For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలాఖ‌ర్లో డ‌బ్బు మిగులుతోందా? ఈ విధంగా చేయండి..

|

ప్ర‌తి నెలా అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుంటూ ఎలాగోలా రూ. 5000 వ‌రకూ డ‌బ్బు మిగుల్చుతున్నారా? అది చిన్నమొత్తంలానే కనిపించొచ్చు. దాన్ని పెట్టుబ‌డిగా పెట్టి పెద్ద‌మొత్తంలో డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. అయితే క్ర‌మంగా పెట్టుబ‌డి పెట్ట‌డ‌మే దీనికి మార్గం. ఉన్న మిగులుతోనే ఎక్కువ డ‌బ్బు సంపాదించేందుకు లేక బాగా ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉత్త‌మ స‌ల‌హాల‌ను ఇక్క‌డ చూడొచ్చు. ఇది కింది వాటిల్లో ఇది వ‌ర‌కూ డ‌బ్బు పెట్ట‌నివారికే.

రూ. 50 ల‌క్ష‌ల ట‌ర్మ్‌ప్లాన్‌

రూ. 50 ల‌క్ష‌ల ట‌ర్మ్‌ప్లాన్‌

30 ఏళ్ల రాకేష్ మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. అత‌డు ఇంత వ‌ర‌కూ బీమా పాల‌సీ తీసుకోలేద‌నుకుందాం. సంవ‌త్స‌రానికి రూ. 5 లక్ష‌లు సంపాదిస్తున్నాడు. బీమా లేక‌పోతే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇలాంటి వారు రూ. 50 లక్ష‌ల బీమా హామీ మొత్తం ఉండే ట‌ర్మ్ ప్లాన్ తీసుకోవ‌డం సూచ‌నీయం. ప్రీమియంలు 20 ఏళ్ల పాల‌సీల‌కు ఏడాదికి రూ.25 వేల వ‌ర‌కూ ఉండొచ్చు. మీపైన ఆధార‌ప‌డ‌ద‌గిన వారు ఉండి మీరు ఇదివ‌ర‌కూ పాల‌సీ తీసుకుని ఉండ‌క‌పోతే క‌చ్చితంగా పాల‌సీ తీసుకుంటే మంచిది.

ఆరోగ్య బీమా

ఆరోగ్య బీమా

ఆసుప‌త్రి ఖ‌ర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. ఆరోగ్య బీమా పాల‌సీ ఉంటే నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల్లో న‌గ‌దు ర‌హిత చికిత్స చేయించుకోవ‌చ్చు. అయితే రూ. 5 వేల‌తో తీసుకునే పాల‌సీల్లో వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు చాలా త‌క్కువ ఉంటాయి. ఇంత త‌క్కువ డ‌బ్బుతో ఫ్యామిలీ ఫ్లోట‌ర్ తీసుకోవ‌చ్చు. 30 ఏళ్ల పెళ్లైన యువ‌కుడు రూ. 2 ల‌క్ష‌ల క‌వ‌రేజీకి రూ. 2900 వార్షిక ప్రీమియంతో ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీల‌ను ఎంచుకోవ‌చ్చు. ప్రీమియం త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల పాల‌సీలో వ‌ర్తించ‌ని అంశాలు చాలా ఉంటాయి. ఈ ర‌క‌మైన పాల‌సీ తాత్కాలికంగా మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌దు. స‌రిప‌డా డ‌బ్బు ఉన్న‌ప్పుడు స‌మ‌గ్ర ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవ‌డం మంచిది.

మ్యూచువ‌ల్ ఫండ్స్‌

మ్యూచువ‌ల్ ఫండ్స్‌

మొద‌టిసారి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునేవారికి రూ. 5000 స‌రైన మొత్త‌మే. దీనితో ఒకేసారి ఒక ఫండ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. లేక‌పోతే పిప్‌(క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌)ను ప్రారంభించ‌వ‌చ్చు. మీ రిస్క్ సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి ఈక్విటీ లేదా డెట్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. డెట్ ఫండ్లు కాస్త లో రిస్క్, ఈక్విటీ ఎక్కువ రిస్క్‌. ప‌న్ను మిన‌హాయింపులు పొందేందుకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. రూ. 5000 ఒక ఫండ్‌లో పెట్టుబ‌డి పెడితే 12% వార్షిక రాబడితో అది ప‌దేళ్ల‌లో రూ. 15,500 అవుతుంది. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడితో వ‌డ్డీ మీద 30% ప‌న్ను ప‌డితే మీకు అదే కాలంలో రూ. 8300 మాత్ర‌మే వ‌స్తుంది.

