For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స‌త్వ‌ర చెల్లింపుల కోసం భార‌త్ క్యూఆర్ కోడ్‌.. ఇది మ‌న ప్ర‌భుత్వ యాప్‌...

క్యూఆర్ కోడ్ సాయంతో చెల్లింపులు చేసే విధానంలో పీవోఎస్ యంత్రాల అవ‌స‌రం ఉండ‌దు. దీంతో ప్ర‌తిసారి కార్డు తీసి స్వైప్ చేయ‌న‌క్క‌ర్లేదు. అందువ‌ల్ల వినియోగ‌దారు స‌మ‌యం ఆదా అవ‌డంతో పాటు, వ్యాపారుల‌కు యంత్రాల

|

న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హించేందుకు గాను ప్ర‌భుత్వం ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి ఇంట‌ర్‌పోర్ట‌బుల్ పేమెంట్ యాక్సెప్టెన్సీ వ్య‌వ‌స్థ భార‌త్‌క్యూఆర్ కోడ్‌ను తీసుకొచ్చింది. చెల్లింపుల‌కు ఎటువంటి కార్డు అవ‌స‌రం లేకుండా ఉండ‌టం దీని ప్ర‌త్యేక‌త‌. వ్యాపారుల‌కు, వినియోగ‌దారుల‌కు ఇతోధికంగా ఉప‌యోగ‌ప‌డే ఈ వ్య‌వ‌స్థ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాలు మీ కోసం...

క్యాష్ లెస్ ఎకాన‌మీ...

క్యాష్ లెస్ ఎకాన‌మీ...

న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్లేందుకు భార‌త ప్ర‌భుత్వం దూకుడుగా ముందుకెళుతోంది. ఈ క్ర‌మంలోనే వివిధ బ్యాంకులు యూపీఐ విధానాన్ని తీసుకొచ్చాయి. ప్ర‌భుత్వం అన్ని బ్యాంకుల యూపీఐ సేవ‌ల‌ను అనుసంధానిస్తూ భీమ్ యాప్‌ను త‌యారుచేసింది. ఇప్పుడు అదే కోవ‌లో చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా త‌క్కువ వివ‌రాల‌తోనే చెల్లింపుల‌న్నీ స‌త్వ‌రంగా జ‌రిగేలా భార‌త్ క్యూఆర్ కోడ్‌ను విడుద‌ల చేశారు.

 స్మార్ట్‌ఫోన్‌, నెట్ ఉంటే చాలు!

స్మార్ట్‌ఫోన్‌, నెట్ ఉంటే చాలు!

చిన్న పాన్ షాప్‌, కిరాణా కొట్టు చెల్లింపుల కోసం ఎండీఆర్ చార్జీల‌ను భ‌రించే స్థితిలో ఉండ‌లేరు. అంతే కాకుండా వారు ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ల‌ను, ఇంట‌ర్నెట్‌ను ఖ‌ర్చుల‌ను నిర్వ‌హించుకునేందుకు సుముఖంగా ఉండ‌రు. ఈ స‌మస్య‌ల‌న్నీ కొత్త వ్య‌వ‌స్థ‌లో ఉండ‌వు. మీ ద‌గ్గ‌ర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. అందులో మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా భీమ్ యాప్ సాయంతో భార‌త్ క్యూఆర్ కోడ్ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

 ఎవ‌రు త‌యారుచేశారు?

ఎవ‌రు త‌యారుచేశారు?

దేశంలో డిజిట‌ల్ చెల్లింపుల‌కు ఆజ్యం పోసిన ఎన్‌పీసీఐ దీన్ని సైతం అభివృద్ది చేసింది. ఎన్‌పీసీఐ అంటే నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్‌బీఐ అనుబంధ సంస్థ‌. డెబిట్‌, కార్డుల ద్వారా చెల్లింపుల‌కు ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చేందుకు భార‌త్ క్యూఆర్ కోడ్‌ను తీసుకొచ్చారు.

