For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రీచార్జ్ మొబైల్ వ్యాలెట్ అంటే ఏమిటి? దీని ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు

ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ కొంటే రూపాయి తగ్గింపు రాదు. కానీ, టికెట్ ధరను చెల్లించేటప్పుడు మొబీక్విక్ లేదా పేటీఎం; ఫ‌్రీచార్జ్ , మొబిక్విక్‌ నుంచి డబ్బులు చెల్లిస్తే ప్రమోషన్లలో భాగంగా ఆయా సైట్లు తగ్గి

|

పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే, మొబైల్ ఇ వ్యాలెట్ సంస్థలు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి. పేటిఎం, ఫ్రీచార్జ్, మొబిక్విక్ లాంటి మొబైల్ ఇ వ్యాలెట్ సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్ బిఐ నెలవారీ లావాదేవీల పరిమితిని 20 వేల రూపాయల వరకు పెంచింది. గతంలో 10 వేల రూపాయల లావాదేవీలకే పర్మిషన్ వుండేది. ఫ్రీచార్జ్ స్నాప్‌డీల్‌తో టై-అప్ అయింది. దీంతో స్నాప్‌డీల్‌లో మీ షాపింగ్ వేగంగా అవుతుంది.
పేటీఎమ్‌, మొబీక్విక్, ఫ్రీచార్జ్, ఎయిర్‌టెల్ మనీ, వొడాఫోన్ ఎం పెసా, ఓలా మ‌నీ ఇలా వ్యాలెట్ సేవలు అందించే సంస్థలు చాలానే ఉన్నాయి. ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ కొంటే రూపాయి తగ్గింపు రాదు. కానీ, టికెట్ ధరను చెల్లించేటప్పుడు మొబీక్విక్ లేదా పేటీఎం; ఫ‌్రీచార్జ్ , మొబిక్విక్‌ నుంచి డబ్బులు చెల్లిస్తే ప్రమోషన్లలో భాగంగా ఆయా సైట్లు తగ్గింపు ఇస్తుంటాయి. వ్యాలెట్ సైట్లను చూస్తే ఆఫర్ల గురించి తెలుస్తుంది. ఈ మ‌ధ్య సినిమా టిక్కెట్ల బుకింగ్, విద్యుత్ బిల్లు చెల్లింపు వంటి వాటికి సైతం ఫ్రీచార్జ్ క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ల‌ను ఇస్తోంది. దేశంలో టాప్‌3 మొబైల్ వ్యాలెట్ల‌లో ఒక వ్యాలెట్‌గా కొన‌సాగుతున్న ఫ్రీచార్జ్ గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

వినియోగ‌దారుల‌కు ప్ర‌యోజ‌నాలు

వినియోగ‌దారుల‌కు ప్ర‌యోజ‌నాలు

విద్యుత్, గ్యాస్‌, మొబైల్ బిల్లు, డీటీహెచ్ సేవ‌లు, స్నాప్‌డీల్ ద్వారా ఈ-కామ‌ర్స్ షాపింగ్‌, ఎన్‌జీవోల‌కు విరాళాల‌ను చెల్లించ‌వ‌చ్చు. ఎలాంటి సెట‌ప్ వ్య‌యాలు లేకుండా ఫ్రీచార్జ్ ఖాతాను తెరవ‌చ్చు. ఫ్రీచార్జ్ యాప్ వినియోగించే వారు ఆఫ్‌లైన్లో ఉన్న‌ప్ప‌టికీ ఆన్ ది గో పిన్ టెక్నాల‌జీని ఉప‌యోగించి చెల్లించ‌వ‌చ్చు. చిల్ల‌ర స‌మ‌స్య‌ల‌ను ఫ్రీచార్జ్ ప‌రిష్క‌రిస్తుంది. లోడింగ్ మ‌నీ, రీచార్జీలు, వ్యాపారుల‌కు చెల్లింపులు వంటి సంద‌ర్భాల్లో స‌మ‌యానుకూలంగా క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌ను ఫ్రీచార్జ్ అందిస్తుంది.

చాట్ అండ్ పే:

చాట్ అండ్ పే:

డిజిటల్ చెల్లింపు విధానాల్లోనే ఇదో సరికొత్త సాంకేతికత.చాట్ అండ్ పే అనేది సోషల్ పేమెంట్స్కు ఎంగేజింగ్ మరియు సురక్షితమైన మార్గం. ఈ పేమెంట్లనే పర్సన్-టు-పర్సన్(పీ2పీ) చెల్లింపులుగా వ్యవహరిస్తారు.

