For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి బంప‌ర్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

ఈ ప్రోత్సాహ‌కాల కోసం రూ. 50 నుంచి మొద‌లుకొని రూ. 3000 మధ్య జ‌రిగే లావాదేవీల‌ను లెక్క‌లోకి తీసుకుంటారు. ఈ విధానాన్ని మొత్తం ఎన్‌పీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు. ర్యాండ‌మ్‌గా ల‌క్కీ విన్న‌ర్ల‌ను ఎం

|

పాత రూ. 500, రూ. 1000 నోట్ల‌ రద్దు పరిణామాల నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు క్రెడిట్ / డెబిట్ కార్డులు మరియు మొబైల్ ఫోన్ అప్లికేషన్ /వ్యాలెట్ల‌ వినియోగం పెరిగింది. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక ప్రోత్సాహ‌కాల‌ను అందించాల‌ని నిర్ణయించింది. మెగా ప్రైజ్ కింద రూ. కోటి రూపాయ‌ల‌ను బ్యాంకు వినియోగ‌దారుల‌కు అందించ‌బోతోంది. మ‌ధ్య త‌ర‌గ‌తి బ‌డ్జెట్‌కు అనుగుణంగానే ఈ ప్రోత్సాహ‌కాల కోసం రూ. 50 నుంచి మొద‌లుకొని రూ. 3000 మధ్య జ‌రిగే లావాదేవీల‌ను లెక్క‌లోకి తీసుకుంటారు. ఈ విధానాన్ని మొత్తం ఎన్‌పీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు. ర్యాండ‌మ్‌గా ల‌క్కీ విన్న‌ర్ల‌ను ఎంపిక చేస్తారు. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పెట్రోల్ / డీజిల్ కొనుగోలుపై

పెట్రోల్ / డీజిల్ కొనుగోలుపై

* పెట్రోల్ / డీజిల్ కొనుగోలుపై డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలు బంకుల్లో విక్రయ ధర పై 0.75% డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించా రు .

* రోజుకు దాదాపు 4.5 కోట్ల వినియోగదారులు పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తున్నారు . ఈ 4.5 కోట్ల వినియోగదారులు డిజిటల్ మార్గాల ద్వారా నగదు రహిత లావాదేవీలు చేయడం ద్వారా ఈ పథకం ప్రయోజనం పొందగలరు. ఒక అంచనా ప్రకారం ప్రతి రోజు 1800 కోట్ల రూపాయలు పెట్రోల్ / డీజిల్ అమ్ముడవుతోంది. ఈ 1800 కోట్ల రూపాయలు లావాదేవీలలో 20% డిజిటల్ మార్గాల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. 2016, నవంబర్ నెలలో పెట్రోల్ పంపులు వద్ద రోజుకు నగదు రహిత లావాదేవీల 40% పెరిగింది దీనివల్ల రోజుకు Rs.360 కోట్లు నగదు లావాదేవీ నగదు రహిత లావాదేవిలాగా మారాయి.

* ఈ ప్రోత్సాహక పథకం ద్వారా కనీసం మరింత 30% వినియోగదారులు డిజిటల్ చెల్లింపు ఛైసయ్ల ప్రోత్సహించవచ్చు . దీనివల్ల పెట్రోల్ పంపులు వద్ద సంవత్సరానికి 2 లక్షల కోట్లు నగదు అవసరం తగ్గిస్తుంది.

 రైల్వేల్లో 0.5% రాయితీ

రైల్వేల్లో 0.5% రాయితీ

రైల్వే మంత్రిత్వ శాఖ జనవరి 1, 2017 నుండి సబర్బన్ రైల్వే నెలవారీ లేదా సీజనల్ టిక్కెట్ల డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు చేసిన వినియోగదారులకు 0.5% డిస్కౌంట్ అందిస్తుంది. దాదాపు 80 లక్షల మంది ప్రయాణికులకు సీజనల్ టిక్కెట్ల లేదా నెలవారీ టికెట్ కొనుటకు ఏడాదికి రూ. 2000 కోట్ల విలువ నగదు ఖర్చు పెడ‌తార‌ని అంచ‌నా. సమీప భవిష్యత్తులో డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు చేసే ప్రయాణికులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల నగదు అవసరం Rs.1,000 కోట్లు తగ్గించవచ్చు.

రైల్వే ప్ర‌యాణికుల‌కు ఉచిత ప్ర‌మాద బీమా

రైల్వే ప్ర‌యాణికుల‌కు ఉచిత ప్ర‌మాద బీమా

ఆన్‌లైన్ టికెట్ కొనుగోలు చేసిన రైలు ప్రయాణీకులకు 10 లక్షల ఉచిత యాక్సిడెంటల్ భీమా కవర్ ఇవ్వబడుతుంది. ఇందుకోసం 10 పైస‌లు చెల్లించాలి. దాదాపు 14 లక్షల రైల్వే ప్రయాణికులు లో 58% రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్ టిక్కెట్లు కొంటున్నారు . సమీప భవిష్యత్తులో మరొక 20% ప్రయాణీకులు డిజిటల్ చెల్లింపు పద్ధతులకు మారవచ్చు. కనుక 11 లక్షల మంది ప్రయాణికులకు ఐసీసిడెంటల్ భీమా పథకం కింద లాభం పొంద వచ్చు.

