For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ యాప్‌ల‌తో ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ను సుల‌భ‌త‌రం చేసిందా?

వివిధ అవ‌స‌రాల‌కు ర‌క‌ర‌కాల యాప్‌లు ఉండ‌టంతో వినియోగ‌దారులు తిక‌మ‌కప‌డే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ ఎస్‌బీఐకి సంబంధించిన వివిధ యాప్‌ల‌ను, వాటి ఉద్దేశాల‌ను స్ప‌ష్టంగా చూద్దాం.

|

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ అనేది మీకు తెలిసిన విష‌య‌మే. వినియోగదారుల‌కు చేరువ‌య్యేందుకు ఎస్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త‌ యాప్‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతూ వ‌స్తోంది.

వివిధ అవ‌స‌రాల‌కు ర‌క‌ర‌కాల యాప్‌లు ఉండ‌టంతో వినియోగ‌దారులు తిక‌మ‌కప‌డే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ ఎస్‌బీఐకి సంబంధించిన వివిధ యాప్‌ల‌ను, వాటి ఉద్దేశాల‌ను స్ప‌ష్టంగా చూద్దాం.

1. స్టేట్‌బ్యాంక్ బ‌డ్డీ:

1. స్టేట్‌బ్యాంక్ బ‌డ్డీ:

స్టేట్‌బ్యాంక్ బ‌డ్డీ 13 భాష‌ల్లో ఉంది. ఇందులో న‌గ‌దు బ‌దిలీతో పాటు, వేరేవారిని న‌గ‌దు అడిగే స‌దుపాయం, మ‌నం చేయాల్సిన చెల్లింపుల‌కు సంబంధించిన రిమైండ‌ర్లు, ఖాతాకు అద‌న‌పు న‌గ‌దు బ‌దిలీ, రీఛార్జీ, బిల్లు చెల్లింపు,

ఆన్‌లైన్ షాపింగ్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి.

2. ఎస్‌బీఐ ఎమ్‌వీసా:

2. ఎస్‌బీఐ ఎమ్‌వీసా:

షాపింగ్ చేసిన‌ప్పుడు అక్కడ దుకాణదారుడికి చెల్లింపులు చేయాలంటే ఈ యాప్ ఉపయోగపడుతుంది. స్టాటిక్ లేదా డైనమిక్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా దీన్ని పూర్తిచేయవచ్చు.

3.ఎస్‌బీఐ నోక్యూ:

3.ఎస్‌బీఐ నోక్యూ:

బ్యాంకులో వెళ్లి వ‌రుస‌లో నిల‌బ‌డి విసుగుచెందే వారికి స‌మాధానంగా ఎస్‌బీఐ నోక్యూ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఎస్‌బీఐ బ్యాంకు అందించే కొన్ని సేవ‌ల‌కు ఈ-టోక‌న్ అందించ‌డ‌మే దీని ఉద్దేశం.

దీని ద్వారా బ్యాంకు శాఖ‌లో అడుగుపెట్టిన త‌ర్వాత ఈ-టోక‌న్‌ను జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. దీని ద్వారా వ‌రుస‌లో నిలుచునే అవ‌స‌రం ఉండ‌కుండా స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌చ్చు.

4.స్టేట్ బ్యాంక్ ఎమ్‌క్యాష్‌:

4.స్టేట్ బ్యాంక్ ఎమ్‌క్యాష్‌:

ఆన్‌లైన్ఎస్‌బీఐ లేదా స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్ ద్వారా ఎవ‌రైనా ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు పంపిన డ‌బ్బును పొందేందుకు ఉద్దేశించిన సుల‌భ‌త‌ర విధాన‌మే స్టేట్‌బ్యాంక్ ఎమ్‌క్యాష్‌.

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ సౌక‌ర్యం లేకుండానే ఎస్‌బీఐ వినియోగ‌దారులు డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు. ల‌బ్దిదారు మొబైల్ నంబ‌రు లేదా ఈ-మెయిల్‌కు డ‌బ్బును నేరుగా బ‌దిలీ చేయ‌వ‌చ్చు.

5. స్టేట్‌బ్యాంక్ స‌మాధాన్‌:

5. స్టేట్‌బ్యాంక్ స‌మాధాన్‌:

స్టేట్‌బ్యాంక్ వినియోగ‌దారులైనా కాక‌పోయినా కొన్ని స్టేట్ బ్యాంక్ శాఖ‌ల‌కు లేదా కంట్రోల‌ర్ల‌కు ఏదైనా విష‌యం(ప్ర‌శ్న‌) గురించి కాల్‌చేసి స‌మాచారాన్ని పొందేందుకు స్టేట్‌బ్యాంక్ స‌మాధాన్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

బ్యాంకు వ‌ద్ద న‌మోదైన ఈ-మెయిల్ ఐడీకి గృహ రుణం, విద్యా రుణానికి సంబంధించిన సర్టిఫికెట్ల‌ను పొంద‌వ‌చ్చు.

