English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మీకు పాన్ కార్డు లేదా? ఇలా చేస్తే రెండు రోజుల్లో వ‌స్తుంది

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

  శాశ్వ‌త ఖాతా సంఖ్య‌(పాన్ కార్డు) క‌లిగి ఉండ‌టం అంద‌రికీ అత్య‌వ‌స‌ర‌మ‌య్యే ప‌రిస్థితులు నేడు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీల‌కు, పెట్టుబ‌డులు పెట్టేందుకు గుర్తింపు త‌నిఖీ కోసం పాన్ కార్డు వివ‌రాల‌ను అడుగుతున్నారు. పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ లేదా పాన్‌కార్డ్‌(PAN card) అనేది సార్వత్రికమైన 10 అంకెల అల్ఫాన్యూమరిక్‌ గుర్తింపు కార్డు. ఆదాయ పన్ను శాఖ ప్రతీ ప‌న్ను చెల్లింపుదారుకు దీన్ని జారీ చేస్తుంది. బ్యాంకుల్లో 50 వేల పైబ‌డి డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు అడుగుతున్నారు. ఇప్పుడు మ్యాన్యువ‌ల్‌గా ద‌ర‌ఖాస్తు చేసినా మీకు కార్డు రావ‌డానికి 15 నుంచి 20 రోజులు ప‌డుతుంది. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే వారు ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా రెండ్రోజుల్లో పాన్‌కార్డు పొందే స‌దుపాయాన్ని ప్ర‌భుత్వం క‌ల్పించింది. ఈ నేప‌థ్యంలో 48 గంట‌ల్లో పాన్ కార్డు పొంద‌డ‌మెలానో తెలుసుకుందాం.

పాన్ కార్డు గురించి

పాన్ కార్డు గురించి

పాన్‌కార్డు అనేది గుర్తింపు ప‌త్రంగా సైతం ప‌నిచేస్తుంది. భారత ఆదాయపు పన్ను శాఖ దీన్ని జారీ చేస్తుంది. పేరు, వయసు, చిరునామా తదితర వివరాలతో కూడిన దరఖాస్తు పత్రాన్ని ఆదాయపు పన్ను శాఖకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత చాలాకాలం వరకు దరఖాస్తుదారులు వేచి చూడాలి. అత్యవసర సమయాల్లో పాన్‌కార్డుని రెండ్రోజుల్లో పొందడానికి ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌ సహకార మందిస్తుంది. పాన్‌కు ద‌ర‌ఖాస్తు చేసేముందు మీ వ‌ద్ద రూ.107 డీడీ లేదా చెక్కు ఉండాలి. లేదా ఆన్‌లైన్‌లో పే చేయాల‌నుకుంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉంటే స‌రిపోతుంది.

ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌కి లాగిన్‌ కావాలి

ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌కి లాగిన్‌ కావాలి

ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌ని సందర్శించాలంటే ఎన్‌ఎస్‌డిఎల్‌. కో. ఇన్‌ కి లాగిన్‌ కావాలి. ఆన్‌ లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ లో ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కావాలంటే ఆన్‌లైన్‌ అప్లికేషన్ ఫారం నింపాలి.

Click on https://tin.tin.nsdl.com/pan/form49A.html or https://tin.tin.nsdl.com/pan/newpan.html to apply online for PAN

డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ చేయాలి. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు కోసం

ఆన్‌లైన్ ఫారంలో వార్డు లేదా స‌ర్కిల్‌, రేంజి, క‌మీష‌న‌ర్‌, ఏరియా కోడ్‌, ఏవో కోడ్‌, రేంజ్ కోడ్‌, ఏవో నంబ‌రు వంటివ‌న్నీ పూరించాలి. వీటిని తెలుసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి.

ఫామ్‌ ఎంచుకోవాలి:

ఫామ్‌ ఎంచుకోవాలి:

గైడ్‌లైన్స్‌ చదివిన తర్వాత ఫామ్‌ రకాన్ని ఎంచుకో వాలి. డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌ కావాలా? డిజిటల్‌ సిగ్నేచర్‌ లేని సర్టిఫికేట్‌ కావాలా? అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. వివరాలు మొత్తం నింపాలి. పాన్ కార్డ్ కు సంబంధించిన వివరాలన్నీ ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్లో లభ్యమౌతాయి.

పాన్ / టాన్ కార్డ్ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ - రిటర్నుల రిజిస్ట్రేషన్ స్థితి తెలుసుకోవడం

పాన్ కు సంబంధించిన ఫిర్యాదులు చేయడం, పాన్ డేటాలో మార్పు, చేర్పులు చేసుకోవడం కూడా ఎన్ఎస్డిఎల్ ద్వారా సాధ్యమౌతుంది.

ఎలా సమర్పించాలి?

ఎలా సమర్పించాలి?

వివరాలన్నీ నింపిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఫామ్‌ సమర్పిం చాలి. ఆఫ్‌లైన్‌లో సమర్పించాలనుకుంటే ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఫామ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫామ్‌లో నింపిన ప్రకారం సపోర్టింగ్‌ డాక్యుమెంట్‌ జత చేసి సమర్పించాలి.

పాన్ కార్డును గురించిన 6 ముఖ్య‌ విష‌యాలు

అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాక్, రెండు రోజుల్లో

అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాక్, రెండు రోజుల్లో

అప్లికేషన్‌ నెంబర్‌ ప్రకారం ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలి. ఈ నెంబర్‌ ప్రకారమే మీ అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాక్‌ చేసుకోవచ్చు. సర్వసాధారణంగా అయితే 15 నుంచి 20 వర్కింగ్‌ డేస్‌ తర్వాత పాన్‌ కార్డు వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. కేవలం రెండు రోజుల్లో పాన్‌కార్డు పొందవచ్చు. వివరాలన్నీ సమర్పించిన తర్వాత రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా పాన్‌కార్డు వస్తుంది.

అప్లికేష‌న్ స్టేట‌స్ ట్రాక్ చేసేందుకు

ఆఫ్‌లైన్‌లో స‌బ్‌మిట్ చేయాల‌నుకునేవారు ఇవి చూసుకోవాలి.

ఆఫ్‌లైన్‌లో స‌బ్‌మిట్ చేయాల‌నుకునేవారు ఇవి చూసుకోవాలి.

అక్నాలెడ్జ్‌మెంట్ ఫారం(క‌ల‌ర్ ఫోటో,సంత‌కం)

వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం జిరాక్స్‌

చిరునామా గుర్తింపు ప‌త్రం జిరాక్స్‌

ఆఫ్‌లైన్‌లో డ‌బ్బు చెల్లించేవారైతే రూ. 107 డీడీ

ద‌ర‌ఖాస్తును ఎవ‌రికి పంపాలి?

ద‌ర‌ఖాస్తును ఎవ‌రికి పంపాలి?

ద‌ర‌ఖాస్తు ఫారం పంపాల్సిన చిరునామా:

NSDL, 'Income Tax PAN Services Unit, National Securities Depository Limited, 3rd Floor, Sapphire Chambers, Near Banner Telephone Exchange, Banner, Pune - 411045 (Maharashtra)

ఎన్‌సీడీఎల్ నుంచి అధిక స‌మాచారం పొందేందుకు tininfo@nsdl.co.in ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయ‌వ‌చ్చు.

English summary

How to get PAN card in 2days through online mode

Why PAN Card is Important in India PAN card and How to get pan card in 2 days i.e. permanent account number is provided by Income tax department to every income tax payer. But do you know that PAN card is compulsory and required by following authorities while doing financial transactions with them.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC