For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డూప్లికేట్ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం ఎలా..?

దేశంలో చాలా ప‌నుల‌కు మ‌న‌కు గుర్తింపు కార్డు ఎంత‌గానో అవసరం ప‌డుతుంది. ప్రస్తుతం మనిషి తన గుర్తింపుని నిరూపించుకునేందుకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఏటీఎం, ఆధ

|

దేశంలో చాలా ప‌నుల‌కు మ‌న‌కు గుర్తింపు కార్డు ఎంత‌గానో అవసరం ప‌డుతుంది. ప్రస్తుతం మనిషి తన గుర్తింపుని నిరూపించుకునేందుకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఏటీఎం, ఆధార్ కార్డు లాంటి వాటిని వాడుతున్నాడు. ఆయా గుర్తింపు కార్డులు లేక‌పోతే చాలా చోట్ల క‌ష్ట‌మ‌వుతుంది. మ‌న ప‌నులు పూర్తికావు. ఇందులో ఆర్థిక వ్య‌వ‌హ‌రాల‌కు సంబంధించిన పాన్ కార్డుకు ఎంత ప్రాముఖ్య‌త ఉందో మీకు తెలిసే ఉంటుంది. కొన్ని సార్లు అజాగ్ర‌త్త కార‌ణంగా పాన్ కార్డు పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటిది పోతే కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. డూప్లికేట్ పాన్ కార్డు పొంద‌డం ఎలాగో ఇక్క‌డ తెలుసుకుందాం.

పాన్ కార్డు అనగా పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్. మీ పాన్ కార్డుని మీరు పొగొట్టుకున్నా లేదా మీ పాన్ కార్డు డామేజ్ అయిన మీరు మళ్లీ డూప్లికేట్ పాన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతర్జాలంలో చాలా వెబ్ సైట్స్ ఈ వెసులుబాటుని కల్పిస్తున్నాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా వెబ్ సైట్స్ నుండి ఆన్ లైన్‌లో పాన్ కార్డు అప్లికేషన్ ఫారంను ప్రింట్ అవుట్ తీసుకుని మీ క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించడమే.

డూప్లికేట్ పాన్ కార్డు కోసం రెండు పాస్ పోర్ట్ ఫోటో సైజు ఫోటోలతో పాటు గతంలో మీరు పాన్ కార్డు తీసుకున్న సమయంలో ఏ రుజువులు(ప్రూఫ్‌) స‌మ‌ర్పించారో దాన్నే మ‌ళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డు డామేజ్ అయినట్లైతే పాన్ కార్డు నఖలు అవసరం. అదే మీరు గనుక మీ పాన్ కార్డుని పోగొట్టుకున్నట్లైతే గతంలో మీ వద్ద ఉన్న పాన్ కార్డు జిరాక్స్ కాపీ లేదా పోలీస్ స్టేషన్ నుండి ఎఫ్‌ఐఆర్ సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు డూప్లికేట్ పాన్ కార్డుకి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ పేరు మీద ఉన్న ఓటరు ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, పాస్ పోర్ట్, వాటర్ బిల్, యుటిలిటీ బిల్లులు, డిపాజిటరీ ఖాతా ప్రకటన లాంటి వాటిల్లో ఏదో ఒక ప్రూఫ్ తప్పనిసరి. సుమారు 20 రోజుల్లో కొత్త పాన్ కార్డును జారీ చేస్తారు. మరింత సమాచారం కోసం https://nsdl.co.in/ వెబ్‌సైట్‌ని సంప్రదించండి.

English summary

డూప్లికేట్ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం ఎలా..? | How to get duplicate pancard in India if you lost or card is damaged

How to get duplicate pancard in India if you lost or card is damaged.. How to apply for a duplicate PAN Card? If you have lost your Permanent Account Number (PAN) card or it is damaged you can apply for a duplicate PAN Card. There are may websites where you can print an application online and do the payment through your credit card or net banking. pancard is issued by income tax department, you can get more information regarding pan card here:nsdl.co.in
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X