For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ

ట్విట్ట‌ర్ ద్వారా న‌గ‌దు ర‌హిత లావాదేవీలు నిర్వ‌హించ‌డం సురక్షితం కాద‌ని కొంత మంది భావిస్తూ ఉంటారు. కానీ ట్విట్ట‌ర్ లేదా హ్యాష్ ట్యాగ్ బ్యాంకింగ్‌లో ట్విట్ట‌ర్ అనేది ఒక అనుసంధాన‌క‌ర్త‌లా మాత్ర‌మే వ్య

|

మామూలుగా న‌గ‌దు బ‌దిలీ కోసం బ్యాంకుల‌కు వెళ్లే రోజులు పోయి నెట్‌బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ స‌దుపాయాలే సాంకేతిక‌త‌లే కీల‌క ముందడుగు. అయితే ప్ర‌స్తుతం ప్ర‌యివేటు బ్యాంకులు సోష‌ల్ మీడియా బ్యాంకింగ్ విష‌యంలోనూ దూసుకెళుతున్నాయి. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు ట్విట్టర్ ద్వారా నగదు బదిలీ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. దీంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడం, ప్రీ పెయిడ్ మొబైల్ రీచార్జ్ కూడా చేసుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు.

icici twitter banking

కస్టమర్లు ఈ సౌకర్యాన్ని పొందాలంటే తమ ట్విట్టర్ హ్యాండ్లర్‌ను నమోదు చేసుకోవాలని అన్నారు. నగదు పంపించే వ్యక్తి, అవతలి వ్యక్తి ట్విట్టర్ హ్యాండ్లర్‌ తప్పక తెలిసి ఉండాలని పేర్కొన్నారు. నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించిన అనంతరం నగదును పంపించిన వ్యక్తికి యునిక్ కోడ్‌తో కూడిన ఒక ఎస్ఎంఎస్ వస్తుందని, నగదు పొందే వ్యక్తి ఈ కోడ్‌ను స్పెషల్ వెబ్ పేజీలో ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు.

icici twitter banking

నగదు బదిలీకి ప్రస్తుతం ఎన్‌ఈఎఫ్‌టీ(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్), ఆర్‌టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) విధానాలను ఉపయోగిస్తున్నామని, త్వరలో ఐఎంపీఎస్(ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్)ను ఉపయోగించనున్నట్లు తెలిపారు.
ట్విట్టర్ ద్వారా చేసే నగదు బదిలీకి ఎలాంటి చార్జీలు ఉండవని, ఎన్‌ఈఎఫ్‌టీ(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్), ఆర్‌టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్)లకు ఛార్జీలు వర్తిస్తాయని అన్నారు. నగదు పొందే వ్యక్తి వేరే బ్యాంక్ ఖాతాదారు అయి ఉంటే, ఆ బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పనిసరిగా కోట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

icici twitter banking

ట్విట్ట‌ర్ బ్యాంకింగ్ సుర‌క్షిత‌మేనా అని సందేహ‌మా?
ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ లాగే సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్ ద్వారా ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను జ‌రుపుకోవ‌డం సాంకేతిక‌తపై న‌మ్మ‌కం లేని వారికి వింతే. కానీ రోజు వారీ కార్య‌క‌లాపాల‌కు స‌మ‌యం దొర‌క‌ని ఈ రోజుల్లో ఇదొక విప్ల‌వం. ట్విట్ట‌ర్ ద్వారా న‌గ‌దు ర‌హిత లావాదేవీలు నిర్వ‌హించ‌డం సురక్షితం కాద‌ని కొంత మంది భావిస్తూ ఉంటారు. కానీ ట్విట్ట‌ర్ లేదా హ్యాష్ ట్యాగ్ బ్యాంకింగ్‌లో ట్విట్ట‌ర్ అనేది ఒక అనుసంధాన‌క‌ర్త‌లా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తుంది. ఏ ఆర్థిక లావాదేవీ అయినా ఓటీపీ ఆధారంగానే జ‌రుగుతుంది. ట్విట్ట‌ర్ లేదా హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్‌లో జ‌రిగే అన్ని లావాదేవీలు ఐసీఐసీఐ బ్యాంక్ స‌ర్వ‌ర్‌లోనే జ‌రుగుతాయి. ఇవ‌న్నీ బ్యాంక్ ఫైర్‌వాల్ ప‌రిధిలోనే ఉంటాయ‌ని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

English summary

ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ | icici money transfer with twitter

CICI Bank account holders can use Twitter to transfer fundsCustomers of ICICI Bank can use their Twitter account for real-time fund transfers, prepaid mobile recharges and to check bank balance.
Story first published: Friday, January 13, 2017, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X