For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్‌లో త‌ప్పులున్నాయా? స‌వ‌రించుకునేదెలా?

ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు కేంద్రం ఉపాధి హామీ, విద్యార్థుల ఉప‌కార వేత‌నాలు వంటి వాటిని ఆధార్ సంఖ్య‌తో అనుసంధానిస్తోంది. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు నేరుగా ల‌బ్దిదారుకే చేరేందుకు వీలు

|

ఆధార్‌ అనేది పన్నెండు అంకెలు గల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. భారత ప్రభుత్వం తరపున దీనిని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేస్తుంది. వ్యక్తిగత గుర్తింపు, చిరునామాలకు భారతదేశంలో ఎక్కడైనా ఈ సంఖ్య ఆధారంగా పనికివస్తుంది.అలాంటి ఆధార్ కార్డులో తప్పులేమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడం ఎలా?

ముఖ్యంగా ఆధార్ నమోదు చేసిన ఫోన్ మారినా లేదా పుట్టిన తేదీ తప్పుగా నమోదయినా, సరిచేసుకోవాలంటే ఏం చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. అయితే ఆధార్ కార్డులో కొన్నింటిని మాత్రమే మనం మార్పులు, చేర్పులు చేయగలం. అవేమిటంటే పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబర్లను మార్పు చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఫోటోను మార్చే అవకాశం మాత్రం లేదు. ఈ క‌థ‌నం ద్వారా ఆధార్ స‌వ‌ర‌ణ‌ల విధానం గురించి స‌మ‌గ్రంగా తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో ఆధార్ స‌వ‌ర‌ణల విధానం ఇలా...

ఆన్‌లైన్‌లో ఆధార్ స‌వ‌ర‌ణల విధానం ఇలా...

ఆధార్ కార్డులో మార్పులు చేసుకునేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనే రెండు విధానాలున్నాయి. ముందుగా ఆన్‌లైన్ విధానంలో ఎలానో తెలుసుకుందాం. * ఇంటర్‌నెట్‌లో లింక్‌ను క్లిక్ చేయాలి. * మీ ఆధార్ కార్డ్ నెంబరును ఎంటర్ చేయాలి. * దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి. * అప్పుడు మీ మొబైల్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. * ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగా మీరు ఏది మార్పు చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి. * ఇక్కడ సంబంధిత ఫారమ్ వస్తుంది. * ఈ ఫారమ్‌ను పూరించాక సబ్‌మిట్ అప్‌డేట్ రిక్వెస్ట్‌ను క్లిక్ చేయాలి. * తర్వాత డాక్యుమెంటేషన్ ఆప్షన్‌లో మీరు ఏదైతే మార్పు కోరుతున్నారో దానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

* తర్వాత మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి. * ఇప్పుడు మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబరు వస్తుంది. * ఈ నెంబరుతో మీరు మీ ఆధార్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. * ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. * ఫారమ్ పూరించేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్‌ను పెట్టి కీ బోర్డులోని ట్యాబ్‌ను ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు అక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో సరైంది సెలక్ట్ చేసుకోవాలి. * 5 ఏళ్ల లోపు పిల్లలకు పేరెంట్స్ సంతకం చేస్తే సరిపోతుంది. * ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో రీఫ్రెష్ చేయకూడదు. * మీరు దేనికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో దాని డాక్యుమెంట్ పంపితే సరిపోతుంది. అన్ని పత్రాలు పంపాల్సిన అవసరం లేదు. * పేరుకు ముందు ఎలాంటి విషయాన్ని ప్రస్తావించకూడదు. (ఉదా: డా, శ్రీ, శ్రీమతి...) * అడ్రస్ చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అప్‌డేట్ అయిన ఆధార్‌ను ఆ అడ్రస్‌కు పంపుతారు. * డేట్ ఆఫ్ బర్త్ మార్పునకు మాత్రం ఒక్కసారే అవకాశం ఉంటుంది. * మొబైల్ నెంబరు మార్పు మాత్రం మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.

 ఆఫ్ లైన్ విధానం (పోస్ట్‌ద్వారా...)

ఆఫ్ లైన్ విధానం (పోస్ట్‌ద్వారా...)

ఇంటర్ నెట్‌లో లింక్‌ను క్లిక్ చేస్తే మీకు సంబంధిత దరఖాస్తు వస్తుంది. * అందులో మీ వివరాలు పూరించి, సంబంధిత దరఖాస్తులను జత చేయాలి. * దరఖాస్తును నిర్దేశిత కాలమ్‌లలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి. * ఒక ఎన్వలప్‌పై ‘రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్‌డేట్ అండ్ కరెక్షన్' అని రాసి ప్రాంతీయ కార్యాలయానికి పోస్ట్‌లో పంపాలి. * అటెస్ట్ చేయాల్సిన పత్రాలు, పాటించాల్సిన నిబంధనలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలకు ఒక్కటే.

