For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిజిట‌ల్ చెల్లింపుల కోసం 14444 టోల్‌ఫ్రీ నంబ‌ర్‌

డిజిటల్ లావాదేవీల సమస్యల పరిష్కారానికి కేంద్రం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. టెలికాం రంగ సంస్థలతో కలసి ఐటీశాఖ ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ ను ప్రారంభించింది. భీమ్ యాప్ ద్వారా డిజిటల్‌ చెల

|

డిజిటల్ లావాదేవీల సమస్యల పరిష్కారానికి కేంద్రం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. టెలికాం రంగ సంస్థలతో కలసి ఐటీశాఖ ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ ను ప్రారంభించింది. ఈ-వ్యాలెట్స్‌, ఆధార్‌ అనుసంధాన చెల్లింపులు, యూఎస్ఎస్‌డీ(*99#), భీమ్ యాప్ ద్వారా డిజిటల్‌ చెల్లింపుల సమయంలో వినియోగ‌దారులు ఎదుర్కొనే సమస్యలను 14444 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి.. ప‌రిష్కార మార్గాలను పొందవచ్చని ప్రకటించారు టెలికం సెక్రటరీ జేస్ దీపక్.

నాస్కామ్, టెలికాం, ఐటీ శాఖ‌లు సంయుక్తంగా

నాస్కామ్, టెలికాం, ఐటీ శాఖ‌లు సంయుక్తంగా

టోల్‌ఫ్రీ నంబ‌రు కోసం టెలికాం, ఐటీ శాఖ‌లు సంయుక్తంగా ప‌నిచేశాయి. నాస్కామ్‌, ఐటీ ప‌రిశ్ర‌మ‌ల సాయంతో టెలికాం శాఖ ఈ హెల్ప్‌లైన్‌ను నిర్వ‌హించ‌నుంది. ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా ఈ టోల్‌ఫ్రీ నంబ‌రు ప‌నిచేస్తుంది. ప్ర‌త్యేక విచార‌ణ‌ల కోసం ఏజెంటుతో సైతం మాట్లాడే వీలుంది.

సమస్యలకు ప‌రిష్కారాలు

సమస్యలకు ప‌రిష్కారాలు

దేశ వ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులు జరిపిన కస్టమర్లకు తలెత్తిన ప్రశ్నలకు ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌ ద్వారా సమాధానాలు పొందవచ్చన్నారు దీపక్. భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ(BHIM), ఈ-వ్యాలెట్స్‌, ఆధార్‌ అనుసంధాన చెల్లింపులు, యూఎస్ఎస్‌డీ(*99#) మొదలైన వాటి వివరాలు, వాటి ద్వారా వచ్చిన సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోవచ్చ‌ని అధికారులు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతానికి హిందీ, ఆంగ్ల భాష‌ల్లో

ప్ర‌స్తుతానికి హిందీ, ఆంగ్ల భాష‌ల్లో

ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 14444 ప్రస్తుతం ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో అందుబాటులో ఉందన్నారు. ఈ నెంబర్ లో ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో సమాధానాలు లభిస్తాయన్నారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఇత‌ర ముఖ్య‌ భాషల్లో ఈ హెల్ప్ లైన్ సర్వీస్ ను అందిస్తామని చెప్పారు. ఫిబ్రవరి నుంచి అన్ని భాషల్లో సేవలు అందించటానికి సన్నాహాలు జరుగుతున్న‌ట్లు పేర్కొన్నారు.

అన్ని మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల వారికి ఇది ప‌నిచేస్తుంది

అన్ని మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల వారికి ఇది ప‌నిచేస్తుంది

ఈ టెలిఫోన్ నంబ‌రుకు సంబంధించి అన్ని మొబైల్ నెట్‌వ‌ర్క్‌లు భాగ‌స్వాములుగా ఉన్నాయి. దీంతో ఏ నెట్‌వ‌ర్క్‌కు చెందిన వినియోగ‌దారు అయినా ఈ టోల్‌ఫ్రీ నంబ‌రుకు ఫోన్ చేసి త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల‌ను తెలుసుకోవ‌చ్చు. కొన్ని నెల‌ల త‌ర్వాత కాల్ ట్రాఫిక్ అంచ‌నా ఆధారంగా ఈ ప్రాజెక్టు కోసం ఆర్థిక మ‌ద్ద‌తును అందించే దానిని గురించి ప్ర‌భుత్వం ఆలోచిస్తుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతానికి దానికి సంబంధించిన బ్యాండ్‌విడ్త్‌ను ప్రైవేటు టెలికాం ఆప‌రేట‌ర్లు అందిస్తుండ‌గా; కాల్ సెంట‌ర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చ‌ర్‌ను ఐటీ-బీపీవో ప‌రిశ్ర‌మ అందిస్తున్న‌ద‌ని పీటీఐ వెల్ల‌డించింది.

Read more about: digital online payments
English summary

డిజిట‌ల్ చెల్లింపుల కోసం 14444 టోల్‌ఫ్రీ నంబ‌ర్‌ | Toll-free Helpline For Digital Payments Launched

The government, in collaboration with telecom and IT industry, has launched a toll-free helpline - 14444 - to address consumer queries on digital payments. The helpline has been launched jointly by Department of Telecom in collaboration with software association Nasscom, telecom industry as well as the IT industry, officials said.
Story first published: Friday, January 6, 2017, 15:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X