 ఐఆర్‌సీటీసీ చెల్లింపుల‌కు సైతం 5% రాయితీ

ఐఆర్‌సీటీసీ చెల్లింపుల‌కు సైతం 5% రాయితీ

రైల్వే శాఖ అనుబంధిత సంస్థల/కార్పొరేషన్లు ద్వారా క్యాటరింగ్, వసతి, రిటైర్ గదులు మొదలైనవాటిని చెల్లింపు సేవలు పై డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు పై 5% డిస్కౌంట్ అందిస్తుంది. ప్రయాణీకులు ఈ సేవలను వినియోగించుకోవ‌చ్చు .

బీమా పాల‌సీల ప్రీమియంలో రాయితీ

బీమా పాల‌సీల ప్రీమియంలో రాయితీ

ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు సాధారణ బీమా పాలసీ ప్రీమియంలో 10% మరియు కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ బీమా పాలసీ ప్రీమియంలో 8% వరకు తగ్గింపు లేదా క్రెడిట్ డిజిటల్ మార్గాల ద్వారా చెలింపు చేసిన వారికీ అందిస్తారు.

ప్ర‌భుత్వ విభాగాల్లో చెల్లింపులకు అయ్యే రుసుములు ఆయా విభాగాలే భ‌రించాలి

ప్ర‌భుత్వ విభాగాల్లో చెల్లింపులకు అయ్యే రుసుములు ఆయా విభాగాలే భ‌రించాలి

కేంద్ర ప్రభుత్వం విభాగాలు మరియు కేంద్ర‌ ప్ర‌భుత్వ రంగ సంస్థలు లో డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు పై ఫీజు/MDRరుసుముల భారం వినియోగ‌దారుపై మోప‌కుండా ఆ ఆ విభాగాలే భరిస్తాయి . రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ‌ సంస్థల్లో డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు పై ఫీజు/MDR రుసుముల‌ భారం కస్టమర్ పై పెట్టకుండా ఆయా విభాగాలే భరించాలని కోరారు.

చిన్న వ్యాపారుల‌కు నెల‌వారీ అద్దె రూ. 100 లోపు

చిన్న వ్యాపారుల‌కు నెల‌వారీ అద్దె రూ. 100 లోపు

చిన్న వ్యాపారులను డిజిటల్ చెల్లింపు వ్యవస్థ లోకి తీసుకురావ‌డానికి వీలుగా పిఓఎస్ టెర్మినల్స్ / మైక్రో ATM / మొబైల్ POS పై ప్రభుత్వ రంగ బ్యాంకులు నెలవారీ అద్దె రూ. 100 కంటే ఎక్కువ తీసుకో రాదు అని సూచించారు.

రూ. 2 వేల లోపు లావాదేవీల‌పై చార్జీల ర‌ద్దు

రూ. 2 వేల లోపు లావాదేవీల‌పై చార్జీల ర‌ద్దు

రూ. 2000వరకు డిజిటల్ లావాదేవీలు పై డిజిటల్ లావాదేవీ ఛార్జీలు/ఎండీఆర్‌ ఛార్జీలు రద్దు చేశారు. 2016-17 సంవత్సరంలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలలో ఆర్‌ఎఫ్ఐడీ కార్డును / ఫాస్ట్ టాగ్లు ఉపయోగించి చెల్లింపు పై వినియోగదారులు 10% డిస్కౌంట్ పొందవచ్చు

ల‌క్ష గ్రామాల్లో పీవోఎస్ యంత్రాల పంపిణీ

ల‌క్ష గ్రామాల్లో పీవోఎస్ యంత్రాల పంపిణీ

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాల అభివృద్ధి విస్తరించుటకు, నాబార్డ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హత ఉన్న బ్యాంకులకు నాబార్డ్ చేయూతనందిస్తుంది. 10,000 కంటే తక్కువ జనాభా ఉన్న లక్ష గ్రామాలలో ప్రతి గ్రామానికి 2 పీవోఎస్‌ పరికరాలు అందిస్తుంది . ఈ పీవోఎస్ యంత్రాలు ప్రాధమిక సహకార సంఘాలు/పాల సంఘాలు/వ్యవసాయ ఇన్పుట్ డీలర్స్ ద్వారా అగ్రి సంబంధించిన లావాదేవీలు చేస్కుండై సదుపాయం కల్గిస్తాయి . దీనివల్ల దాదాపు లక్ష గ్రామాల్లో ఉన్న 75 కోట్ల జనాభా నగదు రహిత లావాదేవీలు చేయవచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డులు ఇక‌పై రూపే కార్డుల్లాగా

కిసాన్ క్రెడిట్ కార్డులు ఇక‌పై రూపే కార్డుల్లాగా

కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ద్వారా గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులకు 4.32 కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతా ఉన్నవారికి "రూపే కిసాన్ కార్డులు" జారీ చేయటంలో మద్దతు చేస్తుంది. దీనివల్ల గ్రామస్తులు POS యంత్రాలు / మైక్రోATMs/ ATMs వద్ద డిజిటల్ లావాదేవీలు చేయవచ్చు .

