For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్‌లో డైరెక్ట్ ప్లాన్ ఏంటి? రెగ్యుల‌ర్ ప్లాన్ ఏమిటి?

రెగ్యులర్‌ ప్లాన్‌ పక్కనే ‘డైరెక్ట్‌ ప్లాన్‌' అని ఒకటి ఉంటుంది. దాని గురించి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే... ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మ్యూచువల్‌ ఫండ్లు ఎప్పటినుంచో ఉన్నా అందులో ‘డైరెక్ట్‌

|

ఇన్వెస్ట‌ర్లు మొద‌ట్లో మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా మందికి రెండు రకాల 'ప్లాన్స్‌' క‌న‌బ‌డ‌తాయి. దరఖాస్తు పత్రాన్ని నింపేటప్పుడు ఏజెంటు సూచించిన విధంగా రెగ్యులర్‌ ప్లాన్‌' దగ్గర టిక్‌ పెట్టి మిగతా వివరాలు నింపేస్తారు. రెగ్యులర్‌ ప్లాన్‌ పక్కనే 'డైరెక్ట్‌ ప్లాన్‌' అని ఒకటి ఉంటుంది. దాని గురించి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే... ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మ్యూచువల్‌ ఫండ్లు ఎప్పటినుంచో ఉన్నా అందులో 'డైరెక్ట్‌ ప్లాన్‌' అమల్లోకి వచ్చింది మాత్రం 2013 సంవ‌త్స‌రం నుంచే. అస‌లు ఏ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఏ ప్ర‌యోజనం ఏమిటో తెలుసుకుందాం.

సెబీ ఆలోచన:

సెబీ ఆలోచన:

సెబీ మ్యూచువల్‌ ఫండ్ల విషయంలో 2012 సెప్టెంబరు నుంచి కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, ఏజెంట్లు, బ్రోకర్లు అందించే పథకాల్లో ఇక నుంచి ‘రెగ్యులర్‌', ‘డైరెక్ట్‌' అనే రెండు రకాల ప్లాన్స్‌ను అమలుప‌ర‌చాల్సిందిగా నిర్దేశించింది. 2013 ప్రారంభం నుంచి అన్ని ఫండ్‌ సంస్థలు ఈ రెండు ప్లాన్స్‌ అమలు చేస్తూ వస్తున్నాయి. దరఖాస్తుదారు ఈ రెంటిపైనా టిక్‌ చేయకుండా, ఏజెంటు ఏఆర్‌ఏన్‌ సూచించకుండా ఉన్నట్టయితే... మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు సదరు పథకాన్ని ‘డైరెక్ట్‌'గానే పరిగణిస్తాయి.

 ‘డైరెక్ట్‌’ ప్లాన్‌ అంటే ఏమిటి? :

‘డైరెక్ట్‌’ ప్లాన్‌ అంటే ఏమిటి? :

పెట్టుబడిదారులకు మరింత ప్రయోజనాలు కలిగించే దిశగా రూపొందించిన విధాన‌మే డైరెక్ట్ ప్లాన్‌. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణ కోసం ఏజెంట్లకు, బ్రోకర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత సొమ్మును భ‌ర‌యించాలి. ఈ భారం పరోక్షంగా మన‌పై పడుతోంది. దీన్ని లేకుండా చేసి పెట్టుబడిదారులకు రాబడులను పెంచే యోచనతో ఏజెంట్ల ప్రమేయం లేకుండా నేరుగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు సెబీ అవకాశం కల్పించింది. దీన్నే డైరెక్ట్‌ ప్లాన్‌గా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్‌, డైరెక్ట్‌ ప్లాన్‌ల మధ్య తేడాను వినియోగదారులు స్పష్టంగా గుర్తించేందుకు ఫండ్‌ పేరు చివర ‘డైరెక్ట్‌' అని ఉండాలని సెబీ నిర్దేశించింది.

డైరెక్ట్ ప్లాన్లు ఏ విధంగా ఉత్త‌మం ?

డైరెక్ట్ ప్లాన్లు ఏ విధంగా ఉత్త‌మం ?

ఒకే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ నుంచి ఒకే పథకంలో రెండు ప‌థ‌కాల్లో ఒకేసారి ఒకేమొత్తంలో మదుపు చేసినట్టయితే రాబడులు వచ్చే సమయానికి రెగ్యులర్‌ దాని కంటే ‘డైరెక్ట్‌' ప్లాన్‌లో ఎక్కువ సొమ్ము వస్తుంది. అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైరెక్ట్‌ ప్లాన్‌లుగా మార్చుకోవచ్చు. ఈటీఎఫ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు(ఈఎల్‌ఎస్‌ఎస్‌), లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉన్న ఇతర స్కీమ్‌లకు ఆ లాక్‌ ఇన్‌ పీరియడ్‌ పూర్తయిన తర్వాతనే డైరెక్ట్‌ ప్లాన్‌లుగా మార్చుకునే వీలు ఉంటుంది. అన్ని కంపెనీల‌ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌ను రెగ్యులర్‌ ప్లాన్‌ నుంచి డైరెక్ట్‌ ప్లాన్‌లకు మార్చడానికి ప్రస్తుతం ఏ మ్యూచువల్‌ ఫండ్ సంస్థ ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ను వసూలు చేయడం లేదు.

