For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబడి సాధనం: ఎఫ్‌డిపై ఎందుకంత మోజు

By Nageswara Rao
|

మధ్యతరగతి ప్రజల నుంచి ఇన్వెస్టర్ల వరకు ఆకర్షిస్తున్న పెట్టుబడి సాధనాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఒకటి. మీరు పెట్టుబడిన మూలధనానికి భద్రత ఇవ్వడంతో పాటు ఖచ్చితమైన రిటర్నలను అందించడమే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ప్రత్యేకత. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో వడ్డీరేటు కాస్త తక్కువగా ఉంటాయి.

దీంతో ఇన్వెస్టర్లు ఎక్కువ రిటర్నులను ఇచ్చే ఈక్విటీ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినప్పటికీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఖచ్చితమైన రిటర్నులు అందడమే ఇందుకు ప్రధాన కారణం.

అంతేకాదు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కొల్లాటరల్‌గా పెట్టి ఎఫ్‌డి మొత్తంలో 75 శాతం వరకు రుణాన్ని తీసుకునే వెసులుబాటు ఉండటం ఇన్వెస్టర్లకు కలిసొచ్చే అంశం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మెచ్యూరిటీ విషయంలో కస్టమర్లకు సానుకూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లకు వీటివైపు మొగ్గు చూపుతున్నారు.

వడ్డీ రేట్లు ఎంతో కీలకం..

వడ్డీ రేట్లు ఎంతో కీలకం..

వడ్డీ రేటును ఆధారంగా చేసుకుని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎఫ్‌డిల కోసం అందుబాటులో ఉన్న సొమ్మును చిన్న చిన్న మొత్తాలుగా విభజించి విభిన్న కాలపరిమితులకు కేటాయించాలి. దీనివల్ల వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నా పెట్టుబడులకు భద్రత ఉంటుంది. ఒకసారి సొమ్ము మెచ్యూరిటీ కాగానే దాన్ని మళ్లీ పెట్టుబడిగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ వడ్డీ రేటును పొందాలనుకుంటే.. ప్రతి మూడు నెలలకు ఒకసారి చక్ర వడ్డీ ఉండే ఎఫ్‌డిలను ఎంచుకోవడం మంచిది.

 ఎఫ్‌డిలతో ఎన్నో అదనపు ప్రయోజనాలు

ఎఫ్‌డిలతో ఎన్నో అదనపు ప్రయోజనాలు

కస్టమర్ల విశ్వాసాన్ని సొంతం చేసుకునే దృక్పథంతో ఉండే కార్పొరేట్లు వినూత్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి ఎఫ్‌డిలపై ఎక్కువ వడ్డీ రేటు ఉంటోంది. వీటిలో పెట్టుబడులు పెట్టినప్పుడు అత్యవసర సమయాల్లో వెంటనే నగదులోకి మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.

 ఎవరికి ఏం కావాలో ఆ విధంగా....

ఎవరికి ఏం కావాలో ఆ విధంగా....

వ్యక్తులు, కంపెనీలు, సొసైటీలు, క్లబ్‌లు, ట్రస్టులను దృష్టిలో ఉంచుకుని విభిన్న రకాల, కస్టమైజ్డ్‌ డిపాజిట్‌ ఆప్షన్లను కార్పొరేట్లు అందిస్తున్నాయి. వీటి కాలపరిమితి 12 నెలల నుంచి 120 నెలల వరకు ఉంటుంది. వీటిపై వడ్డీ రేటు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్‌ 11 (5) (జీగీ) కింద పన్ను మిన హాయింపు కూడా లభిస్తుంది. మహిళల కోసం ప్రత్యేకంగా వచ్చిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు ఉంటుంది. సింగిల్‌ డిపాజిట్‌ ఖాతా అయితే ఉచితంగా బీమా కవరేజీని అందిస్తున్నారు. జాయింట్‌ డిపాజిట్‌ ఖాతా అయితే ప్రతి తొలి డిపాజిటర్‌కు ఉచిత బీమా కవరేజీ ఉంటుంది. ఇలాంటి డిపాజిట్లను 10,000 రూపాయలతో ప్రారంభించవచ్చు.

 ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిని ఇతర వనరుల నుంచి ఆదాయంగా పరిగణిస్తారు. ఎఫ్‌డిలపై వచ్చే వడ్డీ ఆదాయం 10,000 రూపాయల వరకు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంతకు మించితే బ్యాంకులు టిడిఎస్‌ కింద 10 శాతం నేరుగా కట్ చేస్తారు. పాన్‌ కార్డు లేని సందర్భంలో ఇది 20 శాతం ఉంటుంది. పన్ను ఆదాయం బ్రాకెట్‌లో లేని ఎఫ్‌డి ఖాతాదారులు ఫామ్‌ 15జిని సమర్పించి టిడిఎస్‌ నుంచి తప్పించుకునే వెసులుబాటు ఉంది. సీనియర్‌ సిటిజన్లు ఫామ్‌ 15 హెచ్‌ను సమర్పించి వడ్డీ ఆదాయంపై మినహాయింపులు పొందవచ్చు.

English summary

పెట్టుబడి సాధనం: ఎఫ్‌డిపై ఎందుకంత మోజు | Is a fixed deposit to investors friendly

Is a fixed deposit to investors friendly.
Story first published: Tuesday, April 26, 2016, 15:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X