For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌గ‌దు ర‌హిత ఆర్థిక లావాదేవీల కోసం త్వ‌ర‌లో ఆధార్ పే

ఇప్ప‌టిదాకా 49 కోట్ల బ్యాంకు ఖాతాల‌ను ఆధార్‌తో అనుసంధానించిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌పై ప్ర‌తి నెలా 2 కోట్ల కాతాల‌ను ఆధార్ అనుసంధానం చేసే ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని ర‌విశంక‌ర్ తెలిపారు. ఇప్ప‌టికే గ్రామ

|

ప్ర‌భుత్వం ఆధార్ ఆధారంగా చెల్లింపుల వ్య‌వ‌స్థ‌ను ప్రారంభించ‌బోతోంది. బ‌యోమెట్రిక్ వ్య‌వ‌స్థ ద్వారా నెల‌కొల్పే ఈ విధానంలో కేవ‌లం ఆధార్ సంఖ్య ఆధారంగా న‌గ‌దు బ‌దులు డిజిట‌ల్ చెల్లింపులు, ట్రాన్స్‌ఫ‌ర్లు చేయ‌వ‌చ్చు.

'ఆధార్‌ పే సేవను ప్రారంభించబోతున్నాం. దీంతో నగదు చెల్లింపులకు ఫోన్‌ను తమ వెంట తీసుకుని వెళ్లనవసరం లేదు.ఏ దుకాణానికైనా వెళ్లి తమ ఆధార్‌ నంబర్‌ చెప్పి, వేలి ముద్రలు వేయడం ద్వారా నగదు చెల్లించవచ్చు, స్వీకరించవచ్చు'' అని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు చెప్పారు.ఈ నేప‌థ్యంలో ఆధార్ పే గురించి మ‌రిన్ని విశేషాలు తెలుసుకుందాం.

ఆధార్ పే సేవ‌లో 14 బ్యాంకులు

ఆధార్ పే సేవ‌లో 14 బ్యాంకులు

ఆధార్‌ పే సర్వీస్‌ పరిధిలోకి ఇప్పటి వరకు 14 బ్యాంకులు వచ్చి చేరాయని, మిగిలిన బ్యాంకులతోనూ చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్‌పీసీఐ(నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా) ఈ మొత్తం వ్య‌వ‌స్థ‌ను నిర్వ‌హిస్తోంది. అతి త్వరలోనే ఈ సర్వీసును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి

కొన్ని బ్యాంకులు ఆధార్‌ పేకు సంబంధించి ఇప్పటికే సొంతంగా అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాయని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వీటి పనితీరును పరీక్షిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్ర‌త్య‌క్ష న‌గదు బ‌దిలీ ప‌థ‌కం ద్వారా న‌గ‌దుతో సంబంధం లేకుండా డిజిట‌ల్ లావాదేవీల కోసం ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్ర‌కారంగా పైల‌ట్ ప్రాజెక్టుగా కృష్టా జిల్లాను ఎంచుకున్నారు. ప్ర‌తి గ్రామీణ పౌరుడికి సౌక‌ర్యంగా ఉండేందుకు వీలుగా ప్ర‌తి ప‌ల్లెలో మైక్రో ఏటీఎమ్‌ల‌ను ఏర్పాటు చేస్తారు. ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ సౌజ‌న్యంతో జామ్‌(జ‌న్ ధ‌న్ యోజ‌న‌+ఆధార్‌+మొబైల్ నంబ‌రు) వ్య‌వ‌స్థ‌ను ప‌రీక్షిస్తుంది.

 భీమ్ యాప్‌తో అనుసంధానం

భీమ్ యాప్‌తో అనుసంధానం

భీమ్‌ యాప్‌ని ఆధార్‌ చెల్లింపుల విధానంతో అనుసంధానించనున్నట్టు మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ఆధారితంగా పనిచేసే భీమ్‌ యాప్‌ను అన్ని చెల్లింపులకు వీలుగా ఇటీవల కేంద్ర సర్కారు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 111 కోట్ల మందికిపైగా ఆధార్‌ నంబర్‌ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. సమాచార దుర్వియోగంపై ప్రజలు తరచుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని, కానీ ఆధార్‌ చట్టం ప్రజల సమాచార గోప్యతను పూర్తిగా గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

బ్యాంకు ఖాతాల‌కు ఆధార్ అనుసంధానం

బ్యాంకు ఖాతాల‌కు ఆధార్ అనుసంధానం

ఇప్ప‌టిదాకా 49 కోట్ల బ్యాంకు ఖాతాల‌ను ఆధార్‌తో అనుసంధానించిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌పై ప్ర‌తి నెలా 2 కోట్ల కాతాల‌ను ఆధార్ అనుసంధానం చేసే ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని ర‌విశంక‌ర్ తెలిపారు. ఇప్ప‌టికే గ్రామాల్లో ఆధార్ అనుసంధాన చెల్లింపుల వ్య‌వ‌స్థ ద్వారా(ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్ట‌మ్‌) లావాదేవీలు జ‌రుగుతున్న‌ట్లు వెల్ల‌డించారు. దీని ద్వారా కేవ‌లం గ్రామీణ ప్రాంతాల్లోనే 33 కోట్ల లావాదేవీలు జ‌రిగాయ‌ని చెప్పారు. ఆధార్ అనుసంధానించి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వ్య‌వ‌స్థీకృతం చేయ‌డం మూలంగా గ‌త రెండేళ్ల‌లో కేంద్రానికి రూ. 36,144 కోట్లు ఆదా అయింద‌ని తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

Read more about: aadhar payments
English summary

న‌గ‌దు ర‌హిత ఆర్థిక లావాదేవీల కోసం త్వ‌ర‌లో ఆధార్ పే | Aadhar Pay coming soon for cashless transactions

Government will soon roll out Aadhaar Pay service that will enable people to make and receive payments using their Aadhaar number and biometrics.“We are going to start Aadhaar Pay. With this people will not require to carry their phone for payments. They can visit any merchant, share their Aadhaar number and verify themselves using biometrics to pay and receive money,” Electronics and IT Minister Ravi Shankar Prasad said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X