For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎమ్ మెషీన్‌లో న‌గ‌దు ఎలా డిపాజిట్ చేయాలి?

|

ఈ రోజుల్లో బ్యాంకుకు వెళ్లి న‌గ‌దు డిపాజిట్ చేయాలంటే అంద‌రికీ కుద‌ర‌దు. అందుకే ఐసీఐసీఐ బ్యాంకు ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో క్యాష్ డిపాజిట్ మెషీన్‌ల‌ను ఏర్పాటు చేసింది. దీని వ‌ల్ల స‌మ‌యం ఆదా అవ‌డంతో పాటు బ్యాంకుకు వెళ్లాల్సిన శ్ర‌మ త‌ప్పుతుంది.
చాలా సంద‌ర్భాల్లో ఈ డిపాజిట్‌ మెషీన్ల‌న్నీ ఒకేలా ఉంటాయి.

ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎమ్ మెషీన్‌లో న‌గ‌దును ఎలా డిపాజిట్ చేయాలి?
ఏటీఎమ్ మెషీన్‌లో డ‌బ్బు జ‌మ‌చేయాలంటే రెండు ప‌ద్ద‌తులు ఉన్నాయి: ఒక‌టి ఏటీఎమ్‌ను ఉప‌యోగించి, మ‌రో విధానం ఏటీఎమ్ కార్డు ఉప‌యోగించే అవ‌స‌రం లేకుండా.

Depositing cash in ATM Machine

ఏటీఎమ్ కార్డు లేకుండా ఏటీఎమ్ మెషీన్‌లో న‌గ‌దును ఎలా డిపాజిట్ చేయాలో చూద్దాం
1) మొద‌ట కార్డ్‌లెస్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.
2) తెర మీద అకౌంట్ నంబ‌రు ఎంట‌ర్ చేయ‌మ‌ని క‌న‌బ‌డుతుంది. అకౌంట్ నంబ‌రు న‌మోదు చేసిన త‌ర్వాత క్యాష్ డిపాజిట్ మెషీన్ తెర‌వ‌బ‌డుతుంది.
3) మెషీన్‌లో న‌గ‌దునును ఉంచండి.
4)న‌గ‌దును అంగీక‌రించేందుకు మెషీన్ అడుగుతుంది. అంగీక‌రించే బ‌ట‌న్‌ను నొక్కండి.
5)ఐసీఐసీఐ ఏటీఎమ్ మెషీన్ న‌గ‌దును లెక్కించి తెర‌పై డిస్‌ప్లే చేస్తుంది. న‌గ‌దును నిర్ధారించాలి.
6)న‌గ‌దును నిర్ధారించిన త‌ర్వాత మెషీన్ పేరు, అకౌంటు నంబ‌రును చూపుతుంది, దాని త‌ర్వాత న‌గ‌దు జ‌మ అవుతుంది. ఏటీఎమ్ మెషీన్‌లో భ‌ద్ర‌త‌తో కూడుకున్న మంచి మార్గ‌మది. ఒక‌వేళ పేరు, అకౌంటు నంబ‌రులో ఏది త‌ప్పు ఉన్నా అంగీక‌రించ‌కూడ‌దు.
పేరు, అకౌంటు నంబ‌రు స‌రైన‌వ‌ని ధ్రువీక‌రించుకున్న త‌ర్వాత ముందుకు కొన‌సాగండి. ఖాతాకు జ‌మ అవ్వాల్సిన డ‌బ్బును నిర్దారించండి.
ఈ ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాత అకౌంట్లో డ‌బ్బు క్రెడిట్ అయిన‌ట్లుగా ఒక ర‌శీదు వ‌స్తుంది. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం దీనిని జాగ్ర‌త్త‌ప‌రుచుకోవ‌చ్చు.
ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎమ్ మెషీన్‌లో డ‌బ్బు డిపాజిట్ చేయ‌డం సుర‌క్షితమేనా?
ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎమ్ మెషీన్‌లో డిపాజిట్ చేసే విధానం సుర‌క్షితం, ఇందులో ఎలాంటి అనుమానాల‌కు తావుండ‌దు. ఈ ప్ర‌క్రియను మేము ప్ర‌య‌త్నించి ప‌రీక్షించాము. ఇది చాలా సులువుగా ఉంది. అయితే డ‌బ్బు డిపాజిట్ చేసే క్ర‌మంలో తుదిగా అంగీక‌రించేట‌ప్పుడు ఖాతా నంబ‌రు, పేరు క‌చ్చిత‌మైన‌వ‌నే అనే నిర్దారించి ముందుకు సాగండి.
ఈ విధానంలో ఏ ఖాతాకు డ‌బ్బు జమ చేయాల‌నుకుంటున్నారో క‌చ్చితంగా అదే ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
చాలా ఏటీఎమ్ డిపాజిట్ మెషీన్‌లు ఒక‌దాని నుంచి మ‌రోటి కొంచెం వేరుగా ఉంటాయి. డ‌బ్బు విత్‌డ్రా చేసేందుకు మ‌నం ఉప‌యోగించే ఏటీఎమ్‌లు కాస్త వేర్వేరుగా ఎలా ఉంటాయో, ఈ క్యాష్ డిపాజిట్ మెషీన్‌లు కూడా అంతే.
చిరిగిపోయిన/ పాడైపోయిన నోట్లు లేదా న‌కిలీ నోట్లు ఉంటే, మెషీన్ తిర‌స్కించే అవ‌కాశం ఉంది. నోటు మ‌డ‌త‌లు ప‌డి స‌రిగా లేకున్నా క్యాష్ డిపాజిట్ మెషీన్ నోట్ల‌ను తీసుకోదు. కాబ‌ట్టి నోట్ల‌న్నీ స‌రైన క్ర‌మంలో ఉండేలా చూసుకుని మెషీన్‌లో పెట్టండి.

English summary

ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎమ్ మెషీన్‌లో న‌గ‌దు ఎలా డిపాజిట్ చేయాలి? | Depositing cash in ICICI Cash Deposit Machine

Depositing cash in an ATM machine is safest and time saving. Ensure you entered correct account number.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X