For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు ఇవి తెలుసుకోండి..

మార్కెట్ పెట్టుబ‌డి సాధ‌నాల్లో అంద‌రికీ క‌న‌బ‌డే ఏకైక ఆస‌క్తిక‌ర‌మైన పెట్టుబ‌డి మార్గం స్టాక్ మార్కెట్‌. అయితే ఇక్క‌డ రాబ‌డుల‌తో పాటు న‌ష్ట‌భ‌యం కూడా ఉంటుంది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేట‌ప్పుడు ఈ కింద

|

చేతిలో డ‌బ్బులుంటే పెట్టుబ‌డులు పెట్ట‌డం సులువు అని చాలా మంది భావిస్తారు. అది అంత సుల‌భ‌మైన వ్య‌వ‌హార‌మేమీ కాద‌ని అందులో మునిగి తేలిన వారికి తెలుసు. ప్ర‌స్తుతం షేర్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు సాధార‌ణ స్థాయి వ్య‌క్తులు సైతం మొగ్గుచూపుతున్నారు. మార్కెట్ పెట్టుబ‌డి సాధ‌నాల్లో అంద‌రికీ క‌న‌బ‌డే ఏకైక ఆస‌క్తిక‌ర‌మైన పెట్టుబ‌డి మార్గం స్టాక్ మార్కెట్‌. అయితే ఇక్క‌డ రాబ‌డుల‌తో పాటు న‌ష్ట‌భ‌యం కూడా ఉంటుంది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేట‌ప్పుడు ఈ కింది విష‌యాల‌ను గుర్తుంచుకోవాలి.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు ఇవి తెలుసుకోండి..

* మీకు తెలిసిన రంగాల‌కు చెందిన, అవ‌గాహ‌న ఉన్న కంపెనీల షేర్ల‌ను మాత్ర‌మే కొనుగోలు చేయ‌డానికి ప్ర‌య‌త్నించాలి.
* షేర్లు కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు స‌ద‌రు కంపెనీ ఎలాంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుందో తెలుసుకోవాలి. కంపెనీ ప‌నితీరును కొంత కాలం పాటు గ‌మ‌నించాలి. దాని త్రైమాసిక ఫ‌లితాల‌ను క్ర‌మంగా విశ్లేషించుకోవాలి. కంపెనీ రెవెన్యూ, లాభం, డివిడెండ్లు, భ‌విష్య‌త్తు విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను గురించి నిత్యం అప్‌డేట్ అవుతూ ఉంటే మంచిది. కంపెనీ యాజ‌మాన్యం, భవిష్య‌త్తు స‌వాళ్ల‌ను తెలుసుకుంటూ ఉండాలి.
* కంపెనీ స్టాక్ విలువ ఏ విధంగా మూవ్ అవుతోందో గ‌మ‌నిస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని షేర్లు వాటి అస‌లు విలువ క‌న్నా చాలా రెట్లు ఎక్కువ‌గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. అన్ని ఆ స్థాయి వ‌ద్ద ఎక్కువ కాలం నిల‌దొక్కుకోలేక‌పోవ‌చ్చు.
* స్టాక్ కొనుగోలుకు వెచ్చించే మొత్తం స‌మంజ‌సంగా ఉందో లేదో బాగా ఆలోచించి నిర్ణ‌యించుకోవాలి. అవ‌స‌ర‌మైతే మీకు తెలిసిన మార్కెట్ నిపుణుల సాయం తీసుకుంటే మంచిది.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు ఇవి తెలుసుకోండి..

* మీరు ఏ కంపెనీవైతే షేర్లు కొనుగోలు చేయాల‌నుకుంటున్నారో వాటి ప్ర‌త్య‌ర్థి సంస్థ‌ల గురించి సైతం విచారిస్తుండ‌టం మంచిది. వాటి ప‌నితీరు, కార్య‌క‌లాపాలు ఎలా ఉన్నాయ‌నే దానిపై క‌న్నేయ‌డం దీర్ఘ‌కాలంలో మీ పెట్టుబ‌డి అవ‌గాహ‌న పెరిగేందుకు దోహ‌దప‌డ‌గ‌ల‌దు.
* కంపెనీకి సంబంధించిన పీఈ నిష్ప‌త్తి, ఎబీటా, డివిడెండ్‌, ఆప‌రేటింగ్ క్యాష్‌ఫ్లో, అప్పులు, నిక‌ర ఆదాయం వంటి అంశాల‌నూ దృష్టిలో ఉంచుకుని పెట్టుబ‌డుల్లో మార్పులు చేయాలి.
* దీర్ఘ‌కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వ‌చ్చేవారు మాత్ర‌మే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్‌కు సంబంధించిన విష‌యాల‌పై నిత్యం అవ‌గాహ‌న పెంచుకుంటూ ఉండ‌టం భ‌విష్య‌త్తు నిర్ణ‌యాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

Read more about: share market sensex
English summary

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు ఇవి తెలుసుకోండి.. | Investing in stocks... It is Better if you know these things

Wouldn't you love to be a business owner without ever having to show up at work? Imagine if you could sit back, watch your company grow, and collect the dividend checks as the money rolls in! This situation might sound like a pipe dream, but it's closer to reality than you might think.As you've probably guessed, we're talking about owning stocks. This fabulous category of financial instruments is, without a doubt, one of the greatest tools ever invented for building wealth. Stocks are a part, if not the cornerstone, of nearly any investment portfolio. When you start on your road to financial freedom, you need to have a solid understanding of stocks and how they trade on the stock market.
Story first published: Monday, January 16, 2017, 18:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X