For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్ కార్డుతో ఆధార్ సంఖ్య‌ను అనుసంధానించ‌డం ఎలా?

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేసేందుకు పాన్‌తో ఆధార్ అనుసంధానాన్ని జులై 1 నుంచి త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం. డిసెంబ‌రు 31 తుది గ‌డువు.ఈ క‌థ‌నంలో ఆధార్ సంఖ్య‌ను పాన్‌తో అనుసంధానం

|

పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గ‌డువును ప్ర‌భుత్వం డిసెంబ‌రు 31,2017 వ‌ర‌కూ పెంచింది.

ఆన్‌లైన్ విధానంలో ఈ అనుసంధాన ప్రక్రియ 2 నుంచి 5 నిమిషాల్లోనే పూర్త‌వుతుంది. ఒక‌వేళ ఆధార్‌,పాన్ కార్డుల్లో పేరు, పుట్టిన తేదీ వివ‌రాలు స‌రిపోల‌క‌పోతే ఆయా కార్డుల్లో వివరాల‌ను స‌రిచేసుకోవాలి.ఆధార్‌,పాన్ అనుసంధానాన్ని ఆన్‌లైన్లో చేయ‌డం ఎలానో తెలుసుకుందాం.

ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి...

ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి...

పేరు, పుట్టిన తేదీ, లింగం వంటివి మ్యాచ్ స‌రిపోలితేనే ఈ అనుసంధాన ప్ర‌క్రియ చేసేందుకు వీల‌వుతుంది. మొద‌ట ప‌న్ను చెల్లింపుదార్లు ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్లో రిజిస్ట‌ర్ అవ్వాలి. ఇదివ‌ర‌కే యూజ‌ర్ ఖాతా క‌లిగి ఉన్న‌వారు నేరుగా ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌లో నేరుగా లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యేందుకు యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్, కోడ్ల‌ను ఎంట‌ర్ చేయండి.

ఆధార్ లింక్‌

ఆధార్ లింక్‌

లాగిన్ అయిన త‌ర్వాత‌ :

ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి

అక్క‌డ లింక్ ఆధార్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేయండి.

ఈ ద‌శలో పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివ‌రాలను నమోదు చేయాలి

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఈ వివ‌రాల‌ను స‌రిచూస్తుంది

క్రాస్ చెక్ పూర్త‌యిన త‌ర్వాత మీ నంబ‌రు, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేయాలి.

నిమిషాల్లో లింకింగ్ పూర్తి

నిమిషాల్లో లింకింగ్ పూర్తి

వ్యాలిడేష‌న్ పూర్త‌యిన త‌ర్వాత పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం జ‌రుగుతుంది.

వివ‌రాల‌న్నీ స‌రిపోలితేనే ఈ అనుసంధాన ప్ర‌క్రియ స‌జావుగా జ‌రుగుతుంది.

అనుసంధానం పూర్త‌యితే మీకు స‌మాచారం అందుతుంది.

అందుకే ఇప్పుడే ఎవ‌రివైనా ఆధార్ కార్డులో వివ‌రాలు సరిగా లేక‌పోతే మార్చుకోండి.

ఆధార్ త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డం ఎలా?

అనుసంధానం ఎందుకు?

అనుసంధానం ఎందుకు?

పాన్‌తో పాటు ఆధార్ అనుసంధానం చేయ‌ని ప‌క్షంలో కొన్ని రోజుల త‌ర్వాత పాన్ ప‌నికిరాకుండా పోతుంద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఆధార్ లేని వారు దాని కోసం ద‌ర‌ఖాస్తు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం సూచించింది. అనుసంధానం చేసేట‌ప్పుడు ఈ మ‌ధ్యే ఆధార్ కోసం అప్లై చేసిన వారు ఎన్‌రోల్మెంట్ నంబ‌రు వేస్తే చాలు.

వీటికి ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే ఇవి కోల్పోతారువీటికి ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే ఇవి కోల్పోతారు

Read more about: aadhar pan
English summary

పాన్ కార్డుతో ఆధార్ సంఖ్య‌ను అనుసంధానించ‌డం ఎలా? | know the procedure how to link your PAN card with Aadhaar card

In order to link PAN and Aadhaar cards, tax payers have to first register on the Income tax e-Filing portal. Once they have done so, they are to follow the steps outlined below:Log in to the e-Filing portal of the Income Tax Department by entering the log-in ID, password and date of birthAfter punching in the details, you will also have to feed in a code
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X