 డైరెక్ట్ ప్లాన్‌లో రుసుము

డైరెక్ట్ ప్లాన్‌లో రుసుము

రెగ్యులర్‌కు డైరెక్ట్‌ ప్లాన్‌లకు రాబడి విషయంలో తేడా స్వల్పంగానే ఉంటుంది. అయితే పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో ఉండి... 10, 20 ఏళ్ల దీర్ఘకాలంపాటు కొనసాగించినట్టయితే ఈ తేడా భారీగానే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే డైరెక్ట్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడమే మంచిది. డైరెక్ట్‌ ప్లాన్‌లో ‘నిర్వహణ రుసుములు' తక్కువగా ఉంటాయి. ఈ పథకాలను పంపిణీ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు ఉండరు కాబట్టి పంపిణీ రుసుములు, కమీషన్లు ఉండవు. ఈ ప్రభావంతో రెగ్యులర్‌ ప్లాన్స్‌తో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్‌కు ఎన్‌ఏవీ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో పెట్టుబడిదారు అదే ధరకు ఎక్కువ ‘యూనిట్లు' కొనుగోలు చేయగలుగుతారు. ఈ చిన్న చిన్న తేడాలు మినహాయిస్తే రెండు ప్లాన్స్‌లోనూ పెట్టుబడి లక్ష్యాలు, విధానాల్లో పెద్దగా మార్పులుండవనే చెప్పాలి.

డైరెక్ట్ ప్లాన్‌లో ఎవ‌రు పెట్టుబ‌డులు పెట్టాలి?

డైరెక్ట్ ప్లాన్‌లో ఎవ‌రు పెట్టుబ‌డులు పెట్టాలి?

ఇది చ‌దివితే ఈ రెండు ప్లాన్స్‌ మధ్య తేడా స్పష్టంగానే తెలిసి వచ్చినట్టు అనిపిస్తుంది. అలా అని లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశించి ప్రతిదీ ‘డైరెక్ట్‌' ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం కూడా సమంజసం కాదు. మ్యూచువల్‌ ఫండ్లపై మంచి అవగాహన ఉండి, స్టాక్‌ మార్కెట్ల కదలికలను పరిశీలిస్తూ ఉన్నవారు ‘డైరెక్ట్‌' ప్లాన్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఏజెంటు సహకారం లేకుండా తామే స్వయంగా నేరుగా ఫండ్ హౌస్ కార్యాలయాన్ని సంద‌ర్శించో లేదా సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా పెట్టుబడి పెట్టగల నేర్పు ఉన్నవారు మాత్రమే డైరెక్ట్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. మ్యూచువల్‌ ఫండ్లపై అవగాహన లేనివారు, ఫండ్‌ను ఎంపిక చేసుకోలేనివారు, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియనివారు, దాన్ని సమీక్షించే తీరిక, ఓపిక లేనివారికి డైరెక్ట్‌ ప్లాన్లు ఏమాత్రం అనుకూలం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.

రెగ్యుల‌ర్ ప్లాన్‌ల‌ను డైరెక్ట్ ప్లాన్‌లుగా మార్చుకోవడం ఎలా?

రెగ్యుల‌ర్ ప్లాన్‌ల‌ను డైరెక్ట్ ప్లాన్‌లుగా మార్చుకోవడం ఎలా?

రెగ్యులర్‌ ప్లాన్‌లను డైరెక్ట్‌ ప్లాన్‌లుగా మార్చుకోవచ్చు. అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తులను నింపి సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు సమర్పించాలి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న స్కీమ్‌ పేరు పక్కన డైరెక్ట్‌ అని స్పష్టంగా రాయాలి. ఏఆర్‌ఎన్‌(యాంఫీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌) కోడ్‌ను కూడా రాయడం మర్చిపోకండి. మీ దరఖాస్తును పరిశీలించి మీ రెగ్యులర్‌ ప్లాన్‌లను డైరెక్ట్‌ ప్లాన్‌లుగా మార్చడానికి సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు కనీసం పది రోజులు పడుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ నుంచి మీకు వచ్చే స్టేట్‌మెంట్‌లో మీ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌ పేరు పక్కన డైరెక్ట్‌ప్లాన్‌ అని ఉంటుంది. మీ ప్లాన్‌ రెగ్యులర్‌ నుంచి డైరెక్ట్‌కు మారిందనడానికి ఇదే నిర్ధారణ.

Read more about: mf mutual funds
English summary

మ్యూచువ‌ల్ ఫండ్‌లో డైరెక్ట్ ప్లాన్ ఏంటి? రెగ్యుల‌ర్ ప్లాన్ ఏమిటి? | What is the difference between a direct plan and regular plan in case of mutual fund investment?

Which is better for mutual funds direct or regular plan if I am investing via SIP?A Direct plan is what you buy directly from the mutual fund company (usually from their own website), whereas a Regular plan is what you buy through an advisor, broker or distributor (intermediary).In a regular plan, the mutual fund company pays commission to the intermediary. This is then recovered as an expense from the plan. In mutual fund speak, the expense ratio is higher for a regular plan.
Story first published: Thursday, January 5, 2017, 15:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X