For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్‌కు సంబంధించిన ముచ్చ‌ట‌గొలిపే 10 విష‌యాలు ఇవే...

ప్ర‌పంచవ్యాప్తంగా ఇప్పుడు గూగుల్ పేరు తెలియ‌ని అక్ష‌రాస్యుడు లేడంటే అతిశ‌యోక్తి కాదేమో. ప్ర‌తి ఒక్క‌రూ ఏదో సంద‌ర్భంలో గూగుల్ అందిస్తున్న వివిధ ఉత్పత్తుల‌ను ఉప‌యోగిస్తూనే ఉంటారు. అలాంటి గూగుల్ గురించి

|

గూగుల్ అస‌లు పేరు Googol. వాస్త‌వానికి గూగుల్ సెర్చ్ ఐడియాను లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్ 1 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్మేద్దామ‌నుకున్నార‌ట‌. కానీ ఆ ఆలోచ‌న‌ను కొనేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో వీరే స్వ‌యంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించి సాంకేతిక ప్ర‌పంచంలో ఒక ప్ర‌భంజ‌నాన్ని సృష్టించారు.
ప్ర‌పంచవ్యాప్తంగా ఇప్పుడు గూగుల్ పేరు తెలియ‌ని అక్ష‌రాస్యుడు లేడంటే అతిశ‌యోక్తి కాదేమో. ప్ర‌తి ఒక్క‌రూ ఏదో సంద‌ర్భంలో గూగుల్ అందిస్తున్న వివిధ ఉత్పత్తుల‌ను ఉప‌యోగిస్తూనే ఉంటారు. అలాంటి గూగుల్ గురించి మీకు తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మీ కోసం ఈ క‌థ‌నంలో...

గూగుల్ సమాచారం ఇలా...

గూగుల్ సమాచారం ఇలా...

గూగుల్ నిర్వ‌హించే మొత్తం స‌మాచారం 86 టెరా బైట్ల‌లో నిక్షిప్త‌మై ఉంటుంది. ఇందుకోసం 2 బిలియ‌న్ లైన్ల కోడ్ అవ‌స‌రం. ప్ర‌తిసారి మీరు గూగుల్ అందించే ఏదైనా స‌ర్వీస్ వెబ్‌సైట్లో(జీమెయిల్‌, యూట్యూబ్) సెర్చ్ చేసిన‌ప్పుడు అది 86 టెరా బైట్ల ఫైల్‌లో(2 బిలియ‌న్ లైన్ కోడ్‌తో) శోధిస్తుంది. అంతేకాకుండా మ‌నం కొత్త‌ది ఏదైనా స‌మ‌చారం అందించిన‌ప్పుడు అది సంబంధిత ఫైల్లో నిక్షిప్త‌మ‌వుతుంది.

యూట్యూబ్ ఇంత‌లానా...

యూట్యూబ్ ఇంత‌లానా...

2006లో గూగుల్ యూట్యూబ్‌ను 1.65 బిలియ‌న్ డాల‌ర్ల‌కు కొనేసింది. ప్ర‌స్తుతం యూట్యూబ్ ప్రపంచంలోనే రెండో ప్ర‌ఖ్యాత వెబ్‌సైట్‌గా నిలిచింది. దీనికి నిత్యం గూగుల్ వినూత్న ఆలోచ‌న‌లే కార‌ణంగా చెబుతారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ చాన‌ల్ నుంచి ఎన్నో వీడియోల‌ను అప్‌లోడ్ చేసేందుకు యూట్యూబ్ అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఒక నిమిషానికి యూట్యూబ్‌లో 300 గంట‌ల నిడివికి స‌మాన‌మైన వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయంట‌. ఇంకా ముందుకు వెళితే ఒక సంవ‌త్స‌ర కాలంలో 157 మిలియ‌న్ గంట‌ల‌కు స‌మాన‌మైన వీడియోల అప్‌లోడ్ జ‌రుగుతున్న‌ది.