స్పిట్ బిల్ ఆప్షన్:

స్పిట్ బిల్ ఆప్షన్:

ఫ్రీ చార్జ్ యాప్ మొట్టమొదటి సారి ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఫ్రీచార్జ్ స్పిట్ బిల్ ఆప్షన్ ద్వారా ఒక బిల్లును 4-5 మంది పంచుకోవచ్చు. వినియోగదారులు తమ బిల్లులను సులభంగా, మెరుగైన విధంగా నిర్వహించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

వాట్సప్ పేమెంట్స్:

వాట్సప్ పేమెంట్స్:

ఫ్రీ చార్జ్ వినియోగదారులు ఇప్పుడు వాట్సప్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రీచార్జ్ వ్యాలెట్ వాట్సప్ లాంటి చాటింగ్ ప్లాట్ఫాంల ద్వారా 10 సెకన్లలోపే భద్రమైన మార్గంలో డబ్బు పంపేందుకు, పొందేందుకు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై ఉండే వినియోగదారులు చాట్ అండ్ పే సేవను వినియోగించేందకు వీలు కల్పిస్తుంది.

విరాళాలు:

విరాళాలు:

త‌మ యాప్ ద్వారానే డొనేష‌న్స్ పంపేందుకు సైతం ఫ్రీచార్జీ వినూత్న సాంకేతిక‌త‌ను అభివృద్దిప‌రిచింది. యాప్‌పై ఉండే డొనేష‌న్స్ విభాగం ద్వారా ఎన్‌జీవోల నిధుల సేక‌ర‌ణ‌ను సుల‌భ‌త‌రం చేసింది.

ఆటో పే:

ఆటో పే:

ఫ‌్రీ చార్జ్ వ్యాలిడిటీతో కూడిన రీచార్జీల‌కు లేదా యుటిలిటీ బిల్లుల చెల్లింపుల‌కు వీలుగా ఆటో పే సదుపాయాన్ని క‌ల్పించింది. ఈ స‌రికొత్త ఫీచ‌ర్ చెల్లింపు ప్ర‌క్రియ‌ను తిరుగులేనిదిగా, మ‌రింత విశ్వ‌స‌నీయ‌మైన‌దిగా చేస్తుంది.

వ‌ర్చువ‌ల్ ఫ్రీచార్జ్ కార్డ్ ప్రోగ్రామ్‌:

వ‌ర్చువ‌ల్ ఫ్రీచార్జ్ కార్డ్ ప్రోగ్రామ్‌:

ఎఫ్‌సీ వ్యాలెట్‌తో కూడిన ఏ వినియోగ‌దారుడైనా అసోసియేటెడ్ వ‌ర్చువ‌ల్ కార్డును ఒక్క క్లిక్‌తో పొందే సదుపాయాన్ని ఈ వ్యాలెట్ మీ కోసం తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లావాదేవీల‌ను జ‌రిపే చోట వ్యాపారులు ఈ కార్డును సైతం అంగీక‌రించేందుకు ఒప్పందాలు జ‌రుగుతున్నాయి.

ఆన్ ది గో పిన్:

ఆన్ ది గో పిన్:

ఫ‌్రీచార్జ్‌కే పేటెంట్కలిగిన "ఆన్ ది గో పిన్" సాంకేతికత అనేది కస్టమర్ల సెక్యూరిటీ, డేటా భద్రతలను దృష్టిలో ఉంచుకొని దేశీయంగా రూపొందించబడింది. ప్రతి లావాదేవీని ఓటీపీ ద్వారా తనిఖీ చేస్తారు. అది నమోదిత మొబైల్ నంబరుకు పంపుతారు. ఫ్రీచార్జ్ యాప్పై ఉండే ఆటోమేటిక్ ఓటీపీ ప్రతీ మూడు నిమిషాలకు ఒకసారి మారుతుంది.

Read more about: freecharge wallet digital
English summary

ఫ్రీచార్జ్ మొబైల్ వ్యాలెట్ అంటే ఏమిటి? దీని ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు | things to know about freecharge

FreeCharge is India’s No.1 payments app. Customers across the country use FreeCharge to make prepaid, postpaid, DTH, metro recharge and utility bill payments for numerous service providers. We launched our wallet in September 2015 and customers are already using it to pay across all major online platforms and offline stores like Shoppers Stop, McDonalds, Cinepolis, HomeStop, Crosswords, Hypercity and even for E-Rickshaws, the list is growing by the day.
Story first published: Sunday, December 18, 2016, 9:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X