క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి?

క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి?

క్విక్ రెస్పాన్స్ కోడ్ అనే ఆంగ్ల ప‌దానికి సంక్షిప్త రూపమే క్యూఆర్ కోడ్‌. మెషీన్‌కు అర్థ‌మ‌య్యేలా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండే 2డీ కోడ్‌నే క్యార్ కోడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇందులో వ్యాపారి బ్యాంకు ఖాతా వివ‌రాలు సేవ్ అయి ఉంటాయి. వెబ్‌సైట్ అడ్ర‌స్‌(యూఆర్‌ఎల్‌), ఈ-మెయిల్ ఐడీ, పీడీఎఫ్‌, ఎంపీ3, యాప్‌ల‌ను క్యూఆర్ కోడ్ రూపంలో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. వీటిని సాధార‌ణంగా షాప్‌ల ద‌గ్గ‌ర ఎక్కువ‌గా చూస్తుంటారు. వాణిజ్య అవ‌స‌రాల కోసం వ్యాపారుల‌కు ఇది ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది.

చెల్లింపుల కోసం అన్నీ సంయుక్తంగా

చెల్లింపుల కోసం అన్నీ సంయుక్తంగా

దేశంలో మొద‌టి సారి ఎన్‌పీసీఐ, వీసా, మాస్ట‌ర్ కార్డ్‌, అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ అన్నీ ముందుకొచ్చి సంయుక్తంగా చెల్లింపుల వ్య‌వ‌స్థ కోసం ఒక అంగీకారానికి వ‌చ్చాయి. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌న‌మేంటంటే మీ ద‌గ్గ‌ర మాస్ట‌ర్ కార్ట్ ఉంటుంది. కానీ షాప్ య‌జ‌మాని వ‌ద్ద మాస్ట‌ర్ కార్డ్ ఎనేబుల్డ్ బ్యాంకు ఖాతా ఉండొచ్చు. అయినప్ప‌టికీ ఎటువంటి అవాంత‌రాలు లేకుండా చెల్లింపులు జరిగిపోతాయి. ఏ బ్యాంకు ఖాతా నుంచి అయినా, ఏ పేమెంట్ గేట్‌వే ద్వారానైనా చెల్లింపులు జ‌రిగేలా చూసేదే క్యూఆర్ కోడ్‌(QR code).

ఇందులో ఎవ‌రెవ‌రు భాగ‌స్వాములు

ఇందులో ఎవ‌రెవ‌రు భాగ‌స్వాములు

ఇప్ప‌టికీ 15 బ్యాంకులు క్యూఆర్ కోడ్ వ్య‌వ‌స్థ‌ను వాడేందుకు సంసిద్దంగా ఉన్నాయి. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియ‌న్ బ్యాంక్‌, డీసీబీ, క‌రూర్ వైశ్యా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ , ఐడీబీఐ బ్యాంక్ , ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్‌, యెస్ బ్యాంక్ ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌స్థ‌లో భాగంగా ఉన్నాయి. వ‌చ్చే కొన్ని రోజుల్లో ఇంకొన్ని బ్యాంకులో ఇందులో చేరే అవ‌కాశం ఉంది.

చెల్లింపులు ఎలా చేయాలి?

చెల్లింపులు ఎలా చేయాలి?

మీరు హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారు అనుకోండి. మొద‌ట మీ మొబైల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ పేజాయాప్ డౌన్ లోడ్ చేసుకుని ఉండాలి. ఈ యాప్ నుంచి భార‌త్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. త‌ర్వాత ఎంత డ‌బ్బు చెల్లించాలో న‌మోదు చేయాలి. బ్యాంక్ మీ గుర్తింపును త‌నిఖీ చేసిన త‌ర్వాత పేమెంట్ ప్రోసీడ్ చేసేందుకు అంగీక‌రిస్తుంది. అప్పుడు మీకు మొబైల్లో ఒక పిన్ వ‌స్తుంది. చెల్లింపును పూర్తిచేసేందుకు ఈ పిన్‌ను ఎంట‌ర్ చేయాలి. ఐసీఐసీఐ క‌స్ట‌మ‌ర్లైతే పాకెట్స్ యాప్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఏ బ్యాంకు క‌స్ట‌మ‌ర్లైనా ఆయా బ్యాంకుల‌కు సంబంధించిన ముఖ్య‌మైన అధికారిక యాప్‌ను క‌లిగి ఉంటే చాలు. దేంట్లో అయినా చెల్లింపులు జ‌రిగే విధానం ఒక‌టే.

యూపీఐతో అనుసంధానత‌

యూపీఐతో అనుసంధానత‌

ఆధారిత పేమెంట్ యాప్‌ల‌ను సైతం భార‌త్ క్యూఆర్ కోడ్ స‌పోర్ట్ చేస్తుంది. కాబ‌ట్టి పేమెంట్స్ కోసం భార‌త ప్ర‌భుత్వ అధికారిక యాప్ అయిన భీమ్‌ను సైతం వాడుకోవ‌చ్చు. వివిధ బ్యాంకుల వివ‌రాల‌ను భీమ్ యాప్‌లో అనుసంధానించేందుకు స‌దుపాయం ఉంటుంది కాబ‌ట్టి చెల్లింపుల‌ను యాపీఐ యాప్‌ల ద్వారా సైతం చేసేందుకు భార‌త్ క్యూఆర్ కోడ్ అవ‌కాశం క‌ల్పిస్తుంది. యూపీఐ-ముఖ్య విష‌యాలు

చెల్లింపుల‌న్నీ త‌క్కువ ఖ‌ర్చులోనే

చెల్లింపుల‌న్నీ త‌క్కువ ఖ‌ర్చులోనే

క్యూఆర్ కోడ్ సాయంతో చెల్లింపులు చేసే విధానంలో పీవోఎస్ యంత్రాల అవ‌స‌రం ఉండ‌దు. దీంతో ప్ర‌తిసారి కార్డు తీసి స్వైప్ చేయ‌న‌క్క‌ర్లేదు. అందువ‌ల్ల వినియోగ‌దారు స‌మ‌యం ఆదా అవ‌డంతో పాటు, వ్యాపారుల‌కు యంత్రాల అద్దె చెల్లించే ప్ర‌యాస త‌ప్పుతుంది. అటు వ్యాపారులు, ఇటు వినియోగ‌దారులు న‌గ‌దు ర‌హిత చెల్లింపుల దిశ‌గా మ‌ళ్లి క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల‌కు సుముఖ‌త చూపితే ఇప్ప‌టిదాకా చెల్లింపుల‌కు అయ్యే ఖ‌ర్చుల‌న్నీ త‌గ్గే వీలుంది. ఇది డిజిట‌ల్ భార‌త్ క‌ల‌ను సాకారం చేయ‌గ‌ల‌దు.

దేశంలో 10 అతిపెద్ద ఆర్థిక స్కామ్‌లివే... దేశంలో 10 అతిపెద్ద ఆర్థిక స్కామ్‌లివే...

Read more about: card payments cashless digital qr code
English summary

స‌త్వ‌ర చెల్లింపుల కోసం భార‌త్ క్యూఆర్ కోడ్‌.. ఇది మ‌న ప్ర‌భుత్వ యాప్‌... | what is Bharat QR code and how it works for payments

With Bharat QR Code, the requirement of PoS machines for swiping cards goes away, which makes it more secured, less time consuming, and more importantly: cheaper. With no transaction cost involved, going cashless via Bharat QR Code will drastically bring down the total costs involved, for both the consumer and the merchant. In a way, Bharat QR Code makes cash and cashless transaction same in terms of value, and also saves time. A big win for the digital economy
Story first published: Wednesday, March 8, 2017, 12:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X