గూగుల్ అస‌లు పేరు

గూగుల్ అస‌లు పేరు

గూగుల్ అస‌లు పేరు బ్యాక్ ర‌బ్‌. లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్ అనే ఇద్ద‌రూ గ్రాడ్యుయేట్లు ఒక గ్యారేజీలో స్థాపించిన ఈ స్టార్ట‌ప్ పేరు బ్యాక్ ర‌బ్‌. ప్ర‌స్తుతం గూగుల్ అంటే తెలియ‌ని అక్ష‌రాస్యుడు లేడంటే అతిశ‌యోక్తి కాదేమో. గూగుల్ సెర్చ్ అల్గారిథ‌మ్ కేవ‌లం కీవ‌ర్డ్‌, మ్యాచింగ్ స్ట్రింగ్‌ల‌పైనే ఆధార‌ప‌డ‌కుండా. బ్యాక్‌లింక్స్ పాయింటింగ్ ఆధారం చేసుకుని గూగుల్ వెబ్‌సైట్ల‌కు సెర్చ్ ర్యాంకింగ్‌ల‌ను ఇస్తుండ‌టం విశేషం.

జీ-మెయిల్‌

జీ-మెయిల్‌

గూగుల్ ఉత్ప‌త్తుల్లో ముఖ్య‌మైన జీ-మెయిల్ ప్ర‌పంచంలో 50కి పైగా భాష‌ల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాష‌లో ఉండ‌టం మ‌న అదృష్టం. మెయిల్ తెర‌వ‌గానే ర‌క‌ర‌కాల ఐడీల నుంచి అన‌వ‌స‌ర మెయిల్స్ వ‌స్తుంటాయి. వీటిని ఒక‌సారి తొల‌గించినా మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చి విసిగిస్తుంటాయి. ఈ బాధ‌లు త‌ప్పించేందుకు జీమెయిల్ రెండు స‌రికొత్త ఆప్ష‌న్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. బ్లాక్‌, అన్‌స‌బ్‌స్క్రైబ్ ఆప్ష‌న్లు ఎప్పుడో వ‌చ్చాయి. అయితే వాటిని ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో అందుబాటులోకి తీసుకురావ‌డం గూగుల్‌కే చెల్లింది.

ఐ యామ్ ఫీలింగ్ ల‌క్కీ

ఐ యామ్ ఫీలింగ్ ల‌క్కీ

మ‌నం మామూలుగా గూగుల్.కో.ఇన్ లో కానీ గూగుల్.కామ్‌లో సెర్చ్ చేసిన‌ప్పుడు అవ‌స‌ర‌మైన ఫ‌లితం రావ‌డం కోసం క‌ష్ట‌ప‌డుతుంటాం. అన‌వ‌స‌ర‌మైన ఫ‌లితాల్లో మ‌న‌కు కావాల్సింది వెతుక్కునే ఓపిక అంద‌రికీ ఉండ‌దు. అలాంట‌ప్పుడు ఐ యామ్ ఫీలింగ్ ల‌క్కీ అనే దానిపై క్లిక్ చేస్తే ఇంత‌కు ముందు సెర్చ్ ఫ‌లితాల్లో ఏది ముందుంటే నేరుగా అక్క‌డికి తీసుకెళుతుంది. ఇది సెర్చ్ రిజ‌ల్ట్స్ పేజీని బైపాస్ చేస్తుంది. దీని వ‌ల్ల స‌మ‌యం ఆదా అవుతుంది.

గూగుల్ ప్ల‌స్

గూగుల్ ప్ల‌స్

2010 త‌ర్వాత గూగుల్ అధికారికంగా గూగుల్ ప్ల‌స్‌ను రిలీజ్ చేసింది. ఇది ఒక సామాజిక మాధ్య‌మం. ఫేస్ బుక్ ప్ర‌జ‌ల్లో చొచ్చుకుపోవ‌డం వ‌ల్ల‌, స‌రైన యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల గూగుల్ ప్ల‌స్ అనుకున్నంత విజ‌య‌వంతం అవ్వ‌లేదు. గూగుల్ ప్ల‌స్‌ను సంక్షిప్తంగా జీ ప్ల‌స్ అని సైతం పిలుస్తారు. ఎవ‌రినైనా క‌మ్యూనిటీలో యాడ్ చేయ‌డానికి ,ఈ వెంట్స్‌కు ఆహ్వానించేందుకు ఇందులో ఆప్ష‌న్లు ఉంటాయి. ఏదైనా గూగుల్ సెర్చ్‌లో వెతికిన‌ప్పుడు ఒక్కోసారి గూగుల్ ప్ల‌స్ రిజ‌ల్ట్స్ సైతం వ‌స్తుండ‌టాన్ని మీరు గ‌మ‌నించే ఉంటారు. ఈ మ‌ధ్యే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను, గూగుల్ ప్ల‌స్ పేజీతో ఇంట‌ర్ లింక్ చేసి ఉండ‌టమే ఇందుకు కార‌ణం.

