For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూఏఎన్‌ సంఖ్య‌కు, ఈపీఎఫ్ సంఖ్య‌కు ఉన్న తేడాలు ఏమిటి?

|

ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం సంస్థ‌, ఉద్యోగి ఇద్ద‌రూ క‌లిసి జ‌మ చేసే సొమ్ము ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్‌) ఖాతాలోకి వెళుతుంది. ఉద్యోగి వేత‌నంలో 12 శాతాన్ని మిన‌హాయించి, అంతే మొత్తంలో సంస్థ సైతం జ‌మ చేసి పీఎఫ్ ఖాతాలో వేస్తారు. 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా ఈపీఎఫ్ఓ వ‌ద్ద న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగులు ఒక సంస్థ‌లో ఉద్యోగం మానేసి వెళ్లిన త‌ర్వాత వారి పీఎఫ్ ఖాతాలోంచి విత్‌డ్రా చేయ‌డం ఒక్కోసారి మ‌రిచిపోతుంటారు. ఉద్యోగి, యాజ‌మాన్యం క‌లిసి ప్ర‌తి నెలా త‌మ వాటాను జ‌మ చేస్తూ ఉంటే కొంత కాలానికి అది చెప్పుకోద‌గ్గ పెద్ద‌మొత్త‌మే అవుతుంది.

 యూఏఎన్‌ సంఖ్య‌కు, ఈపీఎఫ్ సంఖ్య‌కు ఉన్న తేడాలు ఏంటి?

ఈపీఎఫ్ సంఖ్య ఏంటి?
సార్వ‌త్రిక ఖాతా సంఖ్య లేదా యూఏఎన్ రాక ముందు, ఉద్యోగ భ‌విష్య ఖాతా సంఖ్య‌(ఈపీఎఫ్‌) అనే ఒక సంఖ్య ఉండేది. దీనిలో లోపం ఏమిటంటే ఉద్యోగం మారిన‌ప్పుడ‌ల్లా ఆ సంస్థ నుంచి పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకొని, కొత్త సంస్థ‌లో మ‌ళ్లీ పీఎఫ్ సంఖ్య‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆదాయ‌పు ప‌న్నుకు ఒక‌సారి పాన్‌ను తీసుకుంటే ఎప్ప‌టికి అలాగే ఉండేలాగా, ఈ పీఎఫ్ సంఖ్య శాశ్వ‌తంగా ఒక‌టే ఉండ‌దు.

కాబ‌ట్టి సంస్థ మారిన‌ప్పుడ‌ల్లా కొత్త సంఖ్య కోసం ప్ర‌య‌త్నించాలి, శాశ్వ‌త సంఖ్య ఉండ‌దు.

యూఏఎన్ ఏ విధంగా విభిన్నం?
యూఏఎన్ యొక్క అతి పెద్ద ప్ర‌యోజ‌నం అది శాశ్వ‌త ఖాతా సంఖ్య‌. 2-3 ఏళ్ల క్రితం ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ‌(ఈపీఎఫ్ఓ) ఈ సంఖ్య‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఉద్యోగుల పీఎఫ్ సంబంధిత అంశాల‌ను ఇది సుల‌భ‌త‌రం చేసింది. యూఏఎన్ శాశ్వ‌త‌మైన‌ది, ఉద్యోగం మారినప్పుడు లేదా డ‌బ్బు విత్‌డ్రా చేసిన త‌ర్వాత ఈ సంఖ్య మార‌దు.

ప్ర‌స్తుతం ఉన్న విధానం ప్ర‌కారం మీరు ఉద్యోగం కోల్పోయి, రెండు నెల‌ల పాటు ఉద్యోగం లేకుండా ఉన్నార‌నుకుందాం. మీరు పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మీరు కొత్త ఉద్యోగం తెచ్చుకున్నార‌నుకుంటే, ఇది వ‌ర‌కే ఉన్న యూఏఎన్‌ను కొత్త సంస్థ‌లో స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

యూఏఎన్ 12 అంకెల శాశ్వ‌త ఖాత సంఖ్య‌. ఇంత‌కుముందు ప్ర‌తిసారి పీఎఫ్ ఖాతా సంఖ్య‌ను ఇవ్వాల్సి వ‌చ్చేది. దానికి బ‌దులుగా ఈ సంఖ్య‌ను ఇస్తే స‌రిపోతుంది. మీకు మీ యూఏఎన్ సంఖ్య గురించి తెలియ‌క‌పోతే మీ యాజ‌మాన్యాన్ని అడిగి తెలుసుకోవ‌చ్చు.

ఒక‌సారి మీ యూఏఎన్ సంఖ్య తెలిస్తే మీరు మీ పీఎఫ్‌ స్టేట్‌మెంట్‌ను చూడ‌టంతో పాటు పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మీ బ్యాలెన్స్‌కు సంబంధించిన క‌చ్చిత‌మైన స‌మాచారంతో పాటుగా వ‌డ్డీ లాంటి ఇత‌ర వివ‌రాల‌ను సులువుగా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు.

యూఏఎన్, ఈపీఎఫ్ సంఖ్య మ‌ధ్య తేడాల‌ను చూద్దాం
యూఏఎన్ అనేది ఒక శాశ్వ‌త సంఖ్య కాగా, పీఎఫ్ ఒక్కో సంస్థ కేటాయించే నంబ‌రు కావున అది ఉద్యోగం మారిన‌ప్పుడల్లా మారుతూ ఉంటుంది. ప్ర‌స్తుతం పీఎఫ్ నంబ‌రు వాడ‌కం అంత‌గా అవ‌స‌రం ప‌డ‌కుండా, ఆ స్థానంలోకి యూఏఎన్ వ‌చ్చేసింది.

పీఎఫ్‌తో పోలిస్తే యూఏఎన్ ద్వారా జ‌రిగే బ‌ద‌లాయింపులు వేగంగా ఉంటాయి. ఉద్యోగులు ఆధార్ సంఖ్య‌ను యూఏఎన్‌కు జ‌త చేసి ఉంటే, పీఎఫ్ క్లెయింల‌ను ఒక వారంలోపే పూర్తిచేసేందుకు
ఈపీఎఫ్ఓ ప్ర‌య‌త్నిస్తోంది.

యూఏఎన్, పీఎఫ్ సంఖ్య‌ల మ‌ద్య ప్ర‌ధాన బేధం ఏంటంటే యూఏఎన్ చాలా విష‌యాల‌ను సుల‌భ‌త‌రం చేసింది. క్లెయిం సెటిల్మెంట్‌ను వేగ‌వంతం చేయ‌డంతో పాటు పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకొచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈపీఎఫ్‌కు అద‌నంగా జ‌మ అయిన యూఏఎన్ చాలా సులువుగా ఉప‌యోగించ‌డానికి వీలుండ‌టంతో గ‌త కొద్ది నెల‌ల్లో చాలా ప్రాచుర్యం పొందింది.

English summary

యూఏఎన్‌ సంఖ్య‌కు, ఈపీఎఫ్ సంఖ్య‌కు ఉన్న తేడాలు ఏమిటి? | What Is The Difference Between UAN No And EPF No?

Provident Fund Contribution is around 12 per cent for the employee with an equal number coming from the employer. Any establishment that has more than 20 employees has to register with the EPFO.The Provident Fund is a contribution that is made by both employers and employees towards building a retirement corp
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X