For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ‌న్ ధ‌న్ యోజ‌న ద్వారా ఖాతాదారుకు రూ.1 ల‌క్ష బీమా

జ‌న్‌ధ‌న్ యోజ‌న ద్వారా కుటుంబంలో ఒక‌రికి ఓవ‌ర్‌డ్రాఫ్ట్ సౌక‌ర్యం ల‌భిస్తుంది. ఇంకా ఖాతాదారుకు రూ. 1 ల‌క్ష ప్ర‌మాద బీమా, రూ. 30 వేల జీవిత బీమా క‌ల్పిస్తారు.

|

పేద‌లంద‌రికీ బ్యాంకు ఖాతాల‌ను తెర‌వ‌డం ద్వారా ఆర్థిక అస్పృశ్య‌త‌ను, త‌ద్వారా పేద‌రికాన్ని నిర్మూలించే ల‌క్ష్యంతో ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న యోజ‌న ప‌థ‌కాన్ని రూపొందించారు. సున్నా నిల్వ‌తో ఖాతా, ల‌క్ష రూపాయల వ‌ర‌కూ ప్ర‌మాద బీమా, రూ. 30 వేల వ‌ర‌కూ జీవిత బీమా సౌక‌ర్యాల‌ను ఈ ఖాతాల‌కు క‌ల్పించారు. ఈ ప‌థ‌కం కింద ఖాతా తీసుకున్న‌వారు నెల‌కు రూ. 10 వేల బ‌దిలీకి మాత్ర‌మే సౌక‌ర్యం క‌లిగి ఉంటారు. ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కంపై త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను చూడండి.

ప్ర‌ధానమంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న కింద ఉమ్మ‌డి ఖాతా తెర‌వొచ్చా?

ప్ర‌ధానమంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న కింద ఉమ్మ‌డి ఖాతా తెర‌వొచ్చా?

తెరిచే అవ‌కాశం ఉంది.

ఈ ప‌థ‌కం వ‌ల్ల నాకు క‌లిగే ల‌బ్ది ఏంటి?

ఈ ప‌థ‌కం వ‌ల్ల నాకు క‌లిగే ల‌బ్ది ఏంటి?

ప‌థ‌కంలోని ప్ర‌ధాన వివ‌రాలు

* ఖాతాదారుకు రూ. 5వేల ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌

* రూ. 1 లక్ష ప్ర‌మాద బీమా

* రూ. 30 వేల జీవిత బీమా

* రూపే డెబిట్ కార్డు

 రూపే డెబిట్ కార్డు అంటే ఏమిటి?

రూపే డెబిట్ కార్డు అంటే ఏమిటి?

దేశీయంగా రూపొందించిన డెబిట్ కార్డే రూపే డెబిట్ కార్డు. దీన్ని ఎన్‌పీసీఐ(నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా) ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కార్డును అన్ని ఏటీఎమ్‌ల్లోనూ, చాలా పాయింట్ ఆఫ్ సేల్స్ మెషీన్ల‌లోనూ అంగీక‌రిస్తున్నారు. న‌గ‌దు ర‌హిత చెల్లింపులు జ‌ర‌పాల‌నుకునే వారికి ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

నా సందేహాల‌కు స‌మాధానాలు ఎవ‌రిస్తారు?

నా సందేహాల‌కు స‌మాధానాలు ఎవ‌రిస్తారు?

ప‌థ‌కం టోల్ ఫ్రీ నంబ‌ర్లు

నేష‌న‌ల్ టోల్‌ఫ్రీ : 1800 11 0001 ; 1800 180 1111

తెలంగాణ‌: 1800 425 8933

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: 1800 425 8525

ప‌థకానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా ఆయా నంబ‌ర్ల‌కు ఫోన్ చేయ‌వ‌చ్చు. నేష‌న‌ల్ టోల్‌ఫ్రీ నంబ‌ర్ల‌లో హిందీ, ఆంగ్ల భాష‌ల్లో మాట్లాడ‌వ‌చ్చు.

జ‌న్‌ధ‌న్ యోజ‌న ప్ర‌గ‌తి నివేదిక‌:

జ‌న్‌ధ‌న్ యోజ‌న ప్ర‌గ‌తి నివేదిక‌:

జ‌న్‌ధ‌న్ యోజ‌న ప‌థ‌కం కింద ఇప్ప‌టిదాకా 24.98 కోట్ల ఖాతాలను తెరిచారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన ఖాతాలు 15.33 కోట్లుండ‌గా, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు సంబంధించి 9.66 కోట్ల ఖాతాలున్నాయి. రూపే కార్డులు 19 కోట్ల‌కు పైగా జారీ కాగా ఆధార్ కార్డుల‌తో ఖాతాల అనుసంధానం నెమ్మ‌దిగా జ‌రుగుతోంది. సున్నా నిల్వ ఉన్న ఖాతాల శాతం 23.67% ఉండ‌గా ఖాతాల్లోని మొత్తం నిల్వ ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం మొత్తం ఖాతాల్లోని నిల్వ 44వేల 221 కోట్లుగా ఉంది. ఈ విధంగా చూస్తే ఒక్కో ఖాతాలోని స‌గ‌టు నిల్వ రూ. 1700కు పైగానే ఉంది.

ఇదివ‌ర‌కే ఖాతా ఉన్నవారు ఈ ప‌థ‌కం కింద ఖాతా తెర‌వొచ్చా?

ఇదివ‌ర‌కే ఖాతా ఉన్నవారు ఈ ప‌థ‌కం కింద ఖాతా తెర‌వొచ్చా?

ఇదివ‌ర‌కే ఏదో బ్యాంకులో ఖాతా ఉన్న‌వారు మ‌ళ్లీ ఖాతా తెర‌వాల్సిన అవ‌స‌రం లేదు. రూపే కార్డుతో మీకు ప్ర‌యోజ‌నాల‌న్నీ క‌ల్పిస్తారు. మీరు చేయాల్సింద‌ల్లా మీకు రూపే కార్డు లేక‌పోతే బ్యాంకుకు వెళ్లి రూపే కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేయాలి. ఓవ‌ర్‌డ్రాప్ట్ సౌక‌ర్యం నిబంధ‌న‌ల ప్ర‌కారం క‌ల్పిస్తారు.

 భార్యా,భ‌ర్త‌లిద్ద‌రికీ జ‌న్ ధ‌న్ ఖాతాలుంటే

భార్యా,భ‌ర్త‌లిద్ద‌రికీ జ‌న్ ధ‌న్ ఖాతాలుంటే

ఒక కుటుంబంలో భార్యా,భ‌ర్త‌లిద్ద‌రూ జ‌న్‌ధ‌న్ ఖాతాలు తెరిచి ఉన్నా ఖాతాకు ప్ర‌త్యేకంగా ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. రెండు ఖాతాల‌కు వేర్వేరుగా ప్ర‌మాద బీమా, జీవిత బీమా ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తారు. ఓవ‌ర్‌డ్రాఫ్ట్ సౌక‌ర్యం మాత్రం కుటుంబంలో ఒక‌రికే అంద‌జేస్తారు.

Read more about: pmjdy jan dhan yojana
English summary

జ‌న్ ధ‌న్ యోజ‌న ద్వారా ఖాతాదారుకు రూ.1 ల‌క్ష బీమా | what is the use of PM jan dhan yojana

The large number of accounts opened in the Prime Minister Jan Dhan Yojana (PMJDY) offers an opportunity to trigger a hurricane by applying an appropriate form of benefit transfer
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X