For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొన‌సాగుతున్న మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ల‌ను రద్దు చేయ‌డం లేదా ర‌ద్దైన సిప్‌ల‌ను తిరిగి పున‌రుద్ధ‌రించడం

మ్యూచ్‌వ‌ల్ ఫండ్ లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అత్యంత సులువైన విధానం సిప్ మోడ్‌. ఈ ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డిదారుడు నెల‌నెలా కొంత మొత్తాన్ని త‌న బ్యాంకు ఖాతా నుంచి ఇసిఎస్ లేదా ఆటోడెబిట్ ప‌ద్ధ‌తి ద్వారా త‌ను

|

మ్యూచ్‌వ‌ల్ ఫండ్ లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అత్యంత సులువైన విధానం సిప్ మోడ్‌. ఈ ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డిదారుడు నెల‌నెలా కొంత మొత్తాన్ని త‌న బ్యాంకు ఖాతా నుంచి ఇసిఎస్ లేదా ఆటోడెబిట్ ప‌ద్ధ‌తి ద్వారా త‌ను ఎంచుకున్న మ్యూచ్‌వ‌ల్‌ఫండ్ కంపెనీలో పెట్టుబ‌డులు పెడ‌తాడు. అయితే ఇలా సిప్‌ను ప్రారంభించిన కొన్ని నెల‌లు లేదా సంవ‌త్స‌రాల త‌ర్వాత వివిధ కార‌ణాల వ‌ల్ల వాటిని కొనసాగించ‌లేని ప‌రిస్థితి రావ‌చ్చు. అలాంటి స‌మ‌యంలో పెట్టుబ‌డిదారుడి ముందు ఉండే దారులు రెండు. ఒక‌టి అప్ప‌టి వ‌ర‌కు జ‌మ అయిన మొత్తాన్ని ఉప‌సంహ‌రించుకోవ‌డం. ఆ స‌మ‌యానికి సొమ్ము అవ‌స‌రం అయ్యి వేరే ఎక్క‌డా స‌ర్ధుబాటు కుద‌ర‌క‌పోవ‌డంతో పాటు సిప్‌ను కొన‌సాగించ‌లేకపోతే ఈ దారిని ఎంచుకోవ‌చ్చు. రెండ‌వ‌ది సిప్ పెట్టుబ‌డుల‌ను ర‌ద్దు చేసుకోవ‌డం. కొన్ని స‌మ‌యాల్లో ఎలాంటి సొమ్ము అవ‌స‌రం ఉండదు కానీ ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న సిప్ లో పెట్టుబ‌డుల‌కు ఇబ్బంది త‌లెత్త‌వ‌చ్చు అప్పుడు ఈ రెండో ప‌ద్ధ‌తిని ఎంచుకోవ‌చ్చు. ఈ ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డిదారుడు కేవ‌లం నెల నెలా పెట్టే పెట్టుబ‌డిని మాత్ర‌మే ర‌ద్దు చేస్తాడు. అప్ప‌టి వ‌ర‌కు ఆ ఫండ్‌లో పెట్టిన పెట్టుబ‌డిని ఉప‌సంహ‌రించుకోడు కావున ఆ మొత్తం విలువ మార్కెట్ ప‌రిస్థితుల మీద ఆధార‌ప‌డి హెచ్చుత‌గ్గుల‌కు లోన‌వుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప‌లు మార్గాలు

పెట్టుబ‌డిదారుడు త‌న సిప్‌ను ఇలా ర‌ద్దు చేసుకోవాల‌ని భావిస్తే ముందుగా సంబంధింత మ్యూచ్‌వ‌ల్ ఫండ్ కంపెనీ నుంచి సిప్ క్యాన్సిలేష‌న్ ఫారంను పొందాలి. ఈ ఫారంలో కొన‌సాగుతున్న సిఫ్ ఫోలియో నెంబ‌రు, ఫండ్ పేరు, ప్ర‌తి నెలా బ్యాంకు నుంచి బ‌దిలీ అవుతున్న తేదీ, బ్యాంకు అకౌంట్ నెంబ‌రు, ఇత‌ర బ్యాంకు వివ‌రాలు పొందుప‌రిచి పెట్టుబ‌డిదారుడు త‌న సంత‌కాన్ని చేసి సంబంధిత ఫండ్ కార్యాల‌యంలో అంద‌జేయాలి. ఫారంలో వివ‌రాలు అన్ని స‌రిపోల్చుకొని సంబంధిత ఫండ్‌హౌస్‌ త‌దుప‌రి నెల నుంచి సిప్‌ను ర‌ద్దు చేస్తుంది.