గూగుల్ క్రోమ్‌

గూగుల్ క్రోమ్‌

గూగుల్ క్రోమ్ అనేది ఒక వెబ్ బ్రౌజ‌ర్. దీనిని గూగుల్ అభివృద్ది చేసింది. మొద‌టి సారి బీటా వెర్ష‌న్ సెప్టెంబ‌రు 2,2008న విడుద‌ల కాగా, దీని స్థిర‌మైన తుది వెర్ష‌న్ డిసెంబ‌రు 11,2008న విడుద‌లైంది. గ్రాఫిక‌ల్ యూజ‌ర్ ఇంట‌ర్ ఫేస్ ఫ్రేమ్ లేదా వెబ్ బ్రౌజ‌ర్ యొక్క క్రోమ్ నుంచి దీని పేరును స్వీక‌రించారు. జూన్ 2015 నాటి నుంచి ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది నెటిజ‌న్లు ఉప‌యోగిస్తున్న బ్రౌజ‌ర్‌గా క్రోమ్ ఉంది. క్రోమ్ జావా స్క్రిప్ట్ వర్చువ‌ల్ మెషీన్‌ను ఉప‌యోగిస్తుంది. క్రోమ్ 4.1తో ప్రారంభ‌మై, గూగుల్ ట్రాన్స్‌లేట్(Google Translate)ను ఉప‌యోగించే ఒక అంత‌ర్నిర్మిత‌(ఇన్ బిల్ట్‌) అనువాద సూచీని జోడించారు. ప్ర‌స్తుతం అనువాదం 52 భాష‌లకు పైగా అందుబాటులో ఉంది. ఇక్క‌డ కేవ‌లం అనువాదం స్వీక‌రించ‌డ‌మే కాకుండా suggest edit అనే ఆప్ష‌న్ ద్వారా మ‌నం సైతం అనువాదానికి తోడ్ప‌డ‌వ‌చ్చు.

 గూగుల్ మ్యాప్స్‌

గూగుల్ మ్యాప్స్‌

మ‌హా న‌గ‌రాల‌తో మొద‌లుపెట్టి టైర్‌-2, టైర్‌-3 న‌గ‌రాల‌ను దాటి ప్ర‌స్తుతం చిన్న పట్ట‌ణాల‌కు సైతం గూగుల్‌మ్యాప్స్ విస్త‌రించింది. ఫ‌లానా అడ్ర‌స్ ఎక్క‌డ ఉంది? ఒక‌ప్పుడు ఇది తెలుసుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఇంట‌ర్నెట్ ఉన్న మొబైల్‌లో గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలు. ఎవ‌రిని అడ‌గాల్సిన ప‌ని లేదు. గూగుల్ మ్యాప్స్‌లో కేవ‌లం మ‌న‌కు కావాల్సిన ప్రాంతాన్ని వెద‌క‌డ‌మే కాదు. ఇంకా ఎన్నో చేయొచ్చ‌ని మీకు తెలుసా? మ‌్యాప్స్ ద్వారా సంవ‌త్స‌రంలో మీరు ఎప్పుడు, ఎక్క‌డ ఉన్నారో తెలుస్తుంది. దీని కోసం మ్యాప్స్ యాప్ పై క‌నిపించే మూడు అడ్డ గీత‌ల ఐకాన్‌ను క్లిక్ చేస్తే యువ‌ర్ టైమ్ లైన్ ఆప్ష‌న్‌ను చూడాలి. 360 డిగ్రీల్లో ప్ర‌ముఖ ప్రాంతాలు, క‌ట్ట‌డాల‌ను గూగుల్ మ్యాప్స్‌లో చూడొచ్చు. ప్ర‌కృతి వైప‌రీత్యాల హెచ్చ‌రిక‌ల ఫీచ‌ర్‌ను సైతం గూగుల్ త‌న అప్లికేష‌న్‌లో ప్ర‌వేశ‌పెట్టింది.

