For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను తెర‌వండిలా...

|

ఒక‌టి కంటే ఎక్కువ బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేసి ఉండి, పాల‌సీ ప‌త్రాల‌ను జాగ్ర‌త్త ప‌రుచుకోవ‌డం ఒక్కోసారి క‌ష్ట‌మైన ప‌నే. అందుకే ఈ-ఇన్సూరెన్స్ వ‌చ్చింది. ఇది ఒక ఆన్‌లైన్ అకౌంట్‌. దీని ద్వారా మీ పాల‌సీల‌ను ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవ‌చ్చు. ఐఆర్‌డీఏ ప్ర‌వేశ‌పెట్టిన ఇన్సూరెన్స్ రిపాజిట‌రీ వ్య‌వ‌స్థ ద్వారా పాల‌సీదారుల‌కు పేప‌ర్ క‌ష్టాలు త‌ప్పాయి. అంతే కాకుండా పాల‌సీల‌కు సంబంధించి పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంది. ఈ-ఇన్సూరెన్స్ ఖాతా తెర‌వ‌డం ద్వారా పాల‌సీదారుడు లైఫ్‌, జ‌న‌ర‌ల్‌, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను ఒకే ద‌గ్గ‌ర భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. అంతే కాకుండా మీ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఎక్క‌డైనా తెరిచి చూసుకోవ‌చ్చు. అంతే కాకుండా లావాదేవీల‌ను సైతం చూడ‌వ‌చ్చు.

e-Insurance account

దేశంలో మూడు ఇన్సూరెన్స్ రిపాజిట‌రీలు ఉన్నాయి.
అవి: సెంట్ర‌ల్ ఇన్సూరెన్స్ రిపాజిట‌రీ లిమిటెడ్‌(సీఐఆర్‌ఎల్‌)
నేష‌న‌ల్ ఇన్సూరెన్స్-పాల‌సీ రిపాజిట‌రీ(ఎన్ఐఆర్‌)
స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌హెచ్‌సీఐఎల్‌)
ఖాతాదారుల సౌక‌ర్యాన్ని బ‌ట్టి ఇందులో ఏదో ఒక రిపాజిట‌రీని ఎంచుకోవ‌చ్చు.
ఈ-ఇన్సూరెన్స్ ఖాతా తెర‌వ‌డం ఎలా?

  • మొద‌ట ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెనింగ్ ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి
  • ఫారంను నింపాలి
  • దాని త‌ర్వాత సంబంధిత రిపాజిట‌రీకి ఆ ఫారాన్ని పంపాలి
  • రిపాజిట‌రీ ఈ-అకౌంట్ నంబ‌రును జ‌న‌రేట్ చేసి బీమా సంస్థ‌కు పంపుతుంది.
  • బీమా సంస్థ మీకు అప్‌డేట్ ఇస్తుంది.
  • దాని త‌ర్వాత ఈ-పోర్ట‌ల్‌లో పాల‌సీ అప్‌లోడ్ గురించిన స‌మాచారం అప్‌డేట్ అవుతుంది.

గ‌మ‌నిక‌: అయితే ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ ఫారం స‌బ్‌మిట్ చేయాలంటే మీకు పాన్ లేదా ఆధార్ ఉండాలి.

English summary

ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను తెర‌వండిలా... | How to open eInsurance account

This account facilitates the policyholder to hold all types of insurance policies such as Life, General and Group Health in a single electronic insurance account. Account can be accessed online anytime, anywhere. Also, transaction can be viewed anytime.
Story first published: Monday, October 3, 2016, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X