ఆధార్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానం

ఆధార్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానం

ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు కేంద్రం ఉపాధి హామీ, విద్యార్థుల ఉప‌కార వేత‌నాలు వంటి వాటిని ఆధార్ సంఖ్య‌తో అనుసంధానిస్తోంది. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు నేరుగా ల‌బ్దిదారుకే చేరేందుకు వీలు క‌లుగుతుంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి https://resident.uidai.net.in/check-aadhaar-linking-status ఆధార్ నెంబర్ ఉన్నవారు తమ ఆధార్ వారి బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయినదా లేదా అను స్టేటస్ ను తనిఖీ చేసుకోవచ్చు. ఇది కూడా చ‌ద‌వండి ఆధార్ అనుసంధానం చేయ‌కపోతే ఇవి కోల్పోతారు

ఆధార్ సాయంతో చెల్లింపుల్లో స‌రికొత్త అధ్యాయం

ఆధార్ సాయంతో చెల్లింపుల్లో స‌రికొత్త అధ్యాయం

యుఐడిఎఐ భారత రిజర్వు బ్యాంకు, భార‌త‌దేశ జాతీయ చెల్లింపులు కార్పొరేషన్(ఎన్‌పీసీఐ) మరియు బ్యాంకులు సహా వివిధ వాటాదారులతో రెండు ముఖ్య ప్లాట్ ఫారంలను అభివృద్ధి చేయడానికి భాగస్వామిగా చేరింది:

a) ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జి (APB): లబ్దిదారునికి అన్ని సంక్షేమ పథకం చెల్లింపులు నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికి ఆధార్ ఎనేబుల్ బ్యాంక్ ఎకౌంట్ (AEBA) అను ఒక వ్యవస్థ అవకాశం కల్పిస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

b) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (AEPS): ప్రభావవంతంగా ఆధార్ ఆన్లైన్ దృవీకరణను కల్పించి మైక్రో ఎటిఎం ద్వారా AEBA వ్యవస్థతో సమాజంలో అట్టడుగు మరియు ఆర్థికంగా మినహాయించబడిన విభాగాలలో ఎప్పుడయినా ఎక్కడైనా బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చు.

అప్ డేట్ ఫారంను ఎక్క‌డ పంపించాలి?

అప్ డేట్ ఫారంను ఎక్క‌డ పంపించాలి?

అప్ డేట్ అభ్యర్థనను ఈ క్రింది ఏ చిరునామాకు అయినా పంపవచ్చు:

UIDAI, Post Box No. 10 Chhindwara, Madhya Pradesh- 480001 India (యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ నెం 10 చింద్వార, మధ్యప్రదేశ్ Pradesh- 480001 భారతదేశం)

UIDAI, Post Box No. 99, Banjara Hills, Hyderabad - 500034 India (యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ నెం 99, బంజారా హిల్స్, హైదరాబాద్ - 500034 భారతదేశం)

పర్మినెంట్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా: ఈ మోడ్ లో నివాసితులు పర్మినెంట్ ఎన్రోల్మెంట్ కేంద్రం వద్ద ఒక ఆపరేటర్ సహాయంతో డెమోగ్రాఫిక్ / బయోమెట్రిక్ అప్ డేట్ అభ్యర్థనను చేసుకోవచ్చును.

ఆధార్ అవ‌స‌ర‌మేంటి?

ఆధార్ అవ‌స‌ర‌మేంటి?

ఆధార్‌ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పౌరుల‌మధ్య నమ్మకాన్ని పెంపొందించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఆధార్‌ కోసం నమోదు చేసుకున్నాక వారికి సంబంధించిన "మీ వినియోగదారున్ని గురించి తెలుసుకోండి(కేవైసీ)" అనే సమాచారం కోసం సర్వీసు ప్రొవైడర్లు వేచి ఉండక్కర్లేదు. గుర్తింపు పత్రాలు లేవన్న కారణంతో పౌరుల‌కు తమ సేవలను తిరస్కరించనవసరం లేదు. బ్యాంక్‌ అకౌంట్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు... మొదలైన సేవలను పొందడానికి ప్రతిసారి తమ గుర్తింపు పత్రాలను చూసి గుర్తింపును నిరూపించుకోవల్సిన సమస్యను పౌరులు ఆధార్ ద్వారా అరిక‌ట్టే రోజులు ఎంతో దూరంలో లేవు.ఉద్యోగంతో పాటు అద‌న‌పు ఆదాయానికి 8 మార్గాలు

డీమ్యాట్ షేర్ల‌ను ఆన్‌లైన్‌లో అమ్మ‌డం ఎలా?

డీమ్యాట్ షేర్ల‌ను ఆన్‌లైన్‌లో అమ్మ‌డం ఎలా?

డీమ్యాట్ షేర్ల‌ను ఆన్‌లైన్‌లో అమ్మ‌డం ఎలా? డీమ్యాట్ షేర్ల‌ను ఆన్‌లైన్‌లో అమ్మ‌డం ఎలా?

 ఇంట్లో కూర్చొనే ఆన్లైన్ ద్వారా డ‌బ్బు సంపాదించేందుకు 10 చ‌క్క‌ని మార్గాలు

ఇంట్లో కూర్చొనే ఆన్లైన్ ద్వారా డ‌బ్బు సంపాదించేందుకు 10 చ‌క్క‌ని మార్గాలు

ఆన్‌లైన్ డ‌బ్బు సంపాద‌న‌కు 10 చ‌క్క‌టి మార్గాలుఆన్‌లైన్ డ‌బ్బు సంపాద‌న‌కు 10 చ‌క్క‌టి మార్గాలు

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా?

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా?

పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా?పీఎఫ్ సొమ్మును 5 రోజుల్లో వెనక్కి తెచ్చుకోవ‌డం ఎలా?

ఉద్యోగంతో పాటు అద‌న‌పు ఆదాయానికి 8 మార్గాలు

ఉద్యోగంతో పాటు అద‌న‌పు ఆదాయానికి 8 మార్గాలు

ఉద్యోగంతో పాటు అద‌న‌పు ఆదాయానికి 8 మార్గాలు ఉద్యోగంతో పాటు అద‌న‌పు ఆదాయానికి 8 మార్గాలు

Read more about: aadhar uidai ఆధార్‌
English summary

ఆధార్‌లో త‌ప్పులున్నాయా? స‌వ‌రించుకునేదెలా? | How to change name and address in aadhar card online

How to change name and address in aadhar card online?If you have recently moved to a new address or if there are mistake(s) in the address, you can apply for AADHAAR card change of address / address correction online as well as through post.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X