అప్పులు తీర్చేయండి

అప్పులు తీర్చేయండి

క్రెడిట్ కార్డు అప్పు లేదా ఎవ‌రికైనా అప్పు ఉంటే దాన్ని తీర్చేయ‌వ‌చ్చు. లోన్ ఈఎమ్ఐ ఉంటే, రూ. 5000 ప్రీపెమెంట్ చేయ‌డం ద్వారా కాస్త వ‌డ్డీ భారాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. రూ. 5000 హోం లోన్ ప్రీపేమెంట్‌కు స‌రిపోక‌పోవ‌చ్చు. రూ. 5000 రుణ భారంలో ప్రీపెమెంట్‌గా అంగీక‌రించే ఏదో రుణ గ్ర‌హీత‌కు చెల్లింపులు చేసేయండి. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు పెండింగ్ ఉంటే దాన్ని క‌ట్టేయండి.

 స్టాక్స్ మీద ఆస‌క్తి ఉంటే కొనొచ్చు

స్టాక్స్ మీద ఆస‌క్తి ఉంటే కొనొచ్చు

స్టాక్ మార్కెట్ మీద ఆస‌క్తి ఉండి ఏదైనా కంపెనీ షేర్లు కొనాలంటే ఈ మొత్తం స‌రిపోతుంది. మీ రిస్క్ ఈ కొంచెం డ‌బ్బుకే ప‌రిమిత‌మ‌వుతుంది. లార్జ్ క్యాప్ బ్లూచిప్ సంస్థ‌ల‌ను ఎంచుకుంటే మ‌ధ్య‌స్థ రిస్క్‌తో దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డుల‌నే పొంద‌వ‌చ్చు. లేదు రిస్క్ తీసుకోద‌ల‌చుకుంటే మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ షేర్ల‌ను ఎంచుకోవ‌చ్చు. రిస్క్ ఉన్నా స్వ‌ల్ప‌కాలంలో రాబ‌డికి అవ‌కాశం ఉంటుంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ స్టాక్ మార్కెట్లో మొద‌టిసారి అడుగిడుతుంటే ఒక అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది.

బంగారం, వెండి లోహాలు లేదా గోల్డ్ ఈటీఎఫ్‌

బంగారం, వెండి లోహాలు లేదా గోల్డ్ ఈటీఎఫ్‌

బంగారం లేదా వెండి పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో మంచి విలువ‌నే క‌లిగి ఉంటాయి. మీ ద‌గ్గ‌ర ఎంత మిగులు ఉంటే అంత‌కు వీటిని కొనేయండి. లేదా గోల్డ్ ఈటీఎఫ్‌ను సైతం కొన‌వ‌చ్చు. అయితే మార్కెట్ ఆధారంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల ప‌నితీరు ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.

మీ పాప పేరు మీద సుక‌న్య స‌మృద్ది ఖాతా తెరిచి ఉంటే అందులో డ‌బ్బు జ‌మ చేయ‌వ‌చ్చు. ఇది వ‌ర‌కూ పీపీఎఫ్ ఖాతా ఉంటే అందులో సైతం జ‌మ చేయ‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ పండ్స్‌లో ఇప్ప‌టికే ఉన్న ఫండ్స్‌లో అద‌నంగా ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చు.

English summary

నెలాఖ‌ర్లో డ‌బ్బు మిగులుతోందా? ఈ విధంగా చేయండి.. | good financial plan if you have 5000 with you in the month end

you are left with a nice sum of Rs 5000 at the end of the month. It’s not a lot of money. But don’t underestimate its value. It’s the small investments that make a huge difference in the long term, provided you remain invested.
Story first published: Wednesday, September 28, 2016, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X