ర‌ద్దైన సిప్‌ల‌ను తిరిగి పున‌రుద్ధ‌రించడంః
సిప్‌ను ప్రారంభించిన త‌ర్వాత పెట్టుబ‌డిదారుడు త‌న బ్యాంకు ఖాతాలో సిప్‌కు స‌రిప‌డు మొత్తాన్ని నిర్వ‌హించ‌కుండా వ‌రుస‌గా మూడు నెల‌లు దాటితే అలాంటి సిప్‌లను మ్యూచ్‌వ‌ల్‌ఫండ్ కంపెనీ ర‌ద్దు చేస్తుంది. ఇలా ర‌ద్దు చేయ‌బ‌డిన లేదా గ‌తంలో పెట్టుబ‌డిదారుడే స్వంతంగా ర‌ద్దు చేసుకున్న సిప్‌ల‌ను తిరిగి ప్రారంభించుకోగ‌లం. అయితే బ్యాంకు ఖాతాలో స‌రిప‌డు న‌గదు నిల్వ‌ల‌ను నిర్వ‌హించ‌క‌పోవ‌డం వ‌ల్ల సిప్ రద్ధైతే అది పెట్టుబ‌డిదారుడి సిబిల్ స్కోరు మీద ప్రభావం చూపుతుంది. కావున ఇసిఎస్ లేదా ఆటోడెబిట్ ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాన్ని ప్ర‌తి నెలా నిల్వ ఉండేలా చూసుకోవాలి.

ర‌ద్దైన సిప్‌ను తిరిగి ప్రారంభించడానికి సంబంధిత మ్యూచ్‌వ‌ల్ ఫండ్ కంపెనీకి చెందిన ఇసిఎస్ లేదా సిప్ ఆటోడెబిట్ ఫారం ను మ‌ర‌లా పూర్తిగా స‌రైన వివ‌రాల‌తో నింపాలి. ర‌ద్దైన సిప్ ఫోలియో నెంబరు, ప్ర‌తి నెలా ఏ తేదీన గ‌తంలో సిప్ అవుతుందో మ‌ర‌లా అదే తేదీని ఇవ్వాలి. ఒక‌వేళ ఆ తేదీని త‌ప్పుగా న‌మోదు చేస్తే ఆ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌రించ‌బడుతుంది. కావున తేదీని న‌మోదు చేసే విష‌యంలో పాత తేదీతో స‌రిచూసుకోవాలి. పూర్తి చేసిన ఫారంకు క్యాన్సిల్డ్ చెక్‌ను జ‌త చేసి సంబంధిత ఫండ్ కార్యాల‌యంలో ఇవ్వాలి. అన్ని వివ‌రాలు గ‌తంలో్ ర‌ద్దైన సిప్ వివ‌రాల‌తో స‌రిపోల్చుకొని ఫండ్ హౌస్ త‌దుప‌రి నెల నుంచి ర‌ద్దైన సిప్‌ను తిరిగి ప్రారంభిస్తుంది.

Read more about: mutual funds investment
English summary

కొన‌సాగుతున్న మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ల‌ను రద్దు చేయ‌డం లేదా ర‌ద్దైన సిప్‌ల‌ను తిరిగి పున‌రుద్ధ‌రించడం | How to cancel the existing sips and revive and cancelled sips in mutual funds

Considering the investment discipline they help inculcate and the returns they promise, SIPs have strongly emerged as one of the most popular investment vehicles in the past one decade. Nevertheless, people are still not clear about their correct usage and the possible situations that can arise from them. For instance, a quick visit to any investment forum would reveal the doubts people have with regard to cancellation or alteration of SIPs mid-way. Not many people know how to handle such eventualities.
Story first published: Friday, December 23, 2016, 16:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X