6. ఎస్‌బీఐ కార్డ్‌:

6. ఎస్‌బీఐ కార్డ్‌:

ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఇప్పుడు నేరుగా ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు ఖాతా వివ‌రాల‌ను పొంద‌వ‌చ్చు. ఇందుకోసం మొద‌ట ఎస్‌బీఐ కార్డ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్ ఆన్‌లైన్ యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగించి ఖాతాను నిర్వ‌హించుకోవ‌చ్చు. ఇది సుర‌క్షిత‌మైన‌ది, అనుకూల‌మైన‌ది.

7. స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్ కార్పొరేట్‌:

7. స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్ కార్పొరేట్‌:

ఎస్‌బీఐ కార్పొరేట్ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యాప్. సాఫ్ట్‌వేర్ స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్ కార్పొరేట్‌. ఖాతా ప్ల‌స్‌, వ్యాపార్‌, విస్తార్ విభాగాల వారు దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

8. స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ స‌ర‌ళ్‌:

8. స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ స‌ర‌ళ్‌:

ఇది వ్యాపార వ‌ర్గాల వారు ఆండ్రాయిడ్ స్మార్ట‌ఫోన్లో ఉప‌యోగించ‌డానికి వీలుగా రూపొందించిన ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఆధారిత అప్లికేష‌న్. ఇది గూగుల్ ప్లేస్టోర్లో కోటికి పైగా డౌన్‌లోడ్‌ల‌ను సాధించింది. ఇందులో ఖాతా లావాదేవీలు, డిపాజిట్ వివ‌రాలు పొంద‌డ‌మే కాకుండా పీపీఎఫ్‌, రుణ వివ‌రాల‌కు అనుసంధానించ‌బ‌డి ఉంటుంది. మినీ స్టేట్‌మెంట్‌లో గ‌త చివరి 10 లావాదేవీల వివ‌రాల‌ను పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఎస్బీఐ క‌స్ట‌మ‌ర్లు మాత్ర‌మే వాడేందుకు వీలుగా ఇది రూపొందించ‌బ‌డింది.

9. స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్‌:

9. స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్‌:

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే ఈ యాప్ ప‌నిచేస్తుంది. బిల్లు చెల్లింపులు, ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్‌(న‌గ‌దు బ‌దిలీ), రీఛార్జీ వంటివి ఇందులో చేయ‌వ‌చ్చు. ఎంపాస్‌బుక్‌ను ఆన్‌లైన్లో పొంద‌వ‌చ్చు.

10. స్టేట్‌బ్యాంక్ ఫ్రీడ‌మ్ యాప్‌:

10. స్టేట్‌బ్యాంక్ ఫ్రీడ‌మ్ యాప్‌:

స్వంత ఊర్లో కాకుండా ఎక్క‌డో నివాసం ఉండేవారికి అనుకూల‌మైన యాప్ ఇది. దీని సాయంతో ఖాతాలో ఉన్న న‌గ‌దును తెలుసుకోవ‌డంతో పాటు, అవ‌స‌రాన్ని బ‌ట్టి ఇత‌రుల‌కు న‌గ‌దును ఆన్‌లైన్‌లోనే బ‌దిలీ చేయ‌వ‌చ్చు.

11. ఎస్‌బీఐ క్విక్‌:

11. ఎస్‌బీఐ క్విక్‌:

ఎస్‌బీఐ క్విక్ అనేది మిస్‌డ్‌కాల్ ద్వారా అందించే సేవ‌. ఇందుకోసం మొద‌టిసారి బ్యాంకు వ‌ద్ద మిస్‌డ్‌కాల్ బ్యాంకింగ్ కోసం న‌మోదు చేసుకోవాలి. త‌ర్వాత బ్యాంకు సూచించిన నంబ‌రుకు మిస్‌డ్‌కాల్ ఇవ్వ‌డం ద్వారా లేదా ఎస్ఎంఎస్

పంప‌డం ద్వారా మొబైల్‌లోనే కావాల్సిన స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు.ఉదా: న‌గ‌దు విచార‌ణ‌, మినీ స్టేట్‌మెంట్‌

English summary

ఈ యాప్‌ల‌తో ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ను సుల‌భ‌త‌రం చేసిందా? | How to use different apps useful for sbi customers

To Manage banking activities Through Phones, SBI Launches New Facility. sbi has created various mobile appsTo Manage ATM Cards Through mobile, SBI Launches several apps
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X