For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విద్యాల‌క్ష్మి పోర్ట‌ల్ ద్వారా విద్యా రుణం: ఐదు ముఖ్య విష‌యాలు

|

ఇదివ‌ర‌కూ విద్యా రుణం పొందాలంటే బ్యాంకు శాఖ‌ల‌కు వెళ్లి అన్ని వివ‌రించి రుణ ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందాల్సి వ‌చ్చేది. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గ‌మ‌నించిన ప్ర‌భుత్వం దీన్ని సుల‌భ‌త‌రం చేసే ప్ర‌య‌త్నం చేసింది. భార‌తీయ బ్యాంకుల సంఘం, కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ‌, ఆర్థిక శాఖ‌ల ఉమ్మ‌డి సౌజ‌న్యంతో ఒక ఉమ్మ‌డి పోర్ట‌ల్‌ను తీసుకొచ్చింది. దీనిపేరే విద్యాల‌క్ష్మి(www.vidyalakshmi.co.in).

ఈ కొత్త సౌక‌ర్యం వ‌చ్చిన త‌ర్వాత విద్యార్థులు లేదా వారి త‌ల్లిదండ్రులు ప్ర‌తి బ్యాంకుకు నేరుగా వెళ్లాల్సిన అవ‌స‌రం త‌ప్పుతుంది. ఒక్క‌సారి విద్యాల‌క్ష్మి పోర్ట‌ల్‌లో న‌మోదు చేసుకుని మూడు బ్యాంకుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. అన్ని అర్హ‌త‌లు చూసిన త‌ర్వాత సంబంధిత బ్యాంకులు అర్హుల‌కు ప్రాథ‌మిక స‌మాచారాన్ని అందిస్తాయి. ఇంతే కాకుండా వివిధ ప్ర‌భుత్వ ఉప‌కార వేత‌నాల‌కు సంబంధించిన స‌మాచారం సైతం ఇందులో ల‌భిస్తుంది.

1)ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు విద్యార్ధులు విద్యాల‌క్ష్మి పోర్ట‌ల్‌లో త‌మ ఖాతాను న‌మోదు చేసుకోవాలి. త‌ర్వాత కొన్ని వివ‌రాల‌ను నింప‌డం ద్వారా ఉమ్మ‌డి విద్యా రుణ ద‌ర‌ఖాస్తు ఫారాన్ని పూరించాలి.
ఫారంను నింపిన త‌ర్వాత‌, ద‌ర‌ఖాస్తుదారు విద్యారుణం కోసం శోధించ‌వ‌చ్చు. విద్యార్థి అవ‌స‌రాలు, అర్హ‌త‌, సౌక‌ర్యానికి అనుగుణంగా ద‌ర‌ఖాస్తు చేసే వీలుంటుంది.
2) ఒక్కో బ్యాంకు ఒక్కో ర‌క‌మైన రుణ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఆంధ్రా బ్యాంకు ప‌ట్టాభి విద్యా జోతి పేరుతో, కెన‌రా బ్యాంకు విద్యాసాగ‌ర్ పేరుతో విద్యా రుణాల‌ను అందిస్తున్నాయి. బ్యాంకును బ‌ట్టి విద్యా రుణానికి త‌మ‌వైన ప్ర‌త్యేక‌త‌లుంటాయి. వెబ్‌సైట్‌లోని సెర్చ్ పేజీలో ఈ రుణ ప‌థ‌కాల‌ను గురించి చూడొచ్చు.
3) వివిధ బ్యాంకుల్లో వేర్వేరు ప‌థ‌కాల‌కు సంబంధించి ఒకేచోట ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు వీలుక‌ల్పించేదే ఉమ్మ‌డి విద్యా రుణ ద‌ర‌ఖాస్తు ఫారం. విద్యాల‌క్ష్మి పోర్ట‌ల్‌కు విద్యార్థులు న‌మోదు చేసుకున్న త‌ర్వాత మొద‌ట చేయాల్సిన ప‌ని ఈ ఫారాన్ని నింప‌డ‌మే. త‌ర్వాత మీకు అనువైన బ్యాంకుల‌కు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.
4) బ్యాంకుల‌న్నీ ప్ర‌త్యేకంగా ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి త‌మ స్టేట‌స్‌ను అప్‌డేట్ చేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ద‌ర‌ఖాస్తుదారు డ్యాష్‌బోర్డ్‌పై త‌మ స్థితిగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు.
ఏదైనా బ్యాంకు రుణ‌మిచ్చేందుకు అంగీక‌రిస్తే వారు తెలిపిన ప‌త్రాలతో బ్యాంకుకు వెళ్లాలి. కొన్ని బ్యాంకులు తాము రూపొందించిన నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేని ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం సైతం ఉంది.
5) ఉమ్మ‌డి విద్యా రుణ ద‌ర‌ఖాస్తు ఫారం ద్వారా విద్యార్థి గ‌రిష్టంగా మూడు బ్యాంకుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌వ‌చ్చు.

education loan through vidyalakshmi portal

బ్యాంకుల విద్యా రుణ ప‌థ‌కాల‌కు సంబంధించిన స‌మాచారం

  1. విద్యార్ధులంద‌రికీ ఒకే విద్యా రుణ ద‌ర‌ఖాస్తు ఫారం
  2. వివిధ బ్యాంకుల‌కు ఒకే ఫారం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసే వీలు
  3. విద్యార్థుల రుణ ద‌ర‌ఖాస్తుల‌ను బ్యాంకులు డౌన్‌లోడ్ చేసుకునే స‌దుపాయం
  4. రుణ ద‌ర‌ఖాస్తు స్థితిని బ్యాంకులు అప్‌లోడ్ చేసే సౌక‌ర్యం
  5. విద్యార్థుల‌కు రుణాల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లు, సందేహాలు ఉంటే ఈమెయిల్ పంపే వీలు
  6. ప్ర‌భుత్వ ఉపకార వేత‌నాల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తును, జాతీయ ఉప‌కార‌వేత‌న పోర్ట‌ల్‌తో అనుసంధానించ‌డం

English summary

విద్యాల‌క్ష్మి పోర్ట‌ల్ ద్వారా విద్యా రుణం: ఐదు ముఖ్య విష‌యాలు | Education loan through vidyalakshmi portal

Vidya Lakshmi is a first of its kind portal for students seeking Education Loan. This portal has been developed under the guidance of Department of Financial Services, (Ministry of Finance) , Department of Higher Education (Ministry of Human Resource Development) and Indian Banks Association (IBA).The portal has been developed and being maintained by NSDL
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X