గూగుల్ డూడుల్‌

గూగుల్ డూడుల్‌

ఇప్పుడైతే గూగుల్ డూడుల్స్ వేల కొల‌దీ వ‌చ్చేశాయి. మొద‌టి గూగుల్ డూడుల్ ఎప్పుడు త‌యారుచేశారో తెలుసా? 1998లో. నెవ‌డా పండ‌గ సంద‌ర్భంగా ఒక వ్య‌క్తి కాలిపోతున్న ఫోటోను ప్ర‌తిబింబిస్తూ బ‌ర్నింగ్ ఐకాన్ లోగోతో మొద‌టి డూడుల్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. యూజ‌ర్ల‌కు ఒక ఆఫ్ బీట్ మెసేజ్‌గా అందించాల‌నుకున్నట్లు గూగుల్ సహ వ్య‌వ‌స్థాప‌కులు వెల్ల‌డించారు.

టాప్‌-3 ఛాయిస్‌లో గూగుల్

టాప్‌-3 ఛాయిస్‌లో గూగుల్

ప్రపంచంలో టాప్ బ్రాండ్లలో ఎప్పుడూ ముందుండే గూగుల్ సంస్థ గురించి మ‌న‌కు తెలిసిన స‌మాచారం కొంతే. కొన్ని కోటానుకోట్ల పేజీల స‌మ‌చారాన్ని నిర్వ‌హించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. 1990ల్లో స్టాన్‌ఫోర్ట్ విశ్వ‌విద్యాల‌యంలో విద్యార్థులైన లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్ దాన్ని ప్రారంభించిన‌ప్పుడు అది ఇంత పెద్ద వ్యాపారంగా ఎదుగుతుంద‌ని ఊహించి ఉండ‌రు. ఈ మ‌ధ్యే ఉద్యోగులు ప‌నిచేయ‌డానికి ఎక్కువ ఆస‌క్తి చూపే కంపెనీల్లో గూగుల్ టాప్‌-3లో నిల‌వ‌డం విశేషం.

గూగుల్ స్ట్రీట్ వ్యూ

గూగుల్ స్ట్రీట్ వ్యూ

గూగుల్ మ్యాప్స్ ఆలోచ‌నే ఒక అద్భుతం. అదే సూప‌ర్ అనుకుంటుంటే 2007లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. 50 దేశాల్లో 50 ల‌క్ష‌ల మైళ్ల రోడ్ల‌ను ఇది ఫోటోల రూపంలో సేవ్ చేసి ఉంచింది. దీని కోసం అధిక పిక్సెల్స్ గ‌ల హై రెజ‌ల్యూష‌న్ కెమెరాల‌ను ఉప‌యోగించారు. ఈ డేటాను సేవ్ చేయ‌డానికి గూగుల్ సంస్థ‌కు 20 పెటా బైట్ల మెమొరీ అవ‌స‌ర‌మైంది.

 గూగుల్ ప్లే స్టోర్

గూగుల్ ప్లే స్టోర్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎన్నో యాప్స్ డౌన్‌లోడ్ చేస్తూ ఉంటాం. చాలా మంది చేసే ప‌ని గూగుల్‌లో కానీ నేరుగా కానీ ప్లేస్టోర్‌లో సెర్ఛ్ చేయ‌డం వెంట‌నే ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం. అలా కాకుండా వీటిని గ‌మ‌నించండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్ లైబ్రరీ క్రియేట్ అయి ఉంటుంది. దీంతో మీరెప్పుడూ గూగుల్ ప్లేలోకి వెళ్లినా హోం స్క్రీన్‌లోని యాప్స్ అండ్ గేమ్స్ విభాగంలో

Recommended for You అని మీకు ఒక ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. సెల‌క్ట్ చేసిన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేముందు దానికి మార్కెట్లో ఎంత ఆదర‌ణ ఉందో రివ్యూల‌ను ప‌రిశీలించ‌డం ద్వారా తెలుసుకోవ‌చ్చు. మూడు స్టార్ల కంటే త‌క్కువ ఉంటే కొంచెం ఆలోచించాల్సిందే.

