుణానికి అప్లై చేయ కూడదు. ఒకసారి మీ అప్లికేషన్ తిరస్కరించబడినపుడు, మీరు వేరే బ్యాంకును సంప్రదించే ముందు అక్కడ జరిగిన తప్పులను తెలుసుకుని ఉండాలి. మ‌ళ్లీ ఎలాంటి త‌ప్పుల‌కు తావివ్వ‌కుండా ద‌ర‌ఖాస్తు చేయాలి.

9. మీరు ఎంచుకున్న ఆస్తి వివరాలు పాలసీ మార్గదర్శకాలను సంతృప్తి పరచలేదు:

9. మీరు ఎంచుకున్న ఆస్తి వివరాలు పాలసీ మార్గదర్శకాలను సంతృప్తి పరచలేదు:

అన్ని రకాల గృహ రుణాలు లోన్ పొందడానికి అనుకూలంగా ఉండవు అనే విషయాన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా, బ్యాంకులు అమ్మడానికి తేలికగా ఉన్న, లెక్కకు తేలికైన, స్థిరమైన ధర కలిగిన ఆస్తులకే ప్రాధాన్యతను ఇస్తాయి. అందువల్ల మీరు ఆస్తిని ఎంచుకునే టపుడు రుణం పొందడానికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు బిల్డర్ దగ్గర ఉన్నాయా లేదా అనేది మీరు తప్పక నిర్ధారించుకోవాలి.

Read more about: home loan
English summary

గృహ రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు ముఖ్య‌ కారణాలు | 9 uncommon reasons for Your Home loan Rejections

Many people do not check their credit scores and are mostly oblivious to the same. For instance, a survey conducted by credit health improvement company Credit Sudhaar sometime back had revealed that more than 85% of the respondents were unaware of credit bureaus, while a whopping 92% didn't know their credit scores. No wonder loan rejection because of credit score issues comes as a surprise to many loan takers.
Story first published: Thursday, April 13, 2017, 14:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X