For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబడి విషయంలో మహిళలు చేసే పొరపాట్లు

By Nageswara Rao
|

మహిళలు డబ్బుని పొదుపుగా ఖర్చు చేస్తారని అందరూ అంటుంటారు. అది నిజమేనా? డబ్బు ఖర్చు విషయంలో మహిళా ఉద్యోగినులు చేసే ప్రధానమైన పొరపాట్లపై తాజాగా ఓ అధ్యయనం వెలువడింది. నలభై నాలుగువేల మంది మహిళలపై చేసిన ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాలేంటో చూద్దాం.

* మహిళలు డబ్బు ఖర్చు విషయంలో పొదుపుగానే ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో అవగాహన లేకపోవడం అనేది వారికి ఆర్ధిక నష్టాన్ని చేకూరుస్తోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

* వాటిల్లో ముఖ్యమైనదిగా ఉద్యోగం మారినప్పుడల్లా పీఫ్ ఖాతాను మార్చడం. దీని వల్ల వారికి వృద్ధాప్యంలో అవసరమైన ఫించన్ విషయంలో తక్కువ లాభం పొందుతున్నారట. ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త ఖాతా తెరవడం కూడా పాతది కొనసాగించడమే దీనికి పరిష్కారం అంటున్నారు నిపుణులు.

Why Don't More Women Invest In The Stock Market?

* పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు మగవారితో పోలిస్తే మహిళలు 'నిపుణులు' అనే పదం వినబడగానే వారిపై ఎక్కువగా ఆధారపడతారట. కేవలం సంతకం పెట్టడానికి పరిమితవుతున్నారట. దీనివల్ల నష్టాలూ అదే స్థాయిలో పొందుతున్నారు.

* 'చిన్న మొత్తాలు ఏ పొదుపు చేస్తాయిలే' అనే నిర్లక్ష్యం చాలామందిలో కనిపించింది అని అధ్యయనం తెలిపింది. అదెంత చిన్న మొత్తమైనా సరే, క్రమం తప్పకుండా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో పెద్దమొత్తంగా మారివారికి అండగా నిలుస్తుంది.

* తప్పనిసరి అవసరాలను గుర్తించి, పెట్టుబడి పెట్టె విషయంలో ఇంకా స్పష్టత సాధించాల్సి ఉందని అంటున్నారు నిపుణులు. ఓ పట్టుచీరని సాధారణంగా ఏడాది, రెండేళ్లకు ఓసారి తప్ప కట్టరు. కానీ వాటిని వేల రూపాయలు పెట్టి కొంటారు.

ఏది అవసరమో దానిపై పెట్టుబడి పెట్టే విషయంలో ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే బాగుంటుందని అధ్యయనం వెల్లడించింది.

English summary

పెట్టుబడి విషయంలో మహిళలు చేసే పొరపాట్లు | Why Don't More Women Invest In The Stock Market?

If I had the power, I would ask the government to take action against any institution that advertises a savings account as “high yield” when the annual interest rate paid to the saver is less than 1 percent.
Story first published: Friday, February 12, 2016, 15:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X