గూగుల్ రిక్రూట్‌మెంట్‌

గూగుల్ రిక్రూట్‌మెంట్‌

గూగుల్ ఇంజినీర్ల‌ను నియ‌మించుకునే ప్ర‌క్రియ చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. మీరు గూగుల్ సెర్ఛ్‌లో

గూగుల్ టెక్‌-వై అని టైప్ చేస్తే రిజ‌ల్ట్స్ పేజీలో వ‌చ్చే ఉద్యోగాల్లో మీకు స‌రిప‌డా నైపుణ్యాలు ఉంటే చాలు. https://careers.google.com/locations/ ఇందులో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గూగుల్ ఉద్యోగాల‌ను వెత‌కొచ్చు. హైద‌రాబాద్ గూగుల్లో జాబ్స్ కోసం https://careers.google.com/locations/hyderabad/ చూడొచ్చు.

గూగుల్ డ్రైవ్

గూగుల్ డ్రైవ్

ఫోన్‌, కంప్యూట‌ర్‌, ల్యాప్‌ట్యాప్ ప‌రిక‌రం ఏదైనా వాటి వాడ‌కాన్ని సౌక‌ర్యంగా ఉంచ‌డ‌మే గూగుల్ ప‌ని. గూగుల్ కేవలం సెర్చ్ ఇంజిన్‌తో స‌రిపెట్ట‌కుండా చాలా ఉత్ప‌త్తుల‌ను త‌యారుచేస్తోంది. అటువంటి వాటిలో గూగుల్ డ్రైవ్ ఒక‌టి. దాదాపు 2012లో ప్రారంభ‌మైన ఈ సేవ ఇప్పుడు 15జీబీ వ‌ర‌కూ క్లౌడ్ మొమొరీని అందుబాటులో ఉంచింది. క్లౌడ్ షేరింగ్ అప్లికేష‌న్ ద్వారా 15జీబీ డేటాను మెయిల్ సాయంతో దాచుకోవ‌చ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్‌, మ్యాక్స్ ఓఎస్ఎక్స్‌, గూగుల్ క్రోమ్ ఓఎస్‌, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల‌పై గూగుల్ డ్రైవ్‌ను ఉప‌యోగించుకునేలా రూపొందించారు.

గూగుల్ సైడ్ బార్‌

గూగుల్ సైడ్ బార్‌

గూగుల్ డెస్క్‌టాప్ అనేది కొన్ని ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో ఉప‌యోగించుకోవ‌డం కోసం గూగుల్ త‌యారుచేసిన ఒక డెస్క్‌టాప్ శోధ‌న సాఫ్ట్‌వేర్‌. గూగుల్ డెస్క్‌టాప్‌లో సైడ్‌బార్‌ను ఒక విశిష్ట‌ ఫీచ‌ర్‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ కింద తెలిపిన‌ వ్య‌వ‌స్థ‌ల‌లో సైడ్ బార్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయ‌బ‌డి ఉంటుంది. ఇమెయిల్‌, స్క్రాచ్‌పాడ్, ఫోటోస్‌, న్యూస్‌, వెథ‌ర్‌(weather), వెబ్ క్లిప్స్‌, గూగుల్ టాక్ ఈ యాప్‌ల‌న్నింటినీ అంత‌ర్గ‌తంగా గూగుల్ సైడ్ బార్ నిక్షిప్త‌మై ఉంటుంది. వెథ‌ర్‌(weather) ద్వారా వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు తెలుసుకోవ‌చ్చు. వెబ్ క్లిప్స్ అనేది RSS మరియు Atom వెబ్ సమాచారాలకు సంబంధించి, అప్‌డేట్ చేసిన కంటెంట్‌ను చూపిస్తుంది.

English summary

గూగుల్‌కు సంబంధించిన ముచ్చ‌ట‌గొలిపే 10 విష‌యాలు ఇవే... | 25 different things you do not know about google

A fascinating company to follow, Google keeps us intrigued. It’s fair to say there’s no other institution quite like it. While many people likely know a good deal about the company, there is no shortage of interesting Google-oriented facts that have long flown under the radar. That being the case, we’ve put together a comprehensive list of little-known facts about Google that will amuse, impress and undoubtedly surprise you.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X