డిజి ధ‌న్‌, ల‌క్కీ గ్రాహ‌క్‌

డిజి ధ‌న్‌, ల‌క్కీ గ్రాహ‌క్‌

డిజిట‌ల్ చెల్లింపుల ప్రోత్సాహ‌కానికి రెండు ప‌థ‌కాలు ప్ర‌వేశపెట్టిన‌ట్లు నీతి ఆయోగ్ సీఈవో ప్ర‌క‌టించారు. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌జ‌ల్లో ఆన్‌లైన్ చెల్లింపుల‌ను ఎక్కువ చేసేందుకు గాను ల‌క్కీ గ్రాహ‌క్ యోజ‌న‌, డిజి ధ‌న్ వ్యాపారి యోజ‌న ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎన్‌పీసీఐ ల‌క్కీ గ్రాహ‌క్ యోజ‌న కింద ప్ర‌తి రోజు 15 వేల మంది విజేత‌ల‌ను ఎంపిక చేస్తుంది. 15 వేల మందికి రోజుకు రూ. 1000 చొప్పున ప్రోత్సాహ‌క బ‌హుమ‌తిగా అంద‌జేస్తారు. చివ‌ర్లో మెగా ల‌క్కీ డ్రా ఉంటుంది. అందులో డిజిధ‌న్ వ్యాపారి యోజ‌న ద్వారా మొద‌టి విజేత‌కు రూ. 50 ల‌క్ష‌లు,రెండో విజేత‌కు రూ. 25 ల‌క్ష‌లు, మూడో విజేత‌కు రూ. 5 ల‌క్ష‌లు ప్రోత్సాహ‌కాలు అందుతాయి. మ‌రో ప‌థ‌కం ల‌క్కీ గ్రాహ‌క్ సాధార‌ణ బ్యాంకు వినియోగ‌దారుల‌కు మెగా అవార్డు కింద మొద‌టి విజేత‌కు రూ. కోటి, రెండో విజేత‌కు రూ. 50 ల‌క్ష‌లు,మూడో విజేత‌కు రూ. 25 ల‌క్ష‌ల సొమ్మును ఇస్తారు.

 మీ పేరుందో లేదో తెలుసుకోవ‌డం ఎలా?

మీ పేరుందో లేదో తెలుసుకోవ‌డం ఎలా?

విజేతల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ కింది పద్ధతిని పాటించండి.

digidhanlucky.mygov.inవెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ సైట్‌లో కుడి వైపున కన్జ్యూమర్‌, మర్చెంట్‌ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వినియోగదారు అయితే కన్జ్యూమర్‌ మీద, వ్యాపారి అయితే ‘మర్చెం ట్‌' అనే ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయ‌మంటూ ఒక బాక్స్‌ ప్రత్యక్షమవుతుంది. అక్క‌డ‌ మీ ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసి ఎంటర్‌ నొక్కితే ఓటీపీ వస్తుంది. దాన్ని నిర్దేశిత బాక్సులో ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత మీ రూపే కార్డు 16 అంకెల కోడ్‌ను ఎంటర్‌ చేయమని అడుగుతుంది. ఎంటర్‌ చేస్తే ప్రైజు వచ్చిందీ లేనిదీ తెలుస్తుంది.

బ‌డ్జెట్లో కేటాయింపులు ఉంటాయా

బ‌డ్జెట్లో కేటాయింపులు ఉంటాయా

లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజన అని పిలిచే ఈ పథకాలను డిసెంబర్ 25 నుంచి అమలు చేసి ఈ ఏడాది ఏప్రిల్ 14 వరకూ కొనసాగిస్తామని చెప్పారు. ఆ పథకాలలో లక్కీ గ్రాహక్ యోజన పథకం వినియోగదారుల కోసం, డిజిధన్ వ్యాపారి యోజన పథకం వ్యాపారుల కోసం రూపొందించారు. ఇందుకోసం ప్ర‌భుత్వానికి రూ. 300 నుంచి రూ. 400 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతుంది. దీనికి మ‌ద్ద‌తుగా బ‌డ్జెట్లో ప్ర‌త్యేకంగా కేటాయింపుల‌ను చేస్తారో లేదో వేచి చూడాలి.

English summary

డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి బంప‌ర్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం | will jaitley allocate funds for digital transaction promotion schemes in this budget

NITI Aayog has announced two schemes called Lucky Grahak Yojana and Digi-Dhan Yojana.Under the schemes, consumers and merchants using UPI, RuPay cards, Aadhar-enabled and USSD-platforms are eligible for daily prizes of Rs 1,000. There are weekly draws with a maximum prize for Rs 1 lakh for consumers and Rs 